భయం..భయం
నల్లమలలోని వసతిగృహాల వార్డెన్లలో ఆందోళన నెలకొంది. నియోజకవర్గంలోని పలు హాస్టళ్లపై ఏసీబీ అధికారుల కన్ను పడింది. ఎప్పుడు ఏ సమయంలో ఎవరి హాస్టల్‌పై దాడులు జరుగుతాయోనని వార్డెన్లు బిక్కుబిక్కు మం టున్నారు. జాలీగా ఉద్యోగం చేసే వార్డె న్లు ఇప్పుడు హాస్టల్ అంటేనే జంకుతున్నారు. కొంత మంది వార్డెన్లు దొరికిపోకుండా ముందస్తుగా ఎక్కువగా నమోదచేసిన పేర్లను తొలగించే పనిలో ఉన్నా రు. మరికొందరు హుషారుగా సెలవుపై వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలోనే అత్యధికంగా అచ్చంపేటని యోజకవర్గం లోనే వసతిగృహాలు ఉన్నాయి. ఒక పీటీ జీ (చెంచు) మూడు సాంఘీక సంక్షేమ గురుకులాలు, రెండు మినీగురుకులాలు, ఆరు కస్తూరాబగాంధీ వి ద్యాలయాలు, 10 ఆశ్రమపాఠశాలలు, 26వసతి గృహా లు ఉన్నాయి. అచ్చంపేట ఎస్సీ హాస్టల్ లో 217 మంది విద్యార్థులుంటే ఏసీబీ తనఖీ రోజు వార్డెను 167 మంది ఉన్నట్లు హాజరు రిజిస్టర్‌లో నమోదు చేశారు. రా త్రి వేళ అధికారులు తనఖీలో మాత్రం 122మంది విద్యార్థులు హాస్టల్‌లో ఉన్నా రు. బియ్యం స్టాకులోను హెచ్చు తగ్గులు ఉన్నట్లు గుర్తించారు. ఇ లా ప్రతి హాస్టల్‌లో నమోదు సంఖ్యకు హాజరు శాతం, హాస్టల్‌లో విద్యార్థులు ఉంటున్నదానికి చాలాతక్కువగా ఉంటుంది.
మారిన మెనూ
ఏసీబీ అధికారుల దాడుల పుణ్యంతో విద్యార్థుల మెనూలో మార్పు వచ్చింది. తమకు కొంతలో కొంత న్యాయం జరుగుతుందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెడుతున్నారు. ఇదిలావుండగా నల్లమల ప్రాంతంలో వార్డెను పోస్టుకు మంచి డిమాండ్ ఉంది. కొంత మంది ఉపాధ్యాయులు డిప్యూటేషన్ కోసం పోటీ పడి ఉన్నత అధికారులకు లక్షలు ముట్టచెబుతూ ఈ పోస్టులోకి రావడానికి ఇన్నాళ్లు పోటీపడ్డారు. ఆశ్రమ పాఠశాలకు డిప్యూటేషన్‌పై రావాడానికి ఈమధ్య ఓ ఉపాధ్యాయుడు రూ.2లక్షలు చెల్లించినట్టు తెలిసింది. ఇప్పటికే చాలా మంది ఉపాధ్యాయులు డిప్యూటేషన్‌లపై వసతి గృహ సంక్షేమాధికారులుగా పనిచేస్తున్నారు. ఇటీవల ఏసీబీ దాడులు జరుగుతుండటంతో వారు తమ పోస్టులకు తిరిగి వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలిసింది.
rmitory, the warden, acb