రైతులూ.. ఆత్మహత్యలు వద్దు
- సర్కార్ అండగా ఉండి సమస్యలు పరిష్కరిస్తుంది
- ‘పట్నం’కు సాగునీరే లక్ష్యంగా కృషి
- సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి
- భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్
యాచారం: రైతు సోదరుల్లారా...ఆత్మహత్యలు చేసుకోకండి.. కేసీఆర్ ప్రభుత్వం మీకు అండ గా ఉంది.. సమస్యలను పరిష్కరిస్తుంది అని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు బూర నర్సయ్యగౌడ్ పేర్కొన్నారు. శనివారం యాచారం పీఏసీఏస్‌లో చైర్మన్ నాయిని సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ సింగిరెడ్డి పెంటారెడ్డిలతో కలిసి 66 మంది రైతులకు రూ. 2 కోట్ల రుణాల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి.. ఆయన అపర భగీరథుడిగా కృషి చేస్తున్నారు.. హామీ మేరకు రుణమాఫీ అమలుచేస్తున్నాం... ఇతర విషయాల్లోనూ గత ప్రభుత్వాల కంటే ముందుచూపుతో ఉన్నాం.. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పారు.
రైతులకు మనోధైర్యం నింపడానికి పీఏసీఎస్, డీసీసీబీ సభ్యులు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి చైతన్యం తీసుకరావాలని సూచించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి సాగునీరు తెచ్చే విధంగా తాను స్థానిక ఎమ్మెల్యే తీవ్రంగా కృషి చేస్తున్నట్లు ఎంపీ తెలిపారు. పీఏసీఏస్ నూతన భవన నిర్మాణానికి రూ. 5 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... డీసీసీబీ, పీఏసీఏస్‌ల్లో నిరుద్యోగ యువతకు వ్యక్తిగత రుణాలిచ్చే విధంగా కృషి చేయాలన్నారు. తాను పీఏసీఏస్ భవన నిర్మాణానికి డబ్బులు ఇస్తున్నానని, రుణాలు పొందే ప్రతి రైతు కూడా రూ.500 ఇస్తే విశాలమైన భవనాన్ని నిర్మించుకోవచ్చన్నారు. డీసీసీబీ చైర్మన్ సింగిరెడ్డి పెం టారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాల్లో యాచారం పీఏసీఏస్‌కు మంచి పేరుందని, తాను కూడా నూతన భవన నిర్మాణానికి రూ. 3 లక్షలు ఇస్తానని తెలిపాడు.
మెరుగైన వైద్య సేవలందించాలి..
యాచారం పీహెచ్‌సీని ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రి ఆవరణలో శిథిలావస్థకు చేరుకున్న భవనాలను పరిశీలించారు.
వైద్యసేవల్లో నిర్లక్ష్యంపై డాక్టర్లపై అసంతృప్తి వ్యక్తం వ్యక్తం చేశారు. రోగుల పట్ల దురుసుగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఆస్పత్రి వైద్యాధికారి ఉపేందర్‌రెడ్డిని హెచ్చరించారు. వెంటనే ఎంపీ జిల్లా వైద్యాధికారితో మాట్లాడారు. ఆస్పత్రి ఆవరణలోని పాత భవనాలను కూల్చేయాలని ఆదేశించారు. ఆస్పత్రిలోని సమస్యలపై తనకు రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని డీఎంహెచ్‌ఓకు సూచించారు. యాచారం ఆస్పత్రిలో 24గంటలపాటు వైద్యు లు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలందించాలన్నారు.
అనంతరం ఎంపీ బీసీ బా లికల వసతిగృహాన్ని సందర్శించారు. వాటర్ ఫిల్టర్ కోసం నిధులు మంజూరు చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు కర్నాటి రమేష్‌గౌడ్, ఎంపీపీ జ్యోతి, వైస్ ఎంపీపీ రామకృష్ణ యాదవ్, పీఏసీఏస్ చైర్మన్ నాయిని సుదర్శన్‌రెడ్డి, వైస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, గునుగల్, యాచారం, సర్పంచ్‌లు అచ్చె న మల్లికార్జున్, మారోజ్ కళమ్మ, టీఆర్‌ఎస్ నా యకులు ఈసీ శేఖర్‌గౌడ్, డబ్బికార్ శ్రీనివాస్, బర్ల జగదీశ్వర్ యాదవ్, మచ్చ లక్ష్మణ్, నారాయణరెడ్డి, బందె రాజశేఖర్‌రెడ్డి, బట్టు శ్రీను వాస్, యాదయ్యగౌడ్, పీఏసీఏస్ డెరైక్టర్లు రవీందర్, ఉడుతల జంగయ్య పాల్గొన్నారు.