nagaiah
-
దళిత ద్రోహి చంద్రబాబు
తాడేపల్లి రూరల్: చంద్రబాబు దళిత, పేద ప్రజల ద్రోహి అని మరోసారి స్పష్టమైందని రాజధాని అమరావతి ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మల్లవరపు నాగయ్య ధ్వజమెత్తారు. పేదలకు ప్రభుత్వం ఇస్తున్న ఇళ్ల స్థలాలకు అడ్డుపడొద్దంటూ సోమవారం రాయపూడి నుంచి హైకోర్టు వరకూ భారీ ర్యాలీ తలపెట్టారు. అయితే ముందస్తుగా పోలీసులు ఎమ్మార్పీఎస్ నాయకులను అరెస్టు చేసి, గుంటూరు జిల్లా మంగళగిరి టౌన్ పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారు. ఈ సందర్భంగా నాగయ్య మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలో ఉన్నన్నాళ్లూ దళితులు, పేదలను పూచికపుల్లతో సమానంగా చూశారని మండిపడ్డారు. దేశంలో ఏ సీఎం చేయని విధంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటే కోర్టులో పిటిషన్లు వేయిస్తూ చంద్రబాబు అడ్డుకుంటున్నారని విమర్శించారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఎమ్మార్పీఎస్ నేతలు జాన్‌బాబుమాదిగ, కట్టెపోగు బాబూరావు, మిట్టా నిర్మలమాదిగ, తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు దేవరాజు తదితరులున్నారు. -
పిలిచి సినిమాల్లోకి రమ్మన్నారు..
సాక్షి, జూపాడుబంగ్లా: ‘నేసేవాడినంటున్నావు కాస్త మంచి బట్టలు కట్టుకొని రావొచ్చు కదా అంటే ఇళ్లు కట్టేవాడికి ఇళ్లుండదు, చెప్పులు కుట్టేవాడికి చెప్పులుండవు.. మాపరిస్థితి కూడా అంతే’నంటూ వేదం సినిమాలో చెప్పిన డైలాగ్‌తో పాపులర్ అయిన రాములు పాత్రదారి వేదంనాగయ్య నిజజీవితంలో కూడా అష్టకష్టాలు అనుభవించాడు. సినిమాలో నటించే ఏడుపు సీన్ల వెనుక నిజ జీవితంలో జరిగిన ఎన్నో ఘటనలను గుర్తుకు తెచ్చుకొంటే నిజంగానే ఏడుపువస్తుందంటున్నారు. 75 ఏళ్ల వయసులో కూడా చలాకీగా సినిమాల్లో నటిస్తూ కుటుంబపోషణలో తనవంతు పాత్ర పోషిస్తున్న వేదంనాగయ్య మంగళవారం పోతులపాడులో సినిమా షూటింగ్ సందర్భంగా ‘సాక్షి’తో మాట కలిపారు. తన ఊరు, పేరు సినిమా ప్రవేశంపై ఆయన మాటల్లోనే.. ‘మాది గుంటూరు జిల్లా, నర్సరావుపేట వద్ద దేసవరంపేట. నాకున్న రెండెకరాలు సాగు చేసుకుంటూ మిగతా సమయాల్లో కూలి పనులు వెళ్తుంటి. ఊరిలో పనులు లేకపోవడంతో కుమారుడి వెంట హైదరాబాదు వెళ్లాం. ఓ రోజు హైదరాబాదులో నడుచుకుంటూ వెళ్తుంటే ప్రొడ్యూజర్ రాధాకృష్ణ గారు చూసి సినిమాలో నటిస్తావా అని అడిగారు. కొడుకును అడిగి విషయం చెబుతానన్నా. ఇంటికెళ్లి మా వాడితో చెబితే ‘నీలాంటి వాళ్లు సినిమాలో నటించేందుకు చాలా మంది ఉంటారు. నీకెవరు అవకాశం ఇస్తారు’ అన్నాడు. చివరికి ఏదోలాగా ఒప్పించి ప్రొడ్యూజర్ కార్యాలయానికి వెళ్లే పెద్ద డైలాగ్ చీటి ఇచ్చి నేర్చుకోవాలని చెప్పారు. మొత్తం కంఠస్తం పట్టి చెప్పడంతో వేదం సినిమాలో అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి నాపేరు ముందు వేదం సినిమా పేరు చేరిపోయింది. వేదం, నాగవల్లి, ఒక్కడినే, స్టూడెంట్ స్టార్, ఏమాయ చేశావే, రామయ్య వస్తావయ్యా, స్పైడర్ తదితర 25 సినిమాల్లో నటించాను. సినిమా తీసే కంపెనీని బట్టి రోజుకు రూ.3వేల నుంచి రూ.25వేల దాకా ఇస్తారు. అయినా కుటుంబాలు గడవటం కష్టంగా ఉంది. ఈ మధ్య ఆరోగ్యం బాగోలేక పోవడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.లక్ష ఆర్థిక సాయం చేశారు. ‘మా’ అసోసియేషన్ వారు నెలకు రూ.2,500 పింఛన్ ఇస్తున్నారు. ‘తాతా మనవడు’తో మొదలెట్టా.. 1500 సినిమాల్లో నటించి, పలు నాటకాలు రచించిన జీఎస్ఆర్. మ్మూర్తి అలియాస్ కవి కూడా సాక్షితో మాట్లాడారు. ఆయన మాటల్లోనే ‘మాది విజయనగరం జిల్లా, బజ్జిపేట మండలం, గంగాడ గ్రామం. ప్రస్తుతం కుటుంబసభ్యులతో హైదరాబాదులో ఉంటున్నా. 1972 నుంచి సినిమా రంగంలో ఉన్నా. తాతా మనుమడు సినిమాతో నా సినీ రంగ ప్రస్థానం మొదలైంది. ఇప్పటి వరకు 1500 సినిమాల్లో నటించాను. 70షీల్డులు అందుకున్న నేను సొంతిల్లు మాత్రం సంపాదించుకున్నా. ఏదైనా ఇబ్బందులు ఎదురైతే ‘మా’ అసోసియేషన్ వారు సాయం చేస్తారు. ప్రస్తుతం నెలకు రూ.2,500 పింఛన్ ఇస్తున్నారు. – జీఎస్ఆర్ మూర్తి ఆలియాస్ కవి రైతుల దీనస్థితిపై సినిమా అనంతపురం జిల్లా రైతుల దీనగాథను ‘విరంజి’ పేరుతో తెరకెక్కిస్తున్నట్లు డైరెక్టర్ వెంకటరాఘవన్ తెలిపారు. ఇందుకు సంబంధించి జూపాడు బంగ్లా మండలం పోతులపాడు, చాబోలు పరిసర ప్రాంతాల్లో రెండు రోజులుగా షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో మంగళవారం డైరెక్టర్, యూనిట్‌సభ్యులు మీడియాతో మాట్లాడారు. హీరో ‘çస్కంద’ మాట్లాడుతూ.. రైతులు విత్తనాల కొనుగోలు నుంచి ఉత్పత్తులను గిట్టుబాటు ధరకు అమ్ముకునే వరకు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కుటుంబాలు గడవక భార్యల పుస్తెలు తాకట్టుపెట్టి అప్పులు తీరుస్తున్నారని, అప్పటికీ తీరక ఆత్మహత్యకు పాల్పడుతున్నారని, ఇలాంటి రైతు దీన గాథలను సినిమాలో చూపిస్తామన్నారు. హైదరాబాదు పరిసరాల్లో 90శాతం చిత్రీకరణ పూర్తయిందన్నారు. రవివర్మ, అప్పాజీ, ప్రీతినిగమ్(నటి), వేదం నాగయ్య, కవి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారన్నారు. చాబోలుకు చెందిన ఓ వ్యక్తి కాటికాపరి పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
కామారెడ్డి: అప్పుల బాధ తాళలేక ఓ రైతు తన పంట పొలంలోని చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డిలోని ముదాం బజార్‌కు చెందిన ముదాం నాగయ్య(65) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పంట దిగుబడి సరిగ్గా లేకపోవడంతో పాటు తెచ్చిన అప్పులు తీర్చే దారి కనపడక ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
ఎస్కేయూ : వర్సిటీ పరిధిలోని విజయనగర దాబా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగయ్య అనే వ్యక్తి గాయపడ్డాడు. ఇటుకలపల్లి ఎస్ఐ అబ్దుల్ కరీం తెలిపిన వివరాల మేరకు... వివేకానంద జూనియర్ కళాశాలలో వాచ్‌మెన్‌గా నాగయ్య మంగళవారం విజయనగర దాబాలో ఆహారం తీసుకుని రోడ్డు దాటుతుండగా, ధర్మవరం వైపు నుంచి వచ్చిన టాటా సుమో ఢీకొది. ఈ ఘటనలో నాగయ్యకు తీవ్రగాయాలయ్యాయి. స్పందించిన స్థానికులు వెంటనే అతన్ని ఆస్పపత్రికి తరలించారు. కాగా, సుమో డ్రైవరు ఆపకుండా వెళ్లిపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఎడ్లబండి కింద పడి రైతు మృతి
