ఎమ్మార్వో ఇంట్లో పేలుళ్లు | crackers blast in tandur mro house | Sakshi
Sakshi News home page

ఎమ్మార్వో ఇంట్లో పేలుళ్లు

Published Wed, Aug 2 2017 4:15 PM | Last Updated on Mon, Sep 11 2017 11:06 PM

వికారాబాద్ జిల్లా రామయ్య గూడ ఎంఐజీ క్వార్టర్లలో ఉంటున్న తాండూర్ తహశీల్దార్‌ ఇంట్లో నిల్వ ఉంచిన టపాకాయలు పేలాయి.

వికారాబాద్‌: వికారాబాద్ జిల్లా రామయ్య గూడ ఎంఐజీ క్వార్టర్లలో ఉంటున్న తాండూర్ తహశీల్దార్‌ రాములు ఇంట్లో నిల్వ ఉంచిన టపాకాయలు పేలాయి. బుధవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా జరిగిన పేలుడు ధాటికి మంటలు లేచి ఇంట్లోని సామగ్రి, ధ్వంసం కాగా కొంత కాలిపోయింది. ఫైర్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
 

Advertisement

పోల్

Advertisement