కొండపాక (గజ్వేల్)/సిద్దిపేటటౌన్: కేన్సర్ వ్యాధి నివారణకు ప్రత్యేకంగా ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు సత్యసాయి సేవా ట్రస్టు నిర్వాహకులను కోరారు. సిద్దిపేట జిల్లా కొండపాక శివారులోని సత్యసాయి సేవా సంస్థ ప్రశాంతి నికేత న్ ఉచిత బాలికల జూనియర్ కళాశాల వార్షికోత్సవంలో శనివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. ఆస్పత్రి ఏర్పాటుకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని వారికి భరోసానిచ్చారు. కొండపాకలో ప్రశాంతి ప్రగతి నికేతన్ బాలికల జూనియర్ కళాశాల ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతపిల్లలకు మన సంస్కృతీ సంప్రదాయాలను నేర్చుకునే అవకాశం లభించిందన్నారు.
సత్యసాయి సేవా సమితి కర్ణాటక, తెలంగాణలో 22 విద్యా సంస్థలను నడుపుతూ ఎంతో మంది పేద విద్యార్థుల బతుకుల్లో వెలుగులు నింపుతోందన్నా రు. హరీశ్‌రావు కోరిన విధం గా కేన్సర్ వ్యాధి నివారణ కోసం మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని సత్యసాయి సేవా సంస్థ ప్రతినిధి భగవాన్ మధుసూదన్ నాయుడు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, చిట్టి దేవేందర్‌రెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, మెదక్–సిద్దిపేట–హుస్నాబాద్ మీదుగా ఎల్కతుర్తి వరకు, సిరిసిల్ల–సిద్దిపేట–చేర్యాల మీదుగా జనగామకు వెళ్లేందుకు జాతీయ రహదారుల ఏర్పాటుపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని హరీశ్ ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment