
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ కంచ ఐలయ్య ఇంటిని పోలీసులు దిగ్బంధం చేశారు. శనివారం విజయవాడలో జరిగే సభకు వెళ్లవద్దంటూ ఐలయ్యకు ఏపీ పోలీసులు నోటీసులు అందజేసిన నేపథ్యంలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు తార్నాకలోని ఆయన నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మఫ్టీలో ఉన్న ఏపీ, స్థానిక పోలీసులు ఐలయ్య ఇంటి వద్ద మోహరించి ఆయనను గృహనిర్బంధం చేశారు. ఐలయ్య ఇంటికి వెళ్లే రహదారిని ఇరువైపులా మూసివేశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న ప్రజా, కుల సంఘాలనాయకులు ఆందోళనకు దిగారు.
ఐలయ్యను బయటకు తీసుకువెళ్లడానికిగాను ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. టీ–మాస్ ప్రతినిధులు విమలక్క, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్‌రావు, నలిగంటి శరత్, దళిత సంఘర్షణ సమితి ప్రతినిధులను ఓయూ పోలీసులు అదుపులోకి తీసుకుని అనంతరం విడిచిపెట్టారు. విమలక్క, విశ్వేశ్వర్‌రావు, శరత్ మాట్లాడుతూ విజయవాడ సభకు ఐలయ్యను అనుమతించాలని డిమాండ్ చేశారు. ఐలయ్య రాసిన ‘సామాజిక స్మగ్లర్లు.. కోమటోళ్లు’పుస్తకంపై అసెంబ్లీలో చర్చించాలని, అప్పుడే ఇరువర్గాలకు న్యాయం జరుగుతుందని టీమాస్ నేతలు అన్నారు. దళిత బహుజనుల న్యాయపోరాటానికి అందరూ సిద్ధం కావాలన్నారు. ఐలయ్యకు ఎలాంటి హాని జరిగినా ప్రభుత్వాలే బాధ్యత వహించాలని హెచ్చరించారు.
రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు
రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడతానని ప్రొఫెసర్ ఐలయ్య స్పష్టం చేశారు.
ఆ వివాదానికి ఇక ముగింపు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): ప్రొఫెసర్ కంచ ఐలయ్య రచించిన ‘సామాజిక స్మగ్లర్లు–కోమటోళ్లు’ పుస్తకంపై నెలకొన్న వివాదానికి ముగింపు పలకాలని ఇరువర్గాలు నిర్ణయించాయి. ఆర్యవైశ్య సంఘం, దళిత సంఘాల నేతలతో శని వారం విజయవాడలో కీలక సమావేశం జరి గింది. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడారు. విజయవాడతో పాటు రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న వివా దాలకు ముగింపు పలకాలని ఇరుపక్షాలు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. హైదరా బాద్‌లో ఉన్న కంచ ఐలయ్యను ఫోన్‌లో సంప్రదించామన్నారు.
ఇకపై జరిగే సభలు, సమావేశాల్లో ఆర్యవైశ్య కులం గురించి తాను మాట్లాడబోనని ఆయన చెప్పినట్లు తెలిపారు. పుస్తకంలో ఉన్న అంశాలపై ప్రజాసంఘాల నాయకులు, వైశ్యసంఘం నాయకుల సమక్షంలో చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారని రామకృష్ణ చెప్పారు. ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పుస్త కంలోని అంశాలపై పెద్దలతో చర్చించేం దుకు కంచ ఐలయ్య అంగీకరించడంతో వివాదానికి ఫుల్‌స్టాప్ పెడుతున్నామన్నా రు. ఎంపీ టీజీ వెంకటేష్, మాజీ సీఎం రోశయ్య వంటి పెద్దలతో చర్చించి అంగీకా ర ప్రకటన చేసినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment