ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య | farmer suicides of financial problems | Sakshi
Sakshi News home page

ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య

Published Sun, Jun 14 2015 7:39 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

farmer suicides of financial problems

మెదక్: ఆర్థిక ఇబ్బందులతో ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లా దుబ్బాకలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. పట్టణానికి చెందిన సౌడు వెంకట్ రాజు (26) అనే రైతు రెండెకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. మిగతా సమయంలో ఆటో నడిపేవాడు. వరి వేసినా నీరందకపోవటంతో పంట ఎండిపోయింది. పెట్టుబడి కోసం రూ.2 లక్షల వరకు అప్పు చేశాడు. సాగు కలసి రాక అప్పు తీర్చే మార్గం లేక ఆటో విక్రయించాడు. జీవనాధారం లేకపోవడంతో వెంకట్‌రాజు ఆదివారం ఉదయం ఎవరూలేని సమయంలో ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
(దుబ్బాక)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement