సాక్షి, హైదరాబాద్: మంత్రులు, స్పీకర్, అధికారపార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, వారి అనుచరులపై పెద్ద సంఖ్యలో ఉన్న క్రిమినల్ కేసులను రాష్ట్రప్రభుత్వం ఉపసంహరించడంపై ఉమ్మడి హైకోర్టులో మరో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. కళకింతులైన అధికారపార్టీ ప్రజాప్రతినిధులపై ఇలా కేసులు ఉపసంహరించడం అధికార దుర్వినియోగమే అవుతుందని, అందువల్ల కేసుల్ని ఉపసంహరిస్తూ ప్రభుత్వం జారీచేసిన 13 జీవోలను రద్దు చేయాలని కోరుతూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment