Nagender danam
-
‘అనర్హత’ పిటిషన్లపై తీర్పు రిజర్వు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులను అనర్హులుగా ప్రకటించేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. రాజ్యాంగపరమైన అంశాల నేపథ్యంలో ఏప్రిల్ నుంచి సుదీర్ఘ వాదనలు విన్నది. పిటిషనర్లు, ప్రతివాదుల తరఫున సుప్రీంకోర్టు, హైకోర్టు సీనియర్ న్యాయవాదులు పలు తీర్పులను ఉదహరిస్తూ వాదనలు వినిపించారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ కేపీ.వివేకానంద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచిన దానం నాగేందర్.. ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్‌లోకి చేరారని ఆయనను కూడా అనర్హుడిగా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మరో పిటిషన్ వేశారు. నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఫిర్యాదు చేసేందుకు ప్రయతి్నంచిన స్పీకర్ సమయం ఇవ్వడం లేదంటూ బీజేపీ ఎలీ్పనేత మహేశ్వర్‌రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మూడు పిటిషన్లపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి బుధవారం మరోసారి విచారణ చేపట్టారు. దానం, కడియం తరఫున సీనియర్ న్యాయవాదులు శ్రీరఘురాం, మయూర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘సుప్రీంకోర్టు వేర్వేరు తీర్పుల ప్రకారం స్పీకర్‌కు కోర్టులు ఆదేశాలు జారీ చేసేందుకు వీల్లేదు. స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన పదిరోజులకే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. స్పీకర్‌కు కనీస గడువు కూడా ఇవ్వకుండానే న్యాయ సమీక్ష కోరడం చెల్లదు. తాజా పిటిషన్లను కొట్టేయాలి.. లేనిపక్షంలో డివిజన్ బెంచ్‌కు నివేదించాలి. గత శాసనసభ స్పీకర్ ఎదుట పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్లో స్పీకర్‌కు నిర్దిష్ట గడువు నిర్ణయించేందుకు ఇద్దరు న్యాయమూర్తుల హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది’అని పేర్కొన్నారు. లిఖితపూర్వక వాదనలను శుక్రవారం సమర్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వాదనలు పూర్తి కావడంతో న్యాయమూర్తి.. తీర్పు రిజర్వు చేశారు. -
కాంగ్రెస్..స్ట్రీట్ ఫైట్
గ్రేటర్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. ‘సరిహద్దు’ గొడవలు వీధికెక్కాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ విభాగాల మధ్య నెలకొన్న వివాదం పరస్పర దాడులకు దారితీసింది. ఉప్పల్‌లో సోమవారం పార్టీ జెండావిష్కరణ విషయంలో ఇరు వర్గాల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తి ఘర్షణలకు దారితీశాయి. ఈ ఘటనలో మాజీ మంత్రి దానం నాగేందర్ సహా పలువురు గాయపడ్డారు. ఉప్పల్‌లో కాంగ్రెస్ పార్టీలోని ఇరువర్గాల ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రోడ్లపైనే ప్రజలందరూ చూస్తుండగా కర్రలతో దాడులకు పాల్పడడం విస్మయం గొలిపింది. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. - ఉప్పల్ -
దానంపై భూ ఆక్రమణ కేసు
హైదరాబాద్: మాజీ మంత్రి దానం నాగేందర్‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో భూ ఆక్రమణ, బెదిరింపు కేసు లు నమోదయ్యాయి. తన స్థలాన్ని నాగేందర్ కాజేయడానికి యత్నిస్తున్నాడంటూ జూబ్లీహిల్స్‌కు చెందిన కొండపల్లి హైమావతి అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం... బంజారాహిల్స్ రోడ్-2లోని ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ ఆస్పత్రిని ఆనుకొని కొండపల్లి హైమావతి అనే మహిళకు 889 గజాల స్థలం ఉంది. వారం క్రితం ఈ స్థలంలో రూమ్ కట్టేందుకు ఆమె అల్లుడు జయేందర్‌రెడ్డి ప్రయత్నిస్తుండగా దానం ప్రధాన అనుచరుడు సూరి, హేమా చౌదరి అనే వురో మహిళ, సోమాజిగూడ కార్పొరేటర్ ఎలిగల మహేష్ యాదవ్ వచ్చి ఈ స్థలం అన్నదని, ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరించారు. దానం ఇంటికి వచ్చి సెటిల్మెంట్ చేసుకోవాలని హెచ్చరించారు. మరోమారు సూరి, ఆయన అనుచరులు స్థలం వద్దకు వచ్చి అన్న మాట్లాడతారంటూ ఫోన్ కలిపి ఇచ్చారు. ఫోన్లోనే జయేందర్రెడ్డిని దానం హెచ్చరించాడు. అసభ్యకరంగా దూషించారు. ఖాళీ చేసి వెళ్లకపోతే ఖతం చేస్తానంటూ బెదిరించారు. ఈ స్థలంలో నిర్మాణం ఎలా కడతావో చూస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుసటి రోజు ఉదయం ఇంటికి వచ్చి మ్యాటర్ సెటిల్ చేసుకోకపోతే అంతు చూస్తానంటూ బెదిరించాడు. దీంతో బాధితులు తనకు నాగేందర్ నుంచి ప్రాణహాని ఉందంటూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో వెంటనే నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డిని ఆశ్రయించారు. ఆయన ఆదేశాల మేరకు బంజారాహిల్స్ పోలీసులు దానంతోపాటు సోమాజిగూడ కార్పొరేటర్ మహేష్ యాదవ్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదైన మరుసటి రోజు కూడా నాగేందర్ మరోసారి జయేందర్రెడ్డికి ఫోన్ చేసి నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా అంటూ హెచ్చరించారు. ఈ వ్యవహారం కోర్టులు, పోలీసులతో కాదని కేవలం తనతో సెటిల్మెంట్ చేసుకుంటేనే కొంతవరకు లాభపడతావంటూ హితవు పలికారు. ఇదిలా ఉండగా బాధిత మహిళ కొండపల్లి హైమావతి పీపుల్స్ వార్ అగ్ర నాయకుడు కొండపల్లి సీతారామయ్యకు స్వయానా మరదలు, ఏపీ డైరీ మాజీ చైర్మన్ చంద్రమౌళి రెడ్డి భార్య కావడం విశేషం. -
కాంగ్రెస్‌కు పునర్వైభవం తీసుకొస్తాం
ఇబ్రహీంపట్నం రూరల్: మండల పరిధిలోని శేరిగూడ సమీపంలో ఉన్న శ్రీ ఇందు ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ మేధోమథన సదస్సుకు ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈనెల 24, 25 తేదీల్లో నిర్వహించనున్న ఈ సదస్సుకు ఏఐసీసీ ప్రముఖులు హాజరవుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర అగ్ర నాయకుల పర్యవేక్షణలో ఎలాంటి లోట్లు లేకుండా సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత మూడు రోజులుగా మాజీమంత్రి దానం నాగేందర్ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ విలేకరులతో మాట్లాడుతూ.. సదస్సులో రాష్ట్రంలో సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణాలను విశ్లేషిస్తామన్నారు. పార్టీ కార్యకర్తల్లో మనోధైర్యం నింపడానికి శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. సదస్సు ఏర్పాట్లను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పండాల శంకర్ గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు కొమ్మిడి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ వెంకట్రాంరెడ్డి, నాయకులు పాశం రవీందర్‌గౌడ్, పెద్దఅంబర్‌పేట్ నగరపంచాయితీ వైస్ చైర్మన్ సిద్దంకి క్రిష్ణారెడ్డి, మొద్దు వెంకట్‌రెడ్డి పాశం భాస్కర్ తదితరులు పర్యవేక్షిస్తున్నారు. సభా ప్రాంగణాన్ని సందర్శించిన పొన్నాల అలాగే శుక్రవారం సాయంత్రం పీసీసీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి శ్రీధర్ బాబు సభా వేదిక ఏర్పాట్లను పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని, ఏర్పాట్లలో ఎలాంటి లోటు లేకుండా చూడాలని స్థానిక నాయకులకు సూచించారు.