గురుకుల అభ్యర్థులకు కేసీఆర్‌ తీపికబురు | good news to gururkula aspirants from kcr | Sakshi
Sakshi News home page

గురుకుల అభ్యర్థులకు కేసీఆర్‌ తీపికబురు

Published Thu, Feb 9 2017 3:08 PM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM

గురుకుల అభ్యర్థులకు కేసీఆర్‌ తీపికబురు - Sakshi

గురుకుల అభ్యర్థులకు కేసీఆర్‌ తీపికబురు

హైదరాబాద్‌: తెలంగాణ నిరుద్యోగ విద్యార్థులకు శుభవార్త. గురుకుల నోటిఫికేషన్‌లో నిబంధనలు సడలించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుంది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ విషయంపై ప్రకటన చేశారు. 60శాతం డిగ్రీలో మార్కులు ఉండాలన్న నిబంధన తొలగించాలని కేసీఆర్‌ టీఎస్‌పీఎస్‌సీని ఆదేశించారు. 

50శాతం మార్కులు ఉన్నవారిని పరీక్ష రాసేందుకు అనుమతించాలని కోరారు. అలాగే, పీజీటీకి ఉన్న మూడేళ్ల బోధనానుభవం నిబంధనను తొలగించాలని కూడా ఆదేశించారు. దీంతో ఇక డిగ్రీ, బీఈడీ, టెట్‌, పీజీ పరీక్షల్లో 50శాతం ఉత్తీర్ణత సాధించిన వారంతా గురుకుల పీజీటీ, టీజీటీ పరీక్షలు రాసుకునే వీలు ఏర్పడింది.

అంతకుముందు చక్రపాణి ఏం చెప్పారంటే..

‘ఉద్యోగాలిచ్చేవాళ్లే(ప్రభుత్వం) నిబంధనలు పెడతారు.. అర్హతలను మేం(టీఎస్‌పీఎస్‌సీ) నిర్ణయించలేదు. ప్రమాణాల పెంపుకోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందేమో. రాజ్యాంగ బద్ధంగానే పనిచేస్తున్నాం. 30 ఏళ్లుగా గురుకులాల్లో ఒకే నిబంధనలు కొనసాగుతున్నాయి’ అని చెప్పారు. అలా చెప్పిన గంట వ్యవధిలోనే ముఖ్యమంత్రి ప్రకటన చేశారు.

సంబంధిత వార్తా కథనాలకై చదవండి..

(ఎన్‌సీటీఈ నిబంధనలు బేఖాతరు!)

(డిగ్రీ, పీజీల్లో 60% ఉంటేనే అర్హులు)

(గురుకులాల్లో 7,306 పోస్టులు)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement