గ్యాస్ లీక్ తో భారీ అగ్నిప్రమాదం
Published Sat, Feb 13 2016 2:19 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
సంగెం: వరంగల్ జిల్లా సంగెం మండలం షాపూర్‌లో గ్యాస్ లీక్ కావడంతో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బండారి దేవేందర్, ఏకాంబరంలకు చెందిన రెండు ఇళ్లు దగ్ధం అయ్యాయి. గ్యాస్ సిలిండర్లు కూడా పేలిపోయాయి. అగ్నిమాపక శకటం వచ్చేలోపే రెండు ఇళ్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. స్థానికులే మంటలను ఆర్పివేశారు. సుమారు రూ. 6 లక్షల వరకు నష్టం కలిగినట్టు బాధితులు చెబుతున్నారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్ బాధితులను పరామర్శించనున్నారు.
Advertisement
Advertisement