పార్టీలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి
సాక్షి, సూర్యాపేట : సంక్షేమ పథకాల అమలులో దేశంలో తెలంగాణ రాష్ట్రం నంబర్‌వన్‌గా నిలిచిందని విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేం ద్రంలో పార్టీ కార్యాలయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ నుంచి తోట శ్యామ్, గుండా శ్రీధర్, సింగిరికొండ రవీందర్, బండారు రమేష్, శ్రీకాంత్, బ్రహ్మారావు, గోవిందరావు, రమేష్, వనమా వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, విద్యాసాగర్, కిరణ్, లక్ష్మీనారాయణ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పిన మంత్రి సాదరంగా ఆహ్వానం పలికి మాట్లాడారు. గత పాలకుల హయాంలో జిల్లాలో అభివృద్ధి శూన్యమన్నారు.
సీఎం కేసీఆర్ జిల్లాను అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు మోకాలడ్డుతున్నారని మండిపడ్డారు. దేశంలో ప్రాంతీయ పార్టీలే అధికారం చేపట్టే రోజులు వచ్చాయని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వైవి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ ఉప్పల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
పంచాంగంతో క్రమశిక్షణ అలవడుతుంది
భానుపురి (సూర్యాపేట) : పంచాంగంతో సమాజంలో ఎవరికైనా క్రమశిక్షణ అలవడుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం వైదిక బ్రహ్మణ సంఘం జిల్లాశాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని ఓ కల్యాణమండపంలో వికారినామ సంవత్సర పంచాంగాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజానికి సైతం పంచాగం దిక్సూచిగా మారిందనారు. తిధి, వార, నక్షత్రాలను, సమయాన్ని కచ్చితంగా పంచాంగం ద్వారా తెలుసుకోవచ్చన్నారు. దాని ని పాటించడం ద్వారా మెరుగైన సమాజాన్ని ఏర్పర్చు కోవచ్చని పేర్కొన్నారు.
పాశ్చాత్య దేశాలు సైతం మన పం చాంగాన్ని పాటించడం గర్వకారణమన్నారు. పండితులు వైరుధ్యాలు రానివ్వకుండా ఏకతాటిపై ఉండి సమాజానికి ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైదిక బ్రా హ్మణసంఘం రాష్ట్ర అధ్యక్షులు గంగు భానుమూర్తి, ఉపాధ్యక్షుడు వాసుదేవశర్మ, జిల్లా అధ్యక్షుడు మంత్రమూర్తి శంకరమూర్తి, ప్రధాన కార్యదర్శి పులి అచ్యుతారామశర్మ, పంచాంగకర్త కప్పగంతు సోమయాజులు, లక్ష్మీనారాయణశర్మ, హరిప్రసాద్‌శర్మ, డాక్టర్ రామయ్య, రామలింగేశ్వరశర్మ, ఫణికుమార్, ఆదిత్యశర్మ, ఉదయ్‌శర్మ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment