డినకరుడు | Disease-resistant armor | Sakshi
Sakshi News home page

డినకరుడు

Published Sun, Apr 5 2015 12:29 AM | Last Updated on Sat, Aug 18 2018 8:37 PM

Disease-resistant armor

వ్యాధి నిరోధక కవచం
సూర్యరశ్మితో  విటమిన్ ‘డి’ లభ్యం
జిల్లావాసులకుఅందని భాగ్యం
{పధానంగా కాల్షియం లోపం
{Vేటర్ సిటీలో బాధితులు 80 శాతం

 
ఎంజీఎం : అపార్ట్‌మెంట్ జీవనం, ఆహారపు అలవాట్లు, జీవనశైలి, అర్ధరాత్రి విధుల వంటివి జిల్లావాసులకు సూర్యకిరణాల స్పర్శ తాకనివ్వడం లేదు. ఇందులో గ్రేటర్ సిటీ ప్రజలు ముఖ్యంగా వస్తారు. సూరీడి లేత కిరాణాల  నుంచి విటమిన్-డి లభిస్తుంది.  విటమిన్-డి లభించకపోవడం తో 50 ఏళ్లలో వచ్చే సమస్యలు 25 ఏళ్లకే వస్తున్నారుు. ప్రధానంగా కాల్షియం సంబంధిత వ్యాధులు అధికంగా వస్తారుు. విటమిన్ లోపంతో దాదాపు 80 శాతం ప్రజలు బా దపడుతున్నారు. గ్రామీణులు ధృఢంగా ఉండటానికి ప్రధాన కారణం విటమిన్-డి. వారు ఉదయం ఐదు గంటలకే నిద్ర లేస్తారు. ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు వచ్చే సూరీడి లేలేత కిరాణాలతో విటమిన్-డి లభిస్తుంది. దీంతో వారు మానసికోల్లాసంగాను, ఉత్తేజపూరితంగాను ఉంటారు. సూర్యకిరణాలు కాల్షియంను రక్తంలో ఇనుమడింప చేసి కొవ్వు వంటి పదార్థాలను కరగదీయడానికి ఉపయోగపడతారుు. ఇలా మానవ శరీరంలో మిటమిన్-డి ఉత్తేజపూరితం చేస్తే వ్యాధులు దరిచేరవు. సూర్యకిరణాల ద్వారా 80 శాతం, ఆహార పదార్థాల ద్వారా 20 శాతం విటమిన్-డి లభిస్తుంది.

మిటమిన్-డి రకాలు: మిటమిన్-డిలో మిటమిన్ డి1, డి2, డి3, డి7.. ఇలా దాదాపు పది రకాలు ఉం టారుు. వీటిలో మిటమిన్-డి2(ఎర్గో క్యాల్సిఫెరాల్), మిటమిన్-డి3(కోలీ క్యాల్సి ఫెరాల్) ముఖ్యమైనవి.  మిటమిన్-డి లోపాలతో సమస్యలు సాధారణంగా ఆరోగ్యవంతుడి రక్తంలో మిటమిన్-డి 50-65 ఎన్‌జీ, ఎంఎల్ ఉండాలి. లేకపోతే  ము ఖ్యంగా జింక్, పాస్ఫరస్ వంటి ఖనిజ లవణాల అసమతుల్యత దెబ్బతింటుంది. అత్యంత వేగంతో భావోద్వేగాలు మారడం, మానసిక ఆరోగ్యం దెబ్బతినడం జరుగుతాయి. అలాగే గ ర్భిణుల్లో పిండం ఎదుగుదల లోపించడం, కండరాల కదిలకలో సమన్వయ లోపం, ధమనుల్లో రక్తప్రసరణ, చక్కెర నియంత్రణ, ఎముకల్లో బలం లోపించడం వంటివి జరుగుతాయి.

మిటమిన్-డి విశేషాలు

విటమిన్-డి ఉదయం, సాయంత్రపు సూర్యరశ్మి తో లభిస్తుంది. సూర్యకిరణాలు చర్మానికి తాకడంతో అది కాలేయూనికి చేరుతుంది. మిటమిన్-డి తయారీ లో కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. ఎండ తక్కువ గా ఉండే చలికాలం నాలుగు నెలల కోసం అవసరమై న మిటమిన్-డిని కాలేయం నిల్వ చేసుకుంటుంది.

సూర్యకిరణాల ద్వారా లభించే కాల్షియం శరీరంలోని ఎముకలను పటిష్టం చేస్తుంది. గర్భిణులకు తగి నంత మిటమిన్-డి లభిస్తే భవిష్యత్తులో పిల్లలు ఆ రోగ్యంగా ఉంటారు. మంచి ఎదుగుదల ఉంటుంది. విటమిన్-డి చేపల కాలేయం, వెన్న,  కొడిగుడ్డు పచ్చసొన, రాగులు, జొన్నలు, ముడి బియ్యం, ఆకు కూరలు, మొలకెత్తిన ధాన్యంలో లభిస్తుంది.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement