గద్వాలటౌన్: అడిగేవారు ఎవరున్నారని అనుకున్నారో.. లేక తొందరేముందని భావించా రో తెలియదు కానీ గద్వాల మునిసిపాలిటీలో పేరుకుపోయిన మొండి బకాయిల అద్దెలు అ సలు వసూలు కావడం లేదు. నోటీసులు జారీ చేస్తున్నా.. దుకాణాదారులు పెడచెవిన పెడుతున్నారు. ఈ ప్రభావం అభివృద్ధి కార్యకలాపాలపై పడుతుంది. ఇలా ఇప్పటివరకు అద్దెబకాయిలు రూ.20లక్షల వరకు పేరుకుపోయాయి. పట్టణంలో కొందరు బడా వ్యాపారు లు, రాజకీయ నాయకుల సహకారంతో సకాలంలో దుకాణాల అద్దెలు చెల్లించడం లేదు. దీనికి అధికారుల నిర్లక్ష్యం కూడా తోడైంది.
గద్వాల మునిసిపల్ పరిధిలో 236 దుకాణాలు ఉన్నాయి. ‘ఏ’ నుంచి ‘హెచ్’ బ్లాక్ వరకూ, స్పోర్ట్స్ అకాడమి, నల్లకుంట కాలనీ, కూరగాయల మార్కెట్ దగ్గర, కళాశాల మార్గంలో ఉ న్న ప్రధాన రహదారుల పక్కన వీటిని నిర్మిం చారు. కొన్ని దుకాణా సముదాయాలకు 25 ఏళ్ల లీజు అగ్రిమెంట్ పూర్తయింది. మరికొన్ని దుకాణా సముదాయాలకు 20ఏళ్ల క్రితమే వే లం నిర్వహించి అద్దెలకు ఇచ్చారు. అప్పుడు కేటాయించిన దుకాణాలను ప్రతి మూడేళ్లకు రెన్యూవల్ చేస్తున్నారు. కానీ అద్దెలను మాత్రం ప్రతి మూడేళ్లకు పెంచకుండా తక్కువ మొత్తంలోనే చెల్లిస్తూ మునిసిపాలిటీ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యం!
పాత బస్టాండ్ చౌరస్తా, మునిసిపల్ కార్యాల యం పక్కన నిర్మించిన నూతన సముదాయంలో 53 దుకాణాలు ఉన్నాయి. రెండేళ్ల క్రి తం గుడ్‌విల్ వేలం పాట ద్వారా అద్దెకు ఇచ్చా రు. రిజర్వేషన్ దుకాణాలు తప్పిస్తే...అప్పట్లో ఉన్న అద్దె కనిష్టంగా రూ.7వేలు, గరిష్టంగా రూ.27వేలుగా దుకాణదారులు వేలం పాడా రు. వేలం పాట తరువాత ఒకరిద్దరు తప్పిస్తే దాదాపు 45 మంది దుకాణదారులు అద్దెలు చెల్లించడం లేదు. ఏ, ఈ, ఎఫ్, జీ, హెచ్, బ్లాక్‌లలోని దుకాణాల అద్దెలు మొదట నిర్ణయించిన విధంగానే ఉండడం వల్ల వాటిని మదింపు చేశారు.
మార్కెట్ విలువ ఆధారంగా ఖరారుచేశారు. దీంతో గరిష్టంగా దుకాణం అద్దె రూ.10వేలుగా నమోదైంది. గత కొన్ని నెలలుగా అద్దె వసూళ్లకు వెళ్లిన మునిసిపల్ సిబ్బంది పట్ల దుకాణదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా పెద్ద మొత్తంలో అద్దె బకాయిలు పేరుకుపోయాయి. ‘సి’ బ్లాక్‌లోని 46 దుకాణాల లీజు అగ్రిమెంట్ పూర్తయిందని.. వెంటనే దుకాణాలను ఖాళీ చేయాలని అధికారులు కొన్ని నెలల క్రితం నోటీసులు జారీచేశారు. వ్యాపారులు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు.
బకాయిల వసూలుకు స్పెషల్‌డ్రైవ్
మునిసిపల్ పరిధిలోని ఐడీఎస్‌ఎంటీ దుకాణాల అద్దె బకాయిల వసూళ్లకు స్పెషల్‌డ్రైవ్ నిర్వహిస్తున్నామని కమిషనర్ ఇసాక్‌అబ్‌ఖాన్ తెలిపారు. గత నాలుగు రోజులుగా స్పెషల్‌డ్రైవ్ చేపట్టామన్నారు. సిబ్బందికి లక్ష్యాలను నిర్ధేశించి బకాయిలు వసూలు చేస్తున్నామన్నారు. స్పెషల్ డ్రైవ్‌కు వ్యాపారుల నుంచి మంచి స్పందన లభిస్తుందన్నారు. మొండి బకాయిదారులకు నోటీసులు జారీచేశామని, అద్దెలు చెల్లించకుంటే దుకాణాలకు తిరిగి వేలం నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
చెల్లిద్దాం.. తొందరేముంది!
Published Sun, Sep 21 2014 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 PM
Advertisement
Advertisement