కాంగ్రెస్..స్ట్రీట్ ఫైట్ | Congress Street Fight .. | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్..స్ట్రీట్ ఫైట్

Published Tue, Dec 29 2015 12:36 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్..స్ట్రీట్ ఫైట్ - Sakshi

కాంగ్రెస్..స్ట్రీట్ ఫైట్

గ్రేటర్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. ‘సరిహద్దు’ గొడవలు వీధికెక్కాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ విభాగాల మధ్య నెలకొన్న వివాదం పరస్పర దాడులకు దారితీసింది. ఉప్పల్‌లో సోమవారం పార్టీ జెండావిష్కరణ విషయంలో ఇరు వర్గాల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తి ఘర్షణలకు దారితీశాయి.  ఈ ఘటనలో మాజీ మంత్రి దానం నాగేందర్ సహా పలువురు గాయపడ్డారు.
 
ఉప్పల్‌లో కాంగ్రెస్ పార్టీలోని ఇరువర్గాల ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రోడ్లపైనే ప్రజలందరూ చూస్తుండగా కర్రలతో దాడులకు పాల్పడడం విస్మయం గొలిపింది. ఈ సంఘటనతో  ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి.         - ఉప్పల్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement