► తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో రంగంలోకి కేంద్ర జల సంఘం
► రాష్ట్ర వాదనలు వినిపించిన స్పెషల్ సీఎస్ ఎస్‌కే జోషి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన మున్నేరు, శివభాష్యం సాగర్ ప్రాజెక్టులపై తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాల పరిశీలనకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) రంగంలోకి దిగింది. సీడబ్ల్యూసీ, కృష్ణా బోర్డు అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం కర్నూలు జిల్లాలో శివభాష్యం సాగర్ రిజర్వా యర్, కృష్ణా జిల్లాలో మున్నేరు బ్యారేజీల నిర్మాణం చేపట్టింది. ఈ అంశమై నీటి పారు దల శాఖ స్పెషల్ సీఎస్ ఎస్‌కే జోషితో సోమ వారం ప్రత్యేకంగా భేటీ అయిన సీడబ్ల్యూసీ అధికారులు రాష్ట్ర వాదనను రికార్డు చేశారు.
ముమ్మాటికీ అక్రమమే..
కృష్ణా జలాలపై బచావత్ అవార్డు ప్రకారం ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల మేర కేటా యించగా, అందులో తెలంగాణ 299, ఏపీ 512 టీఎంసీల మేర నీటిని వినియోగించు కుంటున్నాయి. ఈ నీటినే ఆధారం చేసుకునే ప్రాజెక్టుల నిర్మాణం చేస్తున్నారు. బచావత్ అవార్డు కేటాయించిన 811 టీఎంసీల విని యోగంలో ఎక్కడా పేర్కొనకున్నా శివ భాష్యం సాగర్ ప్రాజెక్టును ఏపీ చేపట్టింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని కానీ, చేపట్టే అవకాశం ఉందని కానీ కనీసం బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు సైతం పేర్కొన లేదు.
బచావత్ అవార్డు ప్రకారం కర్నూలు జిల్లాకు మైనర్ ఇరిగేషన్ కింద 6.95 టీఎంసీ ల మేర కేటాయింపులు ఉన్నాయని, ఈ నీటి ని తీసుకుంటూనే ఈ ప్రాజెక్టు చేపడుతు న్నామని చెబుతూ ఏపీ దీన్ని ప్రారంభిస్తోంది. ఇదే విషయాన్ని పేర్కొంటూ అనుమతుల కోసం సీడబ్ల్యూసీకి అర్జీ పెట్టుకుంది. కానీ, తెలంగాణ వ్యతిరేకించడంతో సీడబ్ల్యూసీ అధికారులు శని, ఆదివారాల్లో ప్రాజెక్టు ప్రాం తంలో పర్యటించారు. ప్రాజెక్టు అక్రమమని జోషి స్పష్టం చేసినట్లుగా తెలిసింది.
రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని 85(సి) నిబంధన కింద ఏదైనా కొత్త ప్రాజెక్టు చేపడితే దానికి బోర్డు నుంచి అనుమతులు తీసుకో వాల్సి ఉన్నా, అలా జరగలేదని, ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం ఆర్థిక సాయానికి అను మతివ్వరాదని తెలంగాణ కోరినట్లుగా తెలి సింది. మున్నేరు నిర్మాణం వల్ల తెలంగాణ లో ముంపు ఉన్నా, ఏపీ తన డీపీఆర్‌లో ముంపు ను ప్రస్తావించలేదని సీడబ్ల్యూసీ దృష్టికి తీసుకెళ్లింది. అన్ని పరిశీలించాకే వీటిపై తుది నిర్ణయం చేస్తామని సీడబ్ల్యూసీ అధికారులు వెల్లడించినట్లుగా తెలిసింది.