*అడిషనల్ ఎస్పీ మల్లారెడ్డి
మహబూబ్‌నగర్ క ల్చరల్ : రక్తదానం చేయడం మానవత్వానికి దర్పణమని, ఆపదల్లో ఉన్నవారి ప్రాణాలను కాపాడుతుందని జిల్లా పోలీస్ అడిషనల్ ఎస్పీ మల్లారెడ్డి అన్నారు. విశ్వహిందూ పరిషత్ స్వర్ణ జయంతి ఉత్సవాల్లో భాగంగా వీహెచ్‌పీ జిల్లా శాఖ, భజరంగ్‌దళ్‌ల ఆధ్వర్యంలో ఆది వారం స్థానిక రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో మెగా రక్తదా న శిబిరాన్ని నిర్వహించారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆ యన శిబిరంలో పాల్గొన్న వారికి అభినందించారు. రక్తదానానికి ఇతర రకాల దాన,ధర్మాలు సరితూగవని, రాజుల కా లంలో యుద్ధాల్లో పాల్గొనే వారికి రక్తాన్ని వీర తిలకంగా దిద్ది కదన కార్యోన్ముఖుల్సి చేసే వారని గుర్తు చేశారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ రాజారాం మాట్లాడుతూ జిల్లాలో జాతీయ రహదారి ఉన్నందున తరుచుగా రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, అందుకే రక్తం ఆవశ్యకత ఏర్పడుతున్నదన్నారు.
ప్రతి మూడు నెలలకోసా రి మానవ శరీరంలోని రక్త కణాలు మృతి చెందుతాయని, వాటిని వృథా చేయకుండా 18 ఏళ్ళు పైబడిన యువకులు, విద్యార్థులు రక్తాన్ని దానం చేసే అలవాటు చేసుకోవాలని సూచించారు. యువకులు మద్యపానం తదితర దురలవాట్లకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించడానికి ముందుకు రావాలని కోరారు.
కార్యక్రమంలో వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు మద్ది యాదగిరి రెడ్డి, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ మద్ది అనంతరెడ్డి, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌ల నాయకులు డి.బుచ్చారెడ్డి, పటోళ్ల లక్ష్మారెడ్డి, సంగ విశ్వనాథ, కొత్త హన్మంతు, అద్దని నరేంద్ర, నలిగేశి లక్ష్మీనారాయణ,విఘ్నేష్, డి.లక్ష్మీనారాయణ, సురేశ్, కుపేందర్, మయూర,బుడ్డ శ్రీను పాల్గొన్నారు.
రక్తదానం మానవత్వానికి దర్పణం
Published Mon, Nov 3 2014 4:25 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 PM
Advertisement
Advertisement