
సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించడం వారిని పాలనకు దూరం చేసే కుట్ర అని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. గ్రామపంచాయతీల్లో 50 శాతానికన్నా ఎక్కువ రిజర్వేషన్లను అమలు చేయాలంటే తగిన ఆధారాలు చూపాలని సుప్రీంకోర్టు చెప్తే ఆ తీర్పును తప్పుగా ప్రచారం చేసి ప్రభుత్వం దుర్మార్గపు విధానాలకు పాల్పడుతోందని బుధవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. లేదంటే బీసీలతో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ఉద్యమాన్ని చేపడతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment