రోస్ అటేనా!
⇒ కలెక్టర్ ఆంధ్రకే కేటాయింపు
⇒ తుది నివేదికలోనూ ‘ప్రత్యూష్’ వెల్లడి
⇒ తెలంగాణకే ‘రొనాల్డ్ రోస్’ సుముఖత
⇒ కేసీఆర్ లేఖను కేంద్రం పరిశీలిస్తుందా?
⇒ రెండు రోజులలో బదిలీపై స్పష్టత
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఐఏఎస్ అధికారి, కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌ను ఆంధ్రకే కేటాయించారు.
గురువారం ప్రత్యూష్‌సిన్హా కమిటీ కేంద్రానికి సమర్పించిన తుది నివేదికలోనూ ఈ విషయూన్ని స్పష్టం చేశారు. ఈ నివేదికను కేంద్రం కూడా ఆమోదించింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ బదిలీ అనివార్యమన్న చర్చ జరుగుతోంది. తాను పనిచేస్తూ.. అధికార యంత్రాంగం తో చేయిస్తూ.. క్షేత్రస్థాయి పర్యటనలు... అత్మీయానురాగాల పలకరింపులతో అన్ని వర్గాలతో మమేకం అవుతూ జిల్లా పాలనపై తనదైన మార్కు వేసి అనతికాలంలో డైనమిక్ కలెక్టర్‌గా రొనాల్డ్‌రోస్ పేరు తెచ్చుకున్నారు.
డిసెంబర్ చివరివారంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లను ఇరు రాష్ట్రాలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యూ రుు. జనవరి మొదటి వారంలో 17 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఆంధ్రలో చేరేందుకు ప్రభుత్వం అనుమతి కూడ ఇచ్చింది. ఆ సమయంలోను కేంద్రం కే టా యింపుల ప్రకారం కలెక్టర్ ఆంధ్రకే వెళ్తారన్న ప్రచారం జరిగింది.
నాటి నుంచి సందిగ్ధమే!
ఐఏస్‌ల కేటాయింపుల ప్రక్రియ మొదటి నుంచి జరుగుతున్నా, రోనాల్డ్‌రోస్‌కు అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు అందకపోవడంతో అయన బదిలీపై సందిగ్ధం నెల కొంది. అదే సమయంలో తెలంగాణ రాష్ర్టంలో పనిచేస్తున్న సోమేశ్‌కుమార్, పూనం మాలకొండయ్య, జయేష్‌తోపాటు రొనాల్డ్‌రోస్‌ను రాష్ట్రంలోనే కొనసాగించాలని సీ ఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారు.
ఆంధ్ర ప్రభుత్వం సైతం అక్కడే పనిచేస్తున్న నలుగురు ఐఏఎస్ అధికారులను కోరుతుండటంతో తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారులను ఇక్కడే కొనసాగించే అవకాశం ఉన్నట్లు చెప్పారు. ఇదే క్రమంలో పరస్పర బదిలీల (మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్స్) అంశాన్ని కూడా ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రెట్రీలు చర్చించారు. ఏ రాష్ట్రంలో పనిచేస్తున్నా, పదవీ విరమణకు రెండేళ్లకాలం ఉంటే వారి కోరిక మేరకు, వారిని అదే రాష్ర్టంలో కొనసాగించవచ్చు.
అదే విధంగా అఖిల భా రత సర్వీసులో దంపతులు ఇద్దరినీ ఒకే రాష్ట్రంలో కొనసాగించే అవకాశం ఉన్నట్లు ప్రకటించారు కూడా. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని రోస్‌ను తెలంగాణలోనే ఉం డేలా చూడాలని సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాయడంతో ఆయన జిల్లాలో కొనసాగడం ఖాయమైనట్లు భావించారు. కలెక్టర్ సైతం అధికార యంత్రాంగం, ప్రజాప్రతి నిధులను కలుపుకొని జిల్లా సమగ్రాభివృద్దిలో నిరంతరం శ్రమిస్తున్నారు.
ఇదే సమయంలో గురువారం ప్రత్యూష్‌సిన్హా కమిటీ తుది నివేదిక ఇవ్వడం.. కేంద్రం ఆమో దం తెలపడంతో ప్రచారం మళ్లీ తెరపైకి వచ్చింది. కేసీఆర్ ఇచ్చిన లేఖను కేంద్రం పరిశీలిస్తుందా? ఇరు రాష్ట్రాల సీఎస్‌ల చర్చించిన విధంగా పరసర్ప బదిలీల ప్రకారం రోనాల్డ్‌రోస్ ఇక్కడే కొనసాగుతారా? అన్న చర్చ కూడ జరుగుతోంది. ఈ వ్యవహారంపై రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు.