నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్‌ దాడులు | excise raids in Khammam | Sakshi
Sakshi News home page

నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్‌ దాడులు

Published Sat, Apr 22 2017 10:13 PM | Last Updated on Thu, Jul 11 2019 8:43 PM

excise raids in Khammam

పాల్వంచ : నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్‌ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. సీఐ రాంప్రసాద్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణ పరిధిలోని జగ్గుతండా, శేఖరం బంజర గ్రామాల్లో నాటు సారా స్థావరాల్లో విస్త్రృతంగా పర్యటించినట్లు తెలిపారు. ఈ సందర్బంగా 10 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకుని, 200 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసినట్లు తెలిపారు. గుగులోతు బిక్కులాల్‌ను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ పున్నయ్య, సిబ్బంది లింగా, శ్రీనివాసరావు, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement