ఇబ్రహీంపట్నం రూరల్: మండల పరిధిలోని శేరిగూడ సమీపంలో ఉన్న శ్రీ ఇందు ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ మేధోమథన సదస్సుకు ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
ఈనెల 24, 25 తేదీల్లో నిర్వహించనున్న ఈ సదస్సుకు ఏఐసీసీ ప్రముఖులు హాజరవుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర అగ్ర నాయకుల పర్యవేక్షణలో ఎలాంటి లోట్లు లేకుండా సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత మూడు రోజులుగా మాజీమంత్రి దానం నాగేందర్ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ విలేకరులతో మాట్లాడుతూ.. సదస్సులో రాష్ట్రంలో సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణాలను విశ్లేషిస్తామన్నారు.
పార్టీ కార్యకర్తల్లో మనోధైర్యం నింపడానికి శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పార్టీకి పునర్‌వైభవం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. సదస్సు ఏర్పాట్లను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పండాల శంకర్ గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు కొమ్మిడి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ వెంకట్రాంరెడ్డి, నాయకులు పాశం రవీందర్‌గౌడ్, పెద్దఅంబర్‌పేట్ నగరపంచాయితీ వైస్ చైర్మన్ సిద్దంకి క్రిష్ణారెడ్డి, మొద్దు వెంకట్‌రెడ్డి పాశం భాస్కర్ తదితరులు పర్యవేక్షిస్తున్నారు.
సభా ప్రాంగణాన్ని సందర్శించిన పొన్నాల
అలాగే శుక్రవారం సాయంత్రం పీసీసీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి శ్రీధర్ బాబు సభా వేదిక ఏర్పాట్లను పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని, ఏర్పాట్లలో ఎలాంటి లోటు లేకుండా చూడాలని స్థానిక నాయకులకు సూచించారు.
కాంగ్రెస్‌కు పునర్‌వైభవం తీసుకొస్తాం
Published Fri, Aug 22 2014 11:51 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement