
పిల్లాడికి వాతలు పెట్టిన తల్లి
ప్రియుడి మత్తులో పడి ముక్కు పచ్చలారని బాలుడికి వాతలు పెట్టిందో కన్నతల్లి.
హైదరాబాద్: ప్రియుడి మత్తులో పడి ముక్కు పచ్చలారని బాలుడికి వాతలు పెట్టిందో కన్నతల్లి. హైదరాబాద్ మౌలాలి ప్రాంతంలో నివాసం ఉంటున్న అన్వర్ పాషా, రేష్మకు ఇద్దరు పిల్లలు. గత కొంత కాలంగా మహేష్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకున్న రేష్మ కుటుంబాన్ని వదిలేసి అతనితో వెళ్ళిపోయింది.
కొద్ది రోజుల క్రితం తిరిగి వచ్చిన ఆమె, తన పిల్లలు కావాలంటూ నాలుగేళ్ళ కొడుకును తీసుకు వెళ్ళింది. విషయం తెలుసుకున్న తండ్రి ఆరా తీయగా 50 వేల రూపాయలు ఇస్తేనే బాబును ఇస్తానంటూ రేష్మ తేల్చి చెప్పింది. దీంతో మౌలాలీ రైల్వే స్టేషన్ వద్ద రేష్మ ఉందన్న సమాచారంతో అక్కడికి వెళ్ళి బాలుడిని తీసుకవచ్చారు.
అయితే ఆ బాలుడి ఒంటిమీద ఎక్కడ పడితే అక్కడ వాతలు కన్పించడంతో షాకయ్యారు. పెదవులు కూడా చిట్లిపోయాయి. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి చికిత్స కోసం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాలుడి గాయాల తీవ్రత దృష్ట్యా ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. మరోవైపు ఫిర్యాదు అందుకున్న నేరేడ్ మేట్ పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.