'అవి ఆత్మహత్యలు కాదు.. ప్రభుత్వ హత్యలు'
Published Sat, Aug 8 2015 6:23 PM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM
కాంగ్రెస్ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి
వెల్దండ (మహబూబ్‌నగర్ జిల్లా): తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు ఎండిపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. ప్రభుత్వం ఎలాంటి జాగ్రతలు తీసుకోవడం లేదని కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా వెల్దండ మండలం సిలోనిబండతాండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
'జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజు రైతులు మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. అయినా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పట్టించుకోవడం లేదు. రైతులకు అండగా.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తే లాఠీచార్జీ చేయిస్తున్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 8మంది రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు'
పశువులకు పశుగ్రాసం లేక మూగజీవాలను కళేబరాలకు తరలిస్తున్నారు. ఏపీ ప్రభుత్వంలో ప్రస్తుతం రైతు కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలి. విలేకరుల సమావేశంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి పెద్దయ్యయాదవ్, నాయకులు పర్వత్‌రెడ్డి, ఈదన్నగౌడు, అశోక్, శ్రీనివాస్‌యాదవ్, శేఖర్, మణిపాల్‌నాయక్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement