సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) విద్యార్థులకు ఏప్రిల్‌లో వార్షిక పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. డీఎడ్ ప్రథమ సంవత్సర విద్యార్థులు వచ్చేనెల 1లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని పేర్కొంది. రూ.50 ఆలస్య రుసుముతో వచ్చేనెల 7 లోగా ఫీజు చెల్లించవచ్చంది. 2015–17 బ్యాచ్ నుంచి కొత్త సిలబస్‌లో చదువుకొని ఒకసారి ఫెయిలైన వారు మాత్రమే ఈ పరీక్షలకు అర్హులని పేర్కొంది. రెగ్యులర్ విద్యార్థులకు రూ.150 పరీక్ష ఫీజుగా నిర్ణయించినట్లు తెలిపింది. ఫెయిలైన విద్యార్థులు 4 లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.150 చెల్లించాలని పేర్కొంది.
మూడు సబ్జెక్టులకు రూ.140, రెండు సబ్జెక్టులకు రూ.120, ఒక సబ్జెక్టుకు రూ.100 చెల్లించాలని పేర్కొంది. డీఎడ్ రెండో ఏడాది విద్యార్థులు ఈ నెల 24లోగా ఫీజు చెల్లించాలని పేర్కొంది. రూ.50 ఆలస్య రుసుముతో ఈ నెల 28లోగా ఫీజు చెల్లించవచ్చంది. ఓల్డ్ సిలబస్ వారికి ఇదే ఆఖరి చాన్స్ అని, సష్టం చేసింది. విద్యార్థులు నాలుగు లేదా ఐదు సబ్జెక్టులకు రూ.250, మూడు సబ్జెక్టులకు రూ.175, రెండు సబ్జెక్టులకు రూ.150, ఒక సబ్జెక్టుకు రూ.125 చెల్లించాలని తెలిపింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అప్‌లోడ్ చేసే లింక్‌ను ఈ నెల 24వ తేదీ నుంచి అందుబాటులోకి తెస్తామని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment