బస్సుల్లో అగ్నిప్రమాదాలను నివారించాలి | buses to avoid the risk of fire | Sakshi
Sakshi News home page

బస్సుల్లో అగ్నిప్రమాదాలను నివారించాలి

Published Fri, Apr 4 2014 3:37 AM | Last Updated on Sat, Sep 2 2017 5:32 AM

బస్సుల్లో అగ్నిప్రమాదాలను నివారించాలి

బస్సుల్లో అగ్నిప్రమాదాలను నివారించాలి

హన్మకొండ సిటీ, న్యూస్‌లైన్ : ఆర్టీసీ ఏసీ బస్సుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని వరంగల్ ఇన్‌చార్జ్ ఆర్‌ఎం శ్రీధర్ సూచించారు. ఇటీవల రాష్ర్టంలో రెండు ఏసీ బస్సులు అగ్ని ప్రమాదాలకు గురయ్యాయి. అగ్ని ప్రమాదాలను అధిగమించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురువారం వరంగల్-1 డిపోలో డ్రైవర్లు, మెకానిక్‌లకు ఆర్‌ఎం వివరించారు. బస్సుల ఫ్యూజుల స్థానంలో వైర్లను కలిపి జాయింట్ చేయొద్దని సూచించారు.
 
ఫ్యూజ్ పోతే ఫ్యూజ్‌ను మార్చాలని, సొంత నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. ప్రయాణంలో ఉన్నప్పుడు బస్సులో పొగలు వ స్తే వెంటనే బస్సును ఆపి కటాఫ్ స్విచ్ ఆఫ్ చేయాలన్నారు. పొగలు వచ్చినప్పుడు బస్సును నడిపితే మంటలు వ్యాప్తి చెంది ప్రమాదం జరిగే అవకాశముందని వివరించారు. ఏసీ బస్సులో ఏసీ ఫ్యాన్ల వద్ద అదనంగా ఫ్యూజులుంటాయని తెలిపారు.
 
ఫ్యూజ్ పోయిన ప్పుడు దాని స్థానంలో అదనంగా నిల్వ ఉంచిన ఫ్యూజును బిగించాలన్నారు. మెకానిక్‌లు ఎప్పటికప్పుడూ వైరింగ్, ఏసీలను పరిశీలించాలని ఆదేశించారు. ఏమరుపాటు వహిస్తే ప్రమాదాలు జరిగే అవకాశముందని, డ్రైవర్లు చాకచక్యంగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో డిపో మేనేజర్లు సుగుణాకర్, సురేష్, మెకానిక్‌లు, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement