తీలేర్‌లో కౌలురైతు ఆత్మహత్య
కుటుంబ సభ్యుల రోదనలు
పెద్దచింతకుంట (ధన్వాడ) : వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక ఓ కౌలురైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయ లు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే... ధన్వాడ మండలం పెద్దచింతకుంటకు చెందిన కుర్వ చిన్న మల్లేష్(38) కు ఐదెకరాల పొలం ఉంది. ఈయనకు భార్య పద్మమ్మతోపాటు కుమారుడు, ఇద్దరు కుతూళ్లు ఉన్నారు. రెండేళ్ల క్రితం తీలేర్ శివారులో మరో 20ఎకరాలు కౌలుకు తీసుకు న్నాడు.
అప్పటి నుంచిఎకరాకు *20 వేల చొప్పున పెట్టు బడులు పెట్టి పత్తి, ఆముదం సాగు చే యసాగాడు. అయితే వర్షాభావ పరిస్థితుల వల్ల పంటల నుంచి ఆశించిన దిగుబడి రాకపోవడంతో అప్పుల భారం *12 లక్షలకు పెరి గింది. వీటిని తీర్చడానికి ఏడాది కాలంగా తీలేర్ సింగిల్‌విండోలో రుణం కోసం తిరుగుతున్నాడు. అది ఇంతవరకు మంజూరు కాకపోవడంతో జీవితంపై విరక్తి చెందాడు. ఈ క్రమంలోనే అతను శనివారం ఉదయం బంధువుల వద్దకు వెళ్లొస్తానని కుంటుంబ సభ్యులకు చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు.
అదే రాత్రి బైక్‌పై కౌలుకు తీసుకున్న పొలానికి వెళ్లి విస్కీలో పురుగుమందు కలుపుకొని తాగి చనిపోయాడు. ఆదివారం ఉదయం చుట్టుపక్కల రైతులు గమనించి వెంటనే కుంటుంబ సభ్యులతోపాటు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ మధుసూదన్‌గౌడ్, వీఆర్‌ఓ రాఘవేందర్ పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట ఏరియా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
ప్రాణం తీసిన పత్తిసాగు
Published Mon, May 4 2015 2:54 AM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM
Advertisement