ఎస్కేయూ : వర్సిటీ పరిధిలోని విజయనగర దాబా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగయ్య అనే వ్యక్తి గాయపడ్డాడు. ఇటుకలపల్లి ఎస్‌ఐ అబ్దుల్ కరీం తెలిపిన వివరాల మేరకు... వివేకానంద జూనియర్ కళాశాలలో వాచ్‌మెన్‌గా నాగయ్య మంగళవారం విజయనగర దాబాలో ఆహారం తీసుకుని రోడ్డు దాటుతుండగా, ధర్మవరం వైపు నుంచి వచ్చిన టాటా సుమో ఢీకొది. ఈ ఘటనలో నాగయ్యకు తీవ్రగాయాలయ్యాయి. స్పందించిన స్థానికులు వెంటనే అతన్ని ఆస్పపత్రికి తరలించారు. కాగా, సుమో డ్రైవరు ఆపకుండా వెళ్లిపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.