ఖమ్మం స్పోర్ట్స్: అథ్లెటిక్స్ రాష్ట్రస్థాయి అండర్-14, 17 బాలబాలికల ఛాంపియన్‌షిప్ పోటీలు మంగళవారం ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఘనంగా ముగిశాయి. అండర్-17 బాలబాలికల విభాగాల్లో ఛాంపియన్‌షిప్‌ను ఖమ్మం జిల్లా క్రీడాకారులు; అండర్-14 బాలబాలికల విభాగాల్లో ఛాంపియన్‌షిప్‌ను రంగారెడ్డి జిల్లా క్రీడాకారులు కైవసం చేసుకున్నారు.
డిసెంబర్‌లో జార్ఖండ్‌లోని రాంచీలో జరిగే జాతీయస్థాయి పోటీలకు అండర్-17 బాలికల విభాగంలో 27మంది, బాలుర విభాగంలో 27మంది, అండర్-14 బాలికల విభాగంలో 14మంది, బాలుర విభాగంలో 17మంది ఎంపికయ్యారు. విజేతలకు బహుమతులను ఖమ్మం డీఎస్‌డీవో కబీర్ దాసు ప్రదానం చేశారు.
జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర పరిశీలకులు ఎం.శ్రీరాంరెడ్డి, సంజీవరావు, జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి సయ్యద్ ఉస్మాన్, తెలంగాణ వ్యాయమ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.రామయ్య, అథ్లెటిక్స్ కోచ్ గౌస్‌పాషా, పీఈటీ, పీడీలు షఫీ అహ్మద్, రమణ, సుధాకర్, శ్రీనివాస్, మురళి, టి.భాగ్య, సుధాకర్ రాజు, శ్యాంబాబు, సాంబమూర్తి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఛాంపియన్‌షిప్ విజేతల వివ రాలు
అండర్-14 బాలికల విభాగంలో ప్రథమ స్థానం- రంగారెడ్డి, ద్వితీయ స్థానం- కరీంనగర్, తృతీయ స్థానం- నల్గొండ.
అండర్-14 బాలుర విభాగంలో ప్రథమ స్థానం- రంగారెడ్డి, ద్వితీయ స్థానం- వరంగల్, తృతీయ స్థానం- కరీంనగర్.
అండర్-17 బాలికల విభాగంలో ప్రథమ స్థానం- ఖమ్మం, ద్వితీయ స్థానం- నల్గొండ, తృతీయ స్థానం- రంగారెడ్డి.
అండర్-17 బాలుర విభాగంలో ప్రథమ స్థానం- ఖమ్మం, ద్వితీయ స్థానం- రంగారెడ్డి, తృతీయ స్థానం- కరీంనగర్.
జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు
అండర్-17 బాలికల విభాగంలో: జి.నిత్య(హైదరాబాద్), జె.సౌజన్య(రంగారెడ్డి), డి.సుష్మభాయ్(ఖమ్మం), యు.పద్మశ్రీ(రంగారెడ్డి), పి.కావ్య(నల్గొండ), ఎన్.జ్యోతి(నల్గొండ), బి.బిందు(రంగారెడ్డి), ఆర్.శిల్ప(నల్గొండ), బి.సంధ్య(నల్గొండ), ఎస్ కీర్తనశ్రీ(కరీంనగర్), జి.విష్ణుప్రియ(కరీంనగర్), పి.ప్రియదర్శిని(కరీంనగర్), పి.లావణ్య(రంగారెడ్డి), పి.తులసి(రంగారెడ్డి), ఎం.వెన్నెల(వరంగల్), టి.నవ్య(వరంగల్), జి.సుష్మ(ఆదిలాబాద్), పి.అనూష(ఖమ్మం), జి.మహేశ్వరి(మహబూబ్‌నగర్), ఆర్.కుసుమ(రంగారెడ్డి), పి.గౌతమి(ఖమ్మం), ఎ.మంజుల(ఆదిలాబాద్), ఎం.స్పందన(ఖమ్మం), పి.దివ్యపావని(ఖమ్మం), ఎల్.దీప్తి(ఖమ్మం), సిహెచ్.ప్రియాంక(వరంగల్), ఎం.రచన(కరీంనగర్).
అండర్-17 బాలుర విభాగం: కె.నాగరాజు(ఖమ్మం), ఆర్.రామకృష్ణ(కరీంనగర్), జి.వెంకట నాయుడు(కరీంనగర్), వి.లక్ష్మణ్ బాబు(మెదక్), డి.శ్రీకాంత్(రంగారెడ్డి), బి.గణేష్(రంగారెడ్డి), బి.అనిల్(నల్గొండ), బి.వీరన్న(మెదక్), బి.అరవింద్(వరంగల్), ఎం.కిషోర్(ఖమ్మం), వై.దుర్గాప్రసాద్(రంగారెడ్డి), పి.పాండునాయక్(రంగారెడ్డి), ఎం.శివ(వరంగల్), ఎం.రవి(కరీంనగర్), సిహెచ్.నాగరాజు(కరీంనగర్), టి.రాజు(ఖమ్మం), సి.బలరాం(రంగారెడ్డి), ఎం.రాకేష్(వరంగల్), రాహుల్(వరంగల్), ఆర్.ప్రకాష్(మహబూబ్‌నగర్), ఎం.హరీష్(రంగారెడ్డి), జె.సంతోష్(ఆదిలాబాద్), ఎ.కార్తీక్(ఆదిలాబాద్), జి.కన్నారావు(ఖమ్మం), ఎస్‌కె.షకీర్(ఆదిలాబాద్), ఎల్.యశ్వంత్ కుమార్(రంగారెడ్డి), బి.విజయ్(మెదక్).
అండర్-14 బాలికల విభాగం: పి. వాసవి, బి.ధరణి, కె. శిరీష, ఎం.యమున, యు.స్వాతి కిరణ్మయి, బి.వాణి, ఎం.నవనీత(రంగారెడ్డి); ఎ.అశ్విని, పి.సుకన్య(వరంగల్); సిహెచ్.కవిత(కరీంనగర్); ఎం.లక్ష్మి(ఆదిలాబాద్); వి.పద్మ(ఖమ్మం); ఎస్.శిరీష(నల్గొండ); ఎం.అదితి(హైదరాబాద్).
అండర్-14 బాలుర విభాగం: కె.అరవింద్, వై.హరికృష్ణ, పి.హనుమంత్ నాయక్, వి.దుర్గారావు, డి.సతీష్, ఆర్.సంతోష్ రాథోడ్(రంగారెడ్డి); డి.కుమార్, వి.సాంబశివరావు(ఖమ్మం); టి.శివకుమార్, టి.సురేష్, ఎస్.సుఖ్‌బీర్(కరీంనగర్); డి.తిరుమలేష్ యాదవ్, కె.లక్ష్మణ్(మహబూబ్‌నగర్); ఎం.వెంకటేష్(నల్గొండ); జె.నవీన్(ఆదిలాబాద్); కె.శ్రీనివాస్, ఎం.శ్రీకాంత్ నాయక్(వరంగల్).
అథ్లెటిక్స్ సక్సెస్
Published Wed, Nov 5 2014 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 3:51 PM
Advertisement