కూతురే..కొడుకై | Daughter is son role | Sakshi
Sakshi News home page

కూతురే..కొడుకై

Published Wed, Feb 18 2015 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 9:29 PM

Daughter  is son role

తండ్రి అంతిమ ‘సంస్కారాన్ని మరిచిన కుమారుడు’
తలకొరివి పెట్టిన తనయ

 
కారేపల్లి: కన్నతండ్రి అంత్య క్రియలు చేయడం భారంగా భావించాడో కొడుకు. కనీసం కడసారి చూపుకు కూడా రాకుండా..కర్కశంగా వ్యవహరించాడు. అరుుతే కూతురు మాత్రం అన్నీ తానై తండ్రికి తలకొరివి పెట్టింది. ఈ ఘటన కారేపల్లి మండలంలోని మొట్లగూడెం గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..వరంగల్ జిల్లా బలపాల గ్రామానికి చెందిన రాయల పిచ్చయ్య (75)కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కాగా నెల రోజుల క్రితం బలపాలలో తన ఇంట్లో  జరిగిన గ్యాస్ లీకేజీ  ప్రమాదంలో చిన్న కుమారుడు రాయల శ్రీనివాసరావు మృతి చెందగా, రాయల పిచ్చయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పెద్ద కుమారుడు తండ్రిని పట్టించుకోకుండా వదిలేశాడు.

కారేపల్లి మండలం మాణిక్యారం గ్రామ పంచాయతీ మొట్లగూడెంలో ఉంటున్న తన చిన్న కుమార్తె గుర్రం మంగమ్మ  తండ్రిని, పెద్ద కుమార్తె (మానసిక వికలాంగురాలు) రాయల వెంకటనర్సమ్మలను ఇంటికి తీసుకొచ్చి బాగోగులు చూసుకుంటోంది. ఈ క్రమంలో రాయల పిచ్చయ్య మృతి చెందడంతో..పెద్ద కుమారుడికి కబురు చేయగా..చూడడానికి సైతం రాలేదు. దీంతో అవివాహితురాలైన రాయల వెంకట నర్సమ్మ చేత తండ్రికి తల కొరివి పెట్టించారు. ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు కంటతడి పెట్టారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement