టేకులపల్లి (ఖమ్మం జిల్లా) : షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఇంట్లో నిల్వ చేసిన 30 క్వింటాళ్ల పత్తికి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటన టేకులపల్లి మండలం లచ్చతండాలో శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు వెంటనే నీళ్లు చల్లడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. సుమారు 10 క్వింటాళ్ల పత్తి కాలిపోయింది. రూ.లక్ష వరకు ఆస్తి నష్టం జరిగినట్లు యజమాని గుగులోత్ శంకర్ తెలిపారు.