చిన్న తరహా పరిశ్రమలను ఆదుకోవాలి
- పార్లమెంట్ సమావేశాల్లో ఖమ్మం ఎంపీ పొంగులేటి
ఖమ్మం: పర్యావరణం అనుమతుల పేరుతో గ్రానైట్ పరిశ్రమలపై ఆంక్షలు విధించడంతో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఐదు హెక్టార్ల లోపు విస్తీర్ణం ఉన్న గ్రానైట్ పరిశ్రమలను పర్యావరణ అనుమతుల నుండి మినహాయింపు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
పార్లమెంట్‌లో ఎంపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 80 శాతం పరిశ్రమలు తక్కువ విస్తీర్ణంలోనే ఉన్నాయన్నారు. ఈ పరిశ్రమల ఆధారంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది కార్మికులు ఆధారపడి బతుకుతున్నారని చెప్పారు. ప్రభుత్వ ఆంక్షలతో చిన్నతరహా పరిశ్రమలు సక్రమంగా నడవడం లేదన్నారు. మేజర్ ఖనిజాలు, మైనింగ్ ప్రాజెక్టుల లీజు ప్రాంతం 5 హెక్టార్లలోపు ఉంటే సుప్రీంకోర్టు పరిధిలో సడలించే అవకాశం ఉందన్నా రు. అందువల్ల నిబంధనలు సడలించి గ్రానైట్ పరిశ్రమలను ఆదుకోవాలని కోరారు.