బీరువాల దుకాణంలో అగ్నిప్రమాదం | fire accident happen in badrachalam | Sakshi
Sakshi News home page

బీరువాల దుకాణంలో అగ్నిప్రమాదం

Published Sun, Jan 25 2015 8:06 PM | Last Updated on Thu, Sep 13 2018 5:11 PM

బీరువాల తయారీ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది.

బీరువాల తయారీ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా భద్రాచలం పట్టణంలో ఆదివారం రాత్రి జరిగింది. వివరాలిలా... భద్రాచలంలో కోనవరం రోడ్డులో ఉన్న ఒక బీరువాల దుకాణంలో రాత్రి 7 గంటలకు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. మంటల్లో ఒక టాటా మినీ వాహనంతో పాటు, పెద్ద సంఖ్యలో బీరువాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అర్పేశారు. ఈ ప్రమాదంలో రూ.30 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు అంచనా వేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement