మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలో నాటు బాంబు పేలిన ఘటన గురువారం ఉదయం కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
రాలీఘడ్‌పూర్ గ్రామంలో ఓ ఇంట్లో దాచి ఉంచిన నాటు బాంబులు పేలాయి. ఇంట్లో నివసిస్తున్న తనుగుల శంకర్, ఇండ్ల మల్లేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
నాటు బాంబు పేలుడు : ఇద్దరికి తీవ్ర గాయాలు
Published Thu, Feb 2 2017 9:58 AM | Last Updated on Sat, Aug 25 2018 5:39 PM
Advertisement
Advertisement