గూడూరు : మండలంలోని దామరవంచకు చెందిన ఈ సం నాగయ్య (50) అనే రైతు ప్రమాదవశాత్తు ఎడ్లబండి కిం ద పడి మృతిచెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. నాగయ్య, భార్య భద్రమ్మతో కలిసి ఎడ్లబండిపై 8 బస్తాల వరి ధాన్యాన్ని బియ్యం పట్టించేందుకు బయలుదేరారు. గూడూరులో ప్రధాన రహదారిపై వెళ్తుండగా బండి ఎద్దులు బెదురుతూ పరుగెత్తాయి. దీంతో బండిపై ఉన్న నాగయ్య దిగి ఎద్దుల పగ్గాలు పట్టుకొని నడుస్తున్నాడు. అయితే ఎదురుగా వస్తున్న వాహనాల శబ్దానికి బెదిరిన ఎడ్లు వేగంగా పరుగెత్తడంతో ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. దీంతో బండి అతని చాతిపై నుంచి వెళ్లింది. తీవ్రంగా గాయపడిన నాగయ్యను స్థానికులు సీహెచ్‌సీకి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఎంజీఎంకు తరలిస్తుండగా మధ్యలోనే మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడి భార్య భద్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీష్ తెలిపారు. -
గల్లంతైన మత్స్యకారుల మృతదేహాల గుర్తింపు
నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామంలోని చెరువులో గల్లంతైన ఇద్దరు మత్స్యకారుల మృతదేహాలను ఆదివారం గుర్తించారు. పెద్దదేవులపల్లి గ్రామానికి చెందిన సుమారు 200 మంది మత్స్యకారులు శనివారం సాయంత్రం గ్రామం సమీపంలోని చెరువులో వలలు వేయడానికి వెళ్లారు. చేపల వేటకు వీలుగా నీటిలో వలలు విడిచి తిరిగి రాగా, ముగ్గురు మాత్రం తెప్ప తిరగబడడంతో గల్లంతయ్యారు. వారిలో అంబటి వెంకన్న మృతదేహం రాత్రి ఒడ్డుకు కొట్టుకువచ్చింది. వడ్డి సోమయ్య (50), నాగయ్య (22) మృతదేహాలను ఆదివారం ఉదయం గాలింపు చర్యల్లో భాగంగా గుర్తించారు. ఇక్కడి చెరువు భారీ విస్తీర్ణంలో ఉంటుంది. భారీ ఈదురు గాలులకు చెరువు మధ్య భాగంలో తెప్ప తిరగబడడం వల్ల అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడ్డుకు ఈదుకుంటూ రాలేకపోయి ఉంటారని తోటి మత్స్యకారులు అంటున్నారు. కాగా, ప్రమాదం జరిగిన చెరువును జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఆదివారం ఉదయం పరిశీలించారు. ఆర్డీవో, డీఎస్పీలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అన్నిరకాల సాయం అందించే కృషి చేస్తామన్నారు. -
వేదం నాగయ్యకు కేటీఆర్ రూ.లక్ష సాయం
-
కన్న కొడుకే.. కాలయముడు!
చిలకలూరిపేట : కన్నకొడుకే తండ్రి పాలిట కాలయముడయ్యాడు. ఆస్తి దక్కదన్న అక్కసుతో కిరాయి వ్యక్తుల్ని వెంట తీసుకువచ్చి పథకం ప్రకారం నట్టింట్లో గొంతునులిమి హత్యచేశాడు. ఇంట్లోని డాక్యుమెంట్లు, నగదు ఉన్న సంచితో హంతకుడు, అతని అనుచరులు పరారయ్యారు. ఈ హత్య మండలంలోని కుక్కపల్లి వారిపాలెంలో సోమవారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన కొండ్రుగుంట నాగయ్య (76), కమలమ్మకు ముగ్గురు సంతానం. పెద్దకుమారుడు శివశంకర్, రెండో కుమారుడు హరిబాబు, కుమార్తె ధనమ్మ ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు జరిగాయి. హరిబాబు (45)కు 15ఏళ్ల క్రితమే వివాహం కాగా ఆరునెలలు తిరక్కముందే భార్య తెగతెంపులు చేసుకుని వెళ్లిపోయింది. వ్యసనాలకు బానిసైన హరిబాబు ఆ తర్వాత ఐదేళ్లకు మళ్లీ పెళ్లి చేసుకోగా ఆమెకూడా ఎనిమిదేళ్ల క్రితం ఇల్లు విడిచింది. ఈమెకు పుట్టిన బిడ్డ మహేష్ ప్రస్తుతం నానమ్మల వద్దే ఉంటూ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కాగా, నాగయ్యకు పాతిక ఎకరాల ఆస్తి ఉంది. తన ముగ్గురు బిడ్డలకు సమానంగా పొలం ఇవ్వాలని భావించాడు. హరిబాబు వ్యవసానాలకు బానిస కావడంతో కొడుకు వాటాలోని సగ భాగాన్ని మనవడైన మహేష్‌కు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. తండ్రి నిర్ణయాన్ని హరిబాబు ఒప్పుకోలేదు. దీంతో తండ్రి కొడుకుల మధ్య పదిరోజులుగా ఘర్షణలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో అనుచరులతో కలసి హరిబాబు ఇంట్లోకి వచ్చి గొడవ విషయమై తండ్రి కోసం పోలీసులు వచ్చారని తల్లితో చెప్పాడు. ఈలోగా ఇంటి పక్కనే ఉన్న పాకలో పడుకున్న నాగయ్య విని వరండాలోకి వచ్చాడు. హరిబాబు కండువాను తండ్రి మెడకు వెనుక నుంచి ఉచ్చులా వేశాడు. వెంటనే ఆలా శ్రీను రెండు చేతుల్ని వెనక్కులాగి ఉచ్చు బిగించి, తలపై బలంగా కొటాడు. నాగయ్య తలనుంచి, చెవుల నుంచి రక్తం చూసిన హరిబాబు కొడుకు మహేష్ తాతయ్యను చంపుతున్నారంటూ కేకలు వేస్తూ బయటకు పరుగు పెట్టాడు. అడ్డువెళ్లిన కనకమ్మనూ కొట్టారు. క్షణాల్లో నాగయ్య ప్రాణం కోల్పోవడంతో ఆయన చొక్కా విప్పి, దేహంపై ఉన్న నెత్తురు తుడిచి, వరండాలోని రక్తాన్ని నీళ్లతో శుభ్రం చేశారు. తండ్రి శవాన్ని శుభ్రం చేసి ఇంటి పక్క పాకలో మంచంపై పడుకో బెట్టి దుప్పటి కప్పి పరారయ్యారు. అనంతరం ఇంట్లోంచి తీసుకువెళ్లిన సంచిలోని 13 సవర్ల బంగారు గొలుసు, రెండు ఉంగరాలు తీసుకుని, డాక్యుమెంట్లు ఉన్న సంచిని గ్రామంలోని చెరువులో పడేశారు. మంగళవారం కుటుంబసభ్యులు చూసి బయటకు తీశారు. అందులో కొంత నగదు ఉంది. చెరువులో లభ్యమైన నగదు, డాక్యుమెంట్లను ఇంటి వద్ద ఆరబెట్టారు. కాగా, సోమవారం నాగయ్య కూతురు ధనమ్మ నగలను బ్యాంకు నుంచి విడిపించగా మిగిలిన డబ్బు సంచిలో ఉంచినట్లు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో హత్య పది రోజుల క్రితం పెద్దకోడలు హైదరాబాద్‌లో ఉంటున్న కూతురు వద్దకు వెళ్లింది. ఆమెభర్త శివశంకర్ అత్తగారి ఊరైన పరిటాల వారిపాలెం వెళ్లాడు. ఇదే అదునుగా మహేష్ భావించి ఈ అఘాయిత్యానికి వడిగట్టాడు. రూరల్ సీఐ దిలీప్‌కుమార్, రూరల్ ఎస్ఐ జగదీష్ బాధితుల నుంచి వివరాలు సేకరించారు. -
వర్షం మిగిల్చిన నష్టమిదీ..
యద్దనపూడి (మార్టూరు), న్యూస్‌లైన్ : ఇటీవల కురిసిన వర్షాలు రైతులకు నష్టాలు మిగిల్చాయి. మండలంలో ఏ రైతును కదిలించినా..కంట నీరు తప్ప నోట మాట రావడం లేదు. పత్తి, పొగాకు రైతులు ఎక్కువగా నష్టపోయారు. మండలంలోని పోలూరు గ్రామానికి చెందిన నాగయ్య ఎకరాకు రూ 16 వేలు పెట్టి 2 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. ఇప్పటికి ఎకరానికి రూ 40 వేల వరకు ఖర్చయింది. ఇటీవల కురిసిన వర్షాల వల్ల వాగు పొంగి చేనుమీద పడింది. చేనంతా నీటిపాలై ఉరకెత్తి ఎండిపోసాగింది. దీంతో చేసేదేమీ లేక చేను పీకేశాడు. అదేవిధంగా మండలంలోని చిమటావారిపాలెం గ్రామానికి చెందిన దేవిరెడ్డి అనిల్ కుమార్ ఎకరాకు రూ 15 వేలు చొప్పున రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని పొగాకు సాగు చేశాడు. ఇప్పటికే ఎకరానికి రూ 25 వేల వరకు పెట్టుబడి పెట్టాడు. వర్షాలకు చేలో నీరు పారి, వేసిన పొగతోట కొట్టుకుపోయింది. మళ్లీ రూ 10 వేలు ఖర్చుపెట్టి నారు కొనుగోలు చేసి పంట సాగు చేసేందుకు సమాయత్తమయ్యాడు. ఇలా ఆ ఇద్దరు రైతులే కాదు..మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న రైతులు ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు.