
అన్ని స్థాయిల్లోనూ మహిళలపై వివక్ష
జాతీయ సదస్సులో ప్రొఫెసర్ చంద్ర
హన్మకొండ అర్బన్: దేశంలో అన్ని స్థాయిల్లోనూ మహిళలపై వివక్ష కొనసాగుతోందని, దాని నుంచి బయటపడాలంటే మహిళలు చైతన్యవంతులై పోరాడాలని చెన్నైకు చెందిన ప్రొఫెసర్ ఆర్.చంద్ర పిలుపునిచ్చారు. వరంగల్ నిట్‌లో జరిగిన 5వ జాతీయ మహిళా ఉద్యోగుల సదస్సు రెండోరోజు కార్యక్రమంలో ప్రొఫెసర్ చంద్ర మాట్లాడారు. ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి చట్టాలు చేయించుకోవాల్సిన అవసరం ఉం దని అభిప్రాయపడ్డారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అక్రమమార్గంలో వినియోగించుకుంటూ మగ సంతానాన్నే కనేందుకు ఇష్టపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో దళిత మహిళలు అవమానకరస్థితిలో జీవితం గడుపుతున్నారన్నారు.
ముగిసిన సదస్సు: రెండురోజుపాటు జరిగిన జాతీయ సదస్సు ఆదివారం ముగిసింది. మొత్తం 23 రాష్ట్రాల నుంచి 400 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఏఐఎస్‌జీఈఎఫ్‌జాతీయ చైర్మన్ ముత్తసుందరం ప్రవేశపెట్టిన వరంగల్ డిక్లరేషన్ తీర్మానాలను ప్రతినిధులు ఆమోదించారు.