గ్రేటర్ వరంగల్ | Greater Warangal | Sakshi
Sakshi News home page

గ్రేటర్ వరంగల్

Published Thu, Jan 29 2015 12:53 AM | Last Updated on Sat, Sep 2 2017 8:25 PM

గ్రేటర్ వరంగల్

గ్రేటర్ వరంగల్

చారిత్రక సిటీకి అరుదైన గుర్తింపు
 
వరంగల్ నగరానికి గ్రేటర్ హోదా
రాష్ట్రంలో రెండో మహా నగరం మనదే..
మెరుగుపడనున్న పౌర సేవలు
రూపు మారనున్న నగరం

 
టైక్స్‌టైల్ పార్కు, కమిషనరేట్, వ్యాగన్ పరిశ్రమ, ఇండస్ట్రియల్ కారిడార్, ఐటీ ఇంక్యుబేషన్ వచ్చారుు. ప్రస్తుతం నగరానికి గ్రేటర్ హోదా దక్కింది.ఆధునిక పద్ధతిలో తాగునీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రెరుునేజీ, వీధి దీపాలు, రవాణా వ్యవస్థ, ఆర్థిక స్థితిగతులు, కంప్యూటరీకరణ, మౌలిక వసతులు ఇలా అనేక రకాలుగా అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. {Vేటర్‌లో భాగంగా 42 గ్రామాలు విలీనం కావడంతో ఐదుగురు  ఎమ్మెల్యేల ప్రాతినిథ్యం ఉండనుంది. వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు రాజకీయంగా ప్రాధాన్యం ఉంటుంది.
 
హన్మకొండ : ఏకశిలా నగరానికి అరుదైన గుర్తింపు లభించింది. 800 ఏళ్ల చరిత్ర ఉన్న వరంగల్ సిగలో గ్రేటర్ నగ చేరింది. వరంగల్ నగర పాలక సంస్థను గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్‌గా రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. వరంగల్ నగరం హోదాను పెంచుతూ  ప్రభుత్వం ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో  హైదరాబాద్‌కు మాత్రమే ప్రస్తుతం గ్రేటర్ హోదా ఉంది. రాజధాని తర్వాత పెద్ద నగరంగా ఉన్న వరంగల్‌కు తాజాగా గ్రేటర్ హోదా వచ్చింది. రెండు రో జుల క్రితమే వరంగల్ అర్బన్ పోలీస్ ప్రాంతాన్ని క మిషరేట్‌గా మార్చిన రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవల ప రంగా కీలకమైన కార్పొరేషన్ విషయంలో ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. వరంగల్‌కు గ్రేటర్ హోదాతో న గరపాలక సంస్థ పరంగా సేవలు పెరగనున్నాయి. గ్రేటర్ వరంగల్‌కు పరిపాలన అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారే ఉంటారు. పరిపాలన సౌలభ్యం కో సం ఇప్పుడునున్న రెండు సర్కిల్ కార్యాలయాలకు తోడు మరో మూడు లేదా నాలుగు ఏర్పాటు చేస్తారు. సేవలతోపాటు పన్నుల వసూలు ప్రక్రియ కొంతపుంతలు తొక్కనుంది.

ఫలించిన నిరీక్షణ

వరంగల్ నగరపాలక సంస్థను గ్రేటర్ వరంగల్‌గా మార్చాలనే డిమాండ్ ఐదేళ్లుగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగిన కాలంలో హైదరాబాద్, విశాఖపట్నం తర్వాత వరంగల్ నగరానికి గ్రేటర్ హోదాను కల్పించేందుకు అప్పటి ప్రభుత్వాలు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. 2012 డిసెంబరులో జరిగిన కాకతీయ ఉత్సవాల ప్రారంభోత్సవాల్లో.. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గ్రేటర్ వరంగల్ ఏర్పాటుపై హామీ ఇచ్చారు. ఆ తర్వాత వరంగల్ నగర శివారులోని 42 గ్రామాలను వరంగల్ నగరపాలక సంస్థలో విలీనం చేస్తూ ఉత్తర్వులు రెండేళ్ల కిందటే వచ్చాయి. గ్రేటర్ వరంగల్‌పై ఉత్తర్వులు మాత్రం రాలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వరంగల్ నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. 2015 జనవరిలో నాలుగు రోజులపాటు నగరంలో బస చేశారు. నగరాభివృద్ధికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్‌పై ఉత్తర్వుల జారీలో జరుగుతున్న ఆలస్యం సీఎం దృష్టికి వచ్చింది. నగర పర్యటన ముగించికుని వెళ్లిన 20 రోజుల వ్యవధిలోనే వరంగల్ నగరాన్ని గ్రేటర్ వరంగల్‌గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఐదుగురు ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం

గ్రేటర్ వరంగల్ పరిధిలో 9 లక్షలకు పైగా జనాభా ఉంది. కార్పొరేషన్  డివిజన్ల విభజన త్వరలోనే కొలి క్కి రానుంది. గ్రేటర్‌లో భాగంగా నగరంలో 42 గ్రా మాలను కలపడం వల్ల నగరపాలక సంస్థలో ఐదుగు రు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం ఉండనుంది. వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకర్గాలు పూర్తిగా కార్పొరేషన్ పరిధిలో ఉంటాయి. వర్ధన్నపేట నియోజకర్గ పరిధిలో హన్మకొండ, హసన్‌పర్తి, వర్ధన్నపేట మండలాల్లోని 30 గ్రామాలు.. పరకాల నియోజకర్గం పరిధిలో గీసుకొండ, సంగెం మండలాల్లో 10 గ్రామాలు, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకర్గం పరిధిలో ధర్మసాగర్ మండలం పరిధిలో రెండు గ్రామాలు గ్రేటర్ పరిధిలో ఉన్నాయి. కార్పొరేషన్ పాలన వ్యవహారాల్లో పార్లమెంటు కార్యదర్శి వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యేలు కొండా సురేఖ, రమేశ్, ధర్మారెడ్డి, రాజయ్యలు ప్రత్యక్షంగా పాలుపంచుకోనున్నారు.
 
శరవేగంగా అభివృద్ధి

చరిత్రాత్మక నగరంగా ఉన్న వరంగల్ ఆశించిన మేరకు అభివృద్ధి చెందలేదు. అజాంజాహి మిల్లు వంటి ప్రతిష్టాత్మక పరిశ్రమలు మూతపడ్డాయి. రైల్‌కోచ్ ఫ్యాక్టరీ వంటి కీలక ప్రాజెక్టులు ఇతర ప్రాంతాలకు తరలిపోయాయి. తెలంగాణ ఏర్పాటుతో వరంగల్ నగరం అభివృద్ధి పథంలో పడింది. టైక్స్‌టైల్ పార్కు, కమిషనరేట్ ఏర్పాటు, వ్యాగన్ పరిశ్రమ, ఇండిస్ట్రియల్ కారిడార్, ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ వంటి కీలక ప్రాజెక్టులకు సంబంధించిన ప్రకటనలు వరుసగా వెలువడుతున్నాయి. అదేక్రమంలో నగరానికి గ్రేటర్ హోదా దక్కింది. తెలంగాణ రాష్ట్రానికి వరంగల్ నగరాన్ని రెండో రాజధానిగా గుర్తించినట్టయ్యింది. హైదరాబాద్ నగరం ఇష్టారీతిగా అభివృద్ధి చెందడంతో అక్కడ  కీలక ప్రాజెక్టులు చేపట్టం సంక్లిష్టంగా మారింది. దానితో రాష్ట్రంలో రెండో ఆర్థిక, పారిశ్రామిక కేంద్రంగా వరంగల్‌ను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలకు తగినరీతిలో ఆధునిక పద్ధతిలో తాగునీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రెరుునేజీ, వీధి దీపాలు, రవాణా వ్యవస్థ, ఆర్థిక స్థితిగతులు, కంప్యూటరీకరణ, మౌలిక వసతుల కల్పన ఇలా అనేక రకాలుగా అభివృద్ధికి ఆస్కారం ఏర్పడింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement