కోదాడ వద్ద ఉన్న కరోనా టిస్టింగ్ యూనిట్
సాక్షి, హైదరాబాద్/అమరావతి : తెలంగాణ, ఆంధప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో కరోనా వైరస్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటైంది. సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద మొబైల్ యూనిట్ ద్వారా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు. అటువైపుగా వెళ్లే వాహనదారులను ఆపి పరీక్షలు చేస్తున్నారు. ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరుపుతున్నారు. లక్షణాలు ఉన్నవారితో పాటు లేనివారికి కూడా పరీక్షలు చేస్తున్నారు. లక్షణాలు లేనివారికి మాత్రం ర్యాండమ్ శాంపిల్ పద్దతిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. 20 నిమిషాలలో పరీక్షలు ఫలితాలు వచ్చేస్తున్నాయి. అంతా సరిగ్గా ఉంటే 20 నిమిషాల్లో పరీక్షలు చేయించుకుని ఇంటికి వెళ్లిపోవచ్చు. లేకపోతే క్వారంటైన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ( తెలంగాణలో ఇద్దరు ఐపీఎస్‌లకు పాజిటివ్)
కాగా, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తెలంగాణలో నిన్న ఒక్కరోజే 499 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య 6,526కు చేరింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం కొత్తగా 465 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 7,961గా ఉంది. (ప్రపంచం పెను ప్రమాదంలో ఉంది)
Comments
Please login to add a commentAdd a comment