సాక్షి, హైదరాబాద్: సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు కుమారుడు శ్రీనివాస్ కార్యాలయాలు, ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విభాగం సోమవారం సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌తోపాటు బెంగళూరులోనూ తనిఖీలు చేసింది. కర్ణాటకకు చెందిన ప్రముఖ బ్యాంకు నుంచి ఆయన రూ. 315 కోట్ల రుణం తీసుకుని చెల్లించలేదు. దీంతో ఆ బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు గతంలోనే శ్రీనివాస్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఉన్న ఆధారాల మేరకు ఈడీ అధికారులు సోమవారం హైదరాబాద్, బెంగళూరుల్లోని ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment