కమిషనర్‌ ఆదేశాలిస్తారు.. డీఐజీలు పాతరేస్తారు! | Commissioner of the Registrations Department established the Special Inspection Team | Sakshi
Sakshi News home page

కమిషనర్‌ ఆదేశాలిస్తారు.. డీఐజీలు పాతరేస్తారు!

Published Mon, May 29 2017 1:42 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Commissioner of the Registrations Department established the Special Inspection Team

► ప్రత్యేక తనిఖీ బృందాన్ని ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌
సాక్షి, హైదరాబాద్‌: సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అక్రమాలను నివారించేందుకు తనిఖీలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ)  అధికారులకు హుకూం జారీ చేస్తారు. ఈ మేరకు ప్రత్యేక ఆడిట్‌ టీమ్‌లను ఏర్పాటు చేస్తూ రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ కిందిస్థాయి అధికారులకు ఆదేశాలిస్తారు. కమిషనర్‌  ఆదేశాలి చ్చినా ప్రత్యేక ఆడిట్‌ టీమ్‌ల ఏర్పాటుకు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌(డీఐజీ) స్థాయి అధికారులు మోకాలడ్డుతారు. రిజిస్ట్రేషన్ల శాఖలో జరుగుతున్న తంతు ఇదే. 

ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్‌ వెసులుబాటుతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ –మల్కాజిగిరి జిల్లాల్లోని కొన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అక్రమ రిజిస్ట్రేషన్ల దందా నడుస్తోంది. ప్రభుత్వం వైపు నుంచి కూడా ఒత్తిడి పెరగడంతో, ఏడాదిగా ఆడిట్‌ జరగని రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజిగిరి జిల్లాల్లోని కొన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టాలని కమిషనర్‌ నిర్ణయించారు. ముగ్గు రు (రంగారెడ్డి, మల్కాజిగిరి, హైదరాబాద్‌) ఆడిట్‌ రిజిస్ట్రార్లతో ప్రత్యేక ఆడిట్‌ బృందాన్ని ఏర్పాటు చేస్తూ గత ఫిబ్రవరి 6న ఉత్తర్వులు కూడా జారీచేశారు.

జూన్‌ 2లోగా తనిఖీలను పూర్తి చేయాలని కూడా నిర్దేశం చేశారు. కమిషనర్‌ ఆదే శాల కాపీలు సదరు ఆడిట్‌ బృందంలోని సభ్యులకు చేరే వారం లోగానే, తనిఖీ లకు బృందం ఆవశ్యకతలేదని ప్రత్యేక ఆడిట్‌ టీమ్‌ను రద్దు చేశామని డీఐజీలలో ఒకరు టీమ్‌ సభ్యులకు తెలిపారు. తనిఖీలు కొనసాగితే తమ బండారాలు ఎక్కడ బయట పడతాయోనని భయపడిన కొందరు ఆడిట్‌ టీమ్‌ను రద్దు చేయించుకు న్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమిషనర్‌ ఆదేశాల మేరకు ఆడిట్‌ టీమ్‌ తనిఖీలు నిలిచిపోవడంతో.. కూకట్‌పల్లి, బాలానగర్, ఎల్బీనగర్‌ కార్యాల యా ల్లో జరిగిన అవకతవకలపై సీఎం కార్యాలయమే నేరుగా దృష్టి సారించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement