విద్యార్థులతో మంత్రి ఈటల
కరీంనగర్ : ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి ఫలితాల్లో 10జీపీఏ సాధించి అణిముత్యాల్లాంటి పిల్లలను తయారు చేసిన ఉపాధ్యాయులకు అభినందనలు అని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం పీఆర్‌టీయూటీఎస్ కరీంనగర్ జిల్లా శాఖ పదోతరగతి ఫలితాల్లో 10జీపీఏ సాధించిన విద్యార్థులకు, వందశాతం ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ పాఠశాలలకు ప్రతిభా పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హజరై విద్యార్థులకు జ్ఞాపికలు అందజేసి ఉపాధ్యాయులను జ్ఞాపిక, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్య ద్వారానే అభివృద్ది సాధ్యమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల విద్యాబోధనచే విద్యార్థులు 10 జీపీఏ సాధించడం సాధ్యమన్నారు.
ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్‌కు దీటుగా గొప్పగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులే ఎక్కువగా చదువుకుంటారని వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వం వ్యవసాయం తరువాత విద్యపై ఎక్కువ నిధులు ఖర్చు చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 500లకు పైగా గురుకుల పాఠశాలలను ప్రారంభించి పేద వర్గాలకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని తద్వారా పేద కుటుంబాల జీవితాల్లో వెలుగులు నిండుతాయని అన్నారు. విద్యార్థుల భవిష్యత్ ఉపాధ్యాయుల చేతుల్లో ఉందన్నారు. పీఆర్‌టీయూటీఎస్ జిల్లా అధ్యక్షుడు జాలి మహేందర్‌రెడ్డి అ«ధ్యక్షతన జరిగిన సమావేశంలో జెడ్పీటీసీ సిద్దం వేణు, సుడా చైర్మన్ జీవీ రామక్రిష్ణారావు, కార్పోరేటర్ సునీల్‌రావు, పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు ఆదర్శన్‌రెడ్డి, సభ్యులు వెంకటరాజం, రవికుమార్, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి, పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వర్‌రావు, జనరల్ సెక్రెటరీ ముస్కు తిరుపతిరెడ్డి, పీఆర్‌టీయూ బాధ్యులు గణేశ్, శ్రీనివాస్, జైపాల్‌రెడ్డి, మహేశ్, తిరుపతి, శ్రీధర్‌రెడ్డి, కిషన్,రాధకృష్ణ, శ్రవణ్‌కుమార్, బాల్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, నరేందర్‌రెడ్డి, శ్రీని వాస్, కాళిదాస్, వేణు, చోటేమియా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment