ఖానాపురం : ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ జిల్లా ఖానాపురం మండలం మంగళవారిపేట శివారు కొడ్తిమాటుతండాలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన గుగులోతు శ్రీరాం(60) తనకున్న మూడెకరాల్లో మొక్కజొన్న, పత్తి సాగు చేశాడు. వర్షాభావంతో పంటలు ఎండిపోయాయి. దీనికి తోడు కొంతకాలం క్రితం కుమార్తె వివాహం చేశాడు. పంటల పెట్టుబడి, కుటుంబ అవసరాలకు రూ. 3 లక్షలు అప్పు చేశాడు.
పంటల దిగుబడి లేక అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు. దీనికి అనారోగ్యం తోడు కావడంతో మనస్తాపానికి గురైన శ్రీరాం గురువారం పత్తి చేనుకు వెళ్లి అక్కడే పురుగుల మందు తాగాడు. వాంతులు చేసుకుంటుండగా గమనించిన తోటి రైతులు కుటుంబసభ్యులకు సమాచారం అందించగా నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అక్కడే మృతిచెందాడు. శ్రీరాం భార్య భార్య చిలుకమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దుడ్డెల గురుస్వామి తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య
Published Thu, Aug 25 2016 7:32 PM | Last Updated on Tue, Nov 6 2018 8:04 PM
Advertisement