అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
Published Sat, Sep 16 2017 2:20 PM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM
కామారెడ్డి: అప్పుల బాధ తాళలేక ఓ రైతు తన పంట పొలంలోని చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డిలోని ముదాం బజార్‌కు చెందిన ముదాం నాగయ్య(65) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పంట దిగుబడి సరిగ్గా లేకపోవడంతో పాటు తెచ్చిన అప్పులు తీర్చే దారి కనపడక ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement