industrial corridor
-
నాచారం ఇండస్ట్రియల్ కారిడార్‌లో భారి బ్లాస్ట్
-
విశాఖ -చెన్నై కారిడార్ పై అవాస్తవాలతో ఈనాడు కథనం
-
క్రిస్‌సిటీ నిర్మాణానికి దిగ్గజ సంస్థల పోటీ
సాక్షి, అమరావతి: చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో కృష్ణపట్నం వద్ద అభివృద్ధి చేయనున్న పారిశ్రామిక నగరం ‘క్రిస్’సిటీ నిర్మాణానికి దిగ్గజ సంస్థలు పోటీపడుతున్నాయి. తొలిదశలో రూ.1,503.16 కోట్లతో 2,500 ఎకరాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులివ్వడంతో ఈపీసీ విధానంలో రూ.1,021.41 కోట్ల విలువైన పనులకు టెండర్లు ఆహ్వానించింది. తుది బిడ్డింగ్‌లో మూడు కీలక సంస్థలు అర్హత సాధించినట్లు ఏపీఐఐసీ వీసీఎండీ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఈ టెండర్ల మదింపు జరుగుతోందని, అర్హత సాధించిన తర్వాత వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించే విధంగా ప్రణాళికలు సిద్ధంచేసినట్లు ఆయన తెలిపారు. చెన్నై–బెంగళూరు కారిడార్‌లో భాగంగా కృష్ణపట్నం వద్ద 10,834.5 ఎకరాల్లో పారిశ్రామిక పార్కును రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (నిక్‌డిక్ట్)తో కలిసి ఏపీఐఐసీ నిక్‌డిక్ట్–కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ డెవలప్మెంట్ లిమిటెడ్ (క్రిస్‌సిటీ) పేరుతో ప్రత్యేక కంపెనీని ఏర్పాటుచేసింది. పూర్తిస్థాయిలో తొలిదశ అందుబాటులోకొస్తే 78,900 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. -
సీఎం జగన్ ప్రోత్సాహంతోనే రాష్ట్రంలో పరిశ్రమలు
గోపవరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రోత్సాహంతోనే రాష్ట్రంలో సెంచురీ ఫ్లై పరిశ్రమను నిర్మిస్తున్నట్టు ఆ సంస్థ చైర్మన్ సజ్జన్ భజాంకా తెలిపారు. వైఎస్సార్ జిల్లా గోపవరం వద్ద నిర్మిస్తున్న పరిశ్రమ పనులను గురువారం ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధతో కలిసి ఆయన పరిశీలించారు. పరిశ్రమ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా భజాంకా మాట్లాడుతూ తొలుత తమిళనాడులో యూనిట్ నెలకొల్పాలని భావించామని, అయితే వెనుకబడిన ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటు చేయడం వలన ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని సీఎం జగన్ తమకు చెప్పారని, దీంతో తాము ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు చకచక రావడంతో పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని, డిసెంబర్ నాటికి మొదటి దశ పనులు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. 2024 డిసెంబర్ నాటికి పూర్తిస్థాయిలో పనులు పూర్తి చేసి వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే.. ముందుగా రూ.600 కోట్లతో యూనిట్‌ను ఏర్పాటు చేయాలని భావించామని, ఇప్పుడు రూ.1,600 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు భజాంకా తెలిపారు. ఈ పరిశ్రమ ఏర్పాటు కావడం వలన రెండు వేల మందికి ప్రత్యక్షంగాను, నాలుగు వేల మందికి పరోక్షంగానూ ఉపాధి లభిస్తుంని, 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వనున్నట్లు భజాంకా వెల్లడించారు. నిరుద్యోగులకు ఎలాంటి అనుభవం లేకున్నా వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని వివరించారు. కార్యక్రమంలో సెంచురీ ప్యానల్ జీఎం రమేష్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. -
‘క్రిస్ సిటీ’ పారిశ్రామిక నగర నిర్మాణంలో కీలక అడుగు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఫ్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న క్రిస్ సిటీ పారిశ్రామిక నగర నిర్మాణంలో కీలక అడుగు పడింది. కేంద్ర పర్యావరణ శాఖ పూర్తిస్థాయి అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా, వ్యర్థాలను శుద్ధి చేయాలని, భూగర్భ జలాలను, సహజ సిద్ధంగా ఉన్న కాలువలు, చెరువులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా నిర్మాణం చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తొలి దశ ప్రాజెక్టుకు జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదం కూడా లభించింది. చదవండి: AP: పీఆర్సీ ఐదేళ్లకే.. జీవో జారీ.. చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లోభాగంగా కృష్ణపట్నం వద్ద మొత్తం 11,095.9 ఎకరాల్లో రూ.5,783.84 కోట్లతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. నిక్‌డిట్ నిధులతో అభివృద్ధి చేస్తున్న క్రిస్ సిటీ కోసం ఏపీఐఐసీ నిక్‌డిట్ కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ డెవలప్మెంట్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది. టెక్స్టైల్, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంజనీరింగ్, ఎంఎస్ఎంఈ రంగాల పరిశ్రమలను ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకొస్తే 2,96,140 మందికి ప్రత్యక్షంగా, 1,71,600 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా. తొలిదశలో 2,006.09 ఎకరాలు అభివృద్ధి చేస్తారు. తొలి దశకు రూ.1,500 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. తొలి దశ నిర్మాణానికి జ్యుడిషియల్ ప్రివ్యూ నుంచి కూడా ఆమోదం లభించిందని, త్వరలోనే టెండర్లు పిలుస్తామని ఏపీఐఐసీ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. సుమారు రూ.1,054.63 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలుస్తారు. క్రిస్ సిటీ నిర్మాణ సమయంలో రోజుకు 500 కిలో లీటర్లు, ప్రాజెక్టు పూర్తయ్యాక పరిశ్రమలకు రోజుకు 99.7 మిలియన్ లీటర్ల నీరు అవసరమవుతుందని అంచనా వేశారు. ఈ నీటిని 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న కండలేరు రిజర్వాయర్ నుంచి సరఫరా చేయనున్నారు. -
‘క్రిస్ సిటీ’ తొలి దశకు టెండర్లు
సాక్షి, అమరావతి: చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా కృష్ణపట్నం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ (క్రిస్ సిటీ) తొలి దశ పనులకు ఏపీఐఐసీ టెండర్లు పిలిచింది. పరిశ్రమల ఏర్పాటుతో పాటు నివాసయోగ్యంగా ఉండేలా నిర్మిస్తున్న క్రిస్ సిటీలో రహదారులు, విద్యుత్, నీటి సదుపాయాలు, మురుగు, వరద నీరు పారుదల, మురుగునీటి శుద్ధి వంటి మౌలిక వసతుల కల్పనకు రూ.1,190 కోట్ల విలువైన పనులకు ఏపీఐఐసీ బిడ్లను ఆహ్వానించింది. ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ 36 నెలల్లో పనులను పూర్తి చేయాలన్న నిబంధన విధించింది. అలాగే పనులు పూర్తయిన తర్వాత నాలుగేళ్ల పాటు క్రిస్ సిటీ నిర్వహణ బాధ్యతలను కూడా చూడాల్సి ఉంటుంది. ఆసక్తి గల సంస్థలు నవంబర్ 4 మధ్యాహ్నం 3 గంటల్లోగా బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. సీబీఐసీ కారిడార్‌లో భాగంగా మొత్తం 12,944 ఎకరాల్లో కృష్ణపట్నం నోడ్‌ను అభివృద్ధి చేయనుండగా తొలిదశ కింద 2,134 ఎకరాలను అభివృద్ధి చేయడానికి నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (నిక్ డిట్) ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.2,139.44 కోట్లను నిక్‌డిట్ కేటాయించింది. ఈ క్రిస్ సిటీ నిర్మాణం ద్వారా రూ.37,500 కోట్ల పెట్టుబడులు, లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుందని అంచనా. -
క్రిస్ సిటీ టెండర్లకు రంగం సిద్ధం
సాక్షి, అమరావతి: చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా కృష్ణపట్నం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ(క్రిస్ సిటీ) మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. మొత్తం 12,944 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్న కృష్ణపట్నం నోడ్‌లో తొలిదశలో 2,134 ఎకరాలకు సంబంధించి ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్‌కు ఆమోదం తెలపడంతో సుమారు రూ.1,200 కోట్లతో ఈపీసీ టెండర్లను ఏపీఐఐసీ పిలవనుంది. ఈ టెండర్లను న్యాయ పరిశీలన కోసం జ్యుడీషియల్ ప్రివ్యూకి పంపుతున్నట్లు ఏపీఐఐసీ వీసీ, ఎండీ రవీన్‌కుమార్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. వచ్చే నెలలోగా టెండర్ ప్రక్రియను పూర్తి చేసి జూన్‌లో పనులు మొదలు పెట్టేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు. రెండేళ్లలో అందుబాటులోకి... క్రిస్ సిటీ పనులు జూన్‌లో మొదలు పెట్టి రెండేళ్లలో అందుబాటులోకి తేవాలని ఏపీఐఐసీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. మొత్తం 12,944 ఎకరాలను అభివృద్ధి చేయడం ద్వారా రూ.37,500 కోట్ల పెట్టుబడులు, 5.15 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ప్రాజెక్టు రిపోర్టు రూపొందించిన జాకబ్ సంస్థ అంచనా వేసింది. 99,400 మంది నివాసం ఉండేలా ఈ పారిశ్రామిక నగరాన్ని నిర్మిస్తున్నారు. మూడు క్లస్టర్లుగా అభివృద్ధి చేస్తున్న క్రిస్‌సిటీలో ప్రధానంగా ఆహార ఉత్పత్తులు, టెక్స్టైల్, ఇంజనీరింగ్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఆప్టికల్ ఫైబర్ తయారీ సంస్థలు పెట్టుబడులు పెట్టేలా అభివృద్ధి చేస్తున్నారు. పోర్టుల ఆధారంగా అభివృద్ధి చెందిన చెన్నై, కోల్‌కతా లాంటి నగరాల మాదిరిగా పరిశ్రమలతోపాటు నివాసయోగ్యంగా ఉండేలా ఫ్యూచర్ వర్క్‌లైఫ్ అనే ట్యాగ్‌లైన్‌తో క్రిస్ సిటీ బ్రాండింగ్ చేస్తున్నట్లు రవీన్‌కుమార్ తెలిపారు. అభివృద్ధి చేస్తున్న మొత్తం ప్రాంతంలో 46 శాతం మాత్రమే పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తారు. 13.9 శాతం ఉద్యోగులు అక్కడే నివసించేలా గృహ సముదాయాల నిర్మాణానికి వినియోగిస్తారు. లాజిస్టిక్ అవసరాలకు 5.6 శాతం కేటాయిస్తారు. 10.9 శాతం పర్యావరణ పరిరక్షణ కోసం ఖాళీగా ఉంచుతారు. క్రిస్ సిటీ తొలిదశ ద్వారా సుమారు రూ.18,548 కోట్ల విలువైన పెట్టుబడులతో పాటు 98,000 మందికి ఉపాధి లభిస్తుందని ఏపీఐఐసీ అంచనా వేసింది. ఎస్పీవీకి భూమి బదలాయింపు.. కృష్ణపట్నం నోడ్ తొలిదశ పనులకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపి రూ.2,139.44 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఏర్పాటైన ఎస్పీవీకి భూమి బదలాయింపులో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల నుంచి మినహాయింపు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో పనులు ప్రారంభించేందుకు ఆటంకాలన్నీ తొలగిపోయినట్లు ఏపీఐఐసీ అధికారులు పేర్కొన్నారు. -
3 కారిడార్లు దక్కించుకున్న రాష్ట్రంగా ఏపీ రికార్డు
సాక్షి, అమరావతి: పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. మౌలిక వసతులు కల్పించడం ద్వారా పరిశ్రమలను ఆకర్షించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు భారీ పారిశ్రామిక పార్కుల నిర్మాణంపై దృష్టి సారించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రం నుంచి ఇప్పటికే విశాఖ-చెన్నై కారిడార్, చెన్నై-బెంగళూరు కారిడార్లు వెళ్తుండగా తాజాగా హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌కు కేంద్రం పచ్చజెండా ఊపింది. దీంతో మూడు పారిశ్రామిక కారిడార్లు దక్కించుకున్న రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించింది. ఈ కారిడార్లలో మొత్తం 8 క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (నిక్‌డిట్) నుంచి భారీగా నిధులను తీసుకురావడంలో ప్రభుత్వం సఫలీకృతమైంది. చదవండి: భీమిలి భోగాపురం మధ్య.. పారిశ్రామిక కారిడార్ ఏడీబీ నిధులు రూ.4,598 కోట్లతో విశాఖ-చెన్నై కారిడార్: విశాఖ-చెన్నై కారిడార్‌ను ఏడీబీ(ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్) రుణ సహకారంతో అభివృద్ధి చేస్తున్నారు. తొలిదశలో విశాఖలో అచ్యుతాపురం-రాంబిల్లి, నక్కపల్లి క్లస్టర్లు, చిత్తూరు జిల్లాలో ఏర్పేడు-శ్రీకాళహస్తి క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ క్లస్టర్లలో మౌలిక వసతులకు సంబంధించి రూ.4,598 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి. భూ సేకరణ పనుల కోసం రూ.165 కోట్ల అదనపు నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ కారిడార్‌లో భాగంగానే మెడ్‌టెక్ జోన్ రెండో దశ పనులను రూ.110కోట్లతో చేపడుతున్నారు. చదవండి: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం: పోస్కో నిక్‌డిట్ నిధులతో అభివృద్ధి చేస్తున్న క్లస్టర్లు: కొప్పర్తి: తొలిదశలో 4 వేల ఎకరాల్లో అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నీటిని సోమశిల ప్రాజెక్టు నుంచి తీసుకురావడానికి ప్రభుత్వం డీపీఆర్ తయారు చేస్తోంది. కృష్ణపట్నం: 2,500 ఎకరాల్లో సుమారు రూ.1,500 కోట్ల నిధులతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. శ్రీకాళహస్తి: ఈ క్లస్టర్‌ను నిక్‌డిట్ నిధులతో 8వేల ఎకరాల్లో, ఏడీబీ నిధులతో 2,500 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నారు. నక్కపల్లి: విశాఖ-చెన్నై కారిడార్‌లో భాగంగా ఈ కస్టర్‌ను ఏడీబీ నిధులతో వేయి ఎకరాలు, నిక్‌డిట్ నిధులతో 3 వేల ఎకరాలను అభివృద్ధి చేస్తున్నారు. వీటి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్లస్టర్లతో పాటు 7వేల ఎకరాల్లో ప్రకాశం జిల్లా దొనకొండ నిమ్జ్ (నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్)ను అభివృద్ధి చేయనున్నారు. ఓర్వకల్లు: హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌లో భాగంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లులో క్లస్టర్‌ను తాజాగా అభివృద్ధి చేయనున్నారు. దీన్ని కూడా నిక్‌డిట్ నిధులతో చేపట్టడానికి కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. సుమారు 7వేల ఎకరాల్లో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ సిద్ధం చేస్తోంది. మౌలిక వసతులపైనే దృష్టి సీఐఐ, ఐఎస్బీ, అసోచామ్ వంటి పెద్ద సంస్థల నుంచి వచ్చిన సూచనల మేరకే మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తున్నాం. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, ఆటోమొబైల్ వంటి కీలక రంగాల వారీగా క్లస్టర్లను అభిృవృద్ధి చేయడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ పారిశ్రామిక పార్కుల పనులను శరవేగంగా పూర్తి చేయడంపై దృష్టి సారించాం. - మేకపాటి గౌతమ్ రెడ్డి, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి -
భీమిలి భోగాపురం మధ్య.. పారిశ్రామిక కారిడార్
సాక్షి, అమరావతి: భీమిలి నుంచి విజయనగరం జిల్లా భోగాపురం వరకు సుమారు 20 కి.మీ పారిశ్రామిక కారిడార్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. దీనికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను తయారు చేసే సంస్థ ఎంపిక కూడా పూర్తయింది. డీపీఆర్ కాంట్రాక్టును నాగపూర్‌కు చెందిన కేఅండ్‌జే ప్రాజెక్ట్స్ దక్కించుకుంది. ఈ డీపీఆర్ తయారీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఇన్‌క్యాప్) రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) బిడ్లను ఆహ్వానించగా మొత్తం నాలుగు సంస్థలు పోటీపడ్డాయి. ఇందులో అతి తక్కువ ధర కోట్ చేసి ఎల్1గా నిలిచిన కేఅండ్‌జే ప్రాజెక్ట్స్ సంస్థను ఎంపిక చేసినట్లు ఇన్‌క్యాప్ వైస్ చైర్మన్, ఎండీ ఆర్.పవనమూర్తి తెలిపారు. సాంకేతిక అంశాల పరిశీలన అనంతరం పోటీపడ్డ నాలుగు సంస్థల్లో మూడు సంస్థలు.. ఎల్అండ్టీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్, కేఅండ్‌జే ప్రాజెక్ట్స్, ట్రాన్స్‌లింక్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ తుది బిడ్‌కు ఎంపికయ్యాయి. వీటిలో రూ. 41 లక్షల కోట్ చేసిన కేఅండ్‌జే సంస్థ ఎల్1గా నిలిచింది. డీపీఆర్ తయారీలో ప్రధాన అంశాలు.. ► భీమిలి నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రధాన గేటు వరకు ఉన్న 20 కి.మీ రహదారి అభివృద్ధితో పాటు వ్యాపార అవకాశాలను పరిశీలించాలి. ► మొత్తం 8 లేన్ల రహదారిలో తొలుత ఆరు లేన్లు, రెండు వైపుల సర్వీసు రోడ్డు నిర్మాణానికి ఎంత వ్యయం అవుతుందో అంచనా వేయాలి. ► ప్రస్తుతం ప్రభుత్వ భూమి ఎంత ఉంది, ప్రైవేటు భూమి ఎంత సేకరించాల్సి ఉంటుందన్న అంశాన్ని పరిశీలించాలి. ► రహదారికి ఇరువైపుల తయారీ రంగానికి సంబంధించి పారిశ్రామిక పార్కులు, పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటు అంశాలను పరిశీలించాలి. ► టూరిజం, హెల్త్, విద్య వంటి సేవా రంగాల పెట్టుబడులు, లాజిస్టిక్ హబ్స్ వ్యాపార అవకాశాలపై నివేదిక రూపొందించాలి. ప్రస్తుత ట్రాఫిక్, ఎయిర్‌పోర్టు అభివృద్ధి అయిన తర్వాత ఎంతమేర ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉందన్న అంశాన్ని అంచనా వేయాలి. ► వాతావరణ పరిస్థితులు, వాటిని తట్టుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించాలి. ► ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఎంత మొత్తం అవసరమవుతుంది, దీనికి నిధులు ఎలా సేకరించాలి, లాభదాయకత వంటి అంశాలు పరిశీలించాలి. -
పరిశ్రమల ఖిల్లా.. రంగారెడ్డి జిల్లా
పరిశ్రమల స్థాపనకు మన జిల్లా కేరాఫ్ అడ్రస్‌గా మారింది. సూక్ష్మ నుంచి మెగా వరకు ఏ కేటగిరీని తీసుకున్నా పరిశ్రమల ఏర్పాటులో జిల్లా ప్రత్యేకతను చాటుతోంది. అదేవిధంగా బహుళజాతి కంపెనీలు విస్తృతంగా వెలుస్తుండటం శుభపరిణామం. హైదరాబాద్ మహానగరం శివారు చుట్టూ మన జిల్లా విస్తరించి ఉండటం, అనువైన రవాణా వ్యవస్థ కలిగి ఉండటంతో పెట్టుబడుల వరద పారుతోంది. ముఖ్యంగా ‘టీఎస్–ఐపాస్’ పేరిట 2014లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ.. పరిశ్రమలకు స్థాపనకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ పాలసీ అమల్లోకి వచ్చి ఐదేళ్లు గడవగా.. విజయవంతంగా అమలు చేసిన జాబితాలో మన జిల్లా అగ్రభాగాన ఉండటం విశేషం. పరిశ్రమల ఏర్పాటులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చడంతో జిల్లాకు అవార్డు వచ్చింది. బుధవారం నగరంలోని శిల్పకళావేదికలో నిర్వహించే టీఎస్–ఐపాస్ ఐదేళ్ల సంబరాల్లో భాగంగా మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ హరీష్, డీఐసీ జనరల్ మేనేజర్ జె.రాజేశ్వర్‌రెడ్డి అవార్డు అందుకోనున్నారు. ఈనేపథ్యంలో జిల్లాలో పరిశ్రమల స్థాపన.. పెట్టుబడులు.. ఉపాధి కల్పనపై ప్రత్యేక కథనం.. సాక్షి, రంగారెడ్డి: పరిశ్రమల స్థాపనలో మన జిల్లా వేగంగా దూసుకెళ్తోంది. 2014 డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అనుమతులు, స్వీయధ్రువీకరణ చట్టం (టీఎస్–ఐపాస్) అమల్లోకి తీసుకురావడంతో మహర్దశ పట్టింది. త్వరితగతిన అనుమతులు జారీ చేయడం, నెల రోజుల నిర్దిష్ట సమయంలో అనుమతులు మంజూరు, ఆన్లైన్లో విధానంలో దరఖాస్తు చేసుకునే సౌలభ్యం ఈ పాలసీతో కలిగింది. దీంతో పారిశ్రామికవేత్తలు.. ఎన్నో అనుకూల అంశాలు ఉన్న మన జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు అమితమైన ఆసక్తి చూపారు. టీఎస్–ఐపాస్ పాలసీ అమల్లోకి వచ్చాక ఆయా కేటగిరీల్లో మొత్తం రూ.46 వేల కోట్ల వ్యయంతో 935 పరిశ్రమలు నెలకొల్పేందుకు ఆన్లైన్ దరఖాస్తులు అందాయి. వీటిద్వారా 7.64 లక్షల మందికి ఉపాధి కల్పించాలన్నది లక్ష్యం. ఇందులో ఇప్పటివరకు 690 పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రారంభించాయి. రూ.13,385 కోట్ల పెట్టుబడులు జిల్లాకు వచ్చాయి. ఇప్పటివరకు 1.95 లక్షల మందికి ఉపాధి లభించడం విశేషం. పరోక్షంగా మరో 50 వేల మంది వరకు జీవనోపాధి అవకాశాలు లభించాయి. రూ.వేల కోట్ల పెట్టుబడులు జాతీయ, బహుళ జాతీయ కంపెనీలు కూడా మన జిల్లాలో ఏర్పాటయ్యాయి. మహానగరం చుట్టూ జిల్లా విస్తరించడం, రవాణామార్గాలు అనువుగా ఉండటం.. తదితర సానుకూలతలు పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తున్నాయి. ఒక్కో మెగా కంపెనీలు రూ.వేల కోట్లు పెట్టుబడులు పెడుతుండగా.. మరికొన్ని విస్తరణకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. టైల్స్ తయారీ చేసేందుకు వెల్స్పన్ ఫ్లోరింగ్ లిమిటెడ్ కంపెనీ రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు పెడుతోంది. దీనివల్ల 500 మందికి ఉపాధి లభించనుంది. అలాగే నందిగామలో ఎంఎస్ఎన్ ఫార్మా విస్తరణకు వెళ్తోంది. ఇందుకోసం రూ.300 కోట్లు ఖర్చు చేస్తుండగా.. సుమారు 1,200 మందికి ఉపాధి దొరకనుంది. ఇక ఆదిబట్లలో ఏరోసిటీలో టాటా ఏరో స్పేస్ ఆరు విభాగాల్లో తమ ఉత్పత్తులను మొదలు పెడుతోంది. ఇందుకోసం రూ.1,200 కోట్లు పెట్టుబడులు పెట్టింది. దీంతోపాటు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ తన సేవలను మొదలుపెట్టింది. వీటికంటే ముందు జిల్లాలో ఐటీ కారిడార్, హార్డవేర్ పార్క్‌లు, ఐడీఏ కాటేదాన్ , ఐడీఏ కొత్తూరు తదితర సెజ్‌లు, పార్క్‌లు కూడా విస్తరించడం తో పారిశ్రామికరంగంలో జిల్లా దూసుకెళ్తోంది. పరిశ్రమల స్థాపనకు అనుకూలతలు ఇవీ.. జిల్లా శివారు ప్రాంతాలన్నీ మహానగరం చుట్టూ ఉండటం నైపుణ్యం ఉన్న మానవ వనరులు పుష్కలంగా లభిస్తుండటం టీఎస్–ఐపాస్ ద్వారా సరళంగా, సులభతరంగా అనుమతులు లభించడం కమ్యూనికేషన్ వ్యవస్థ పటిష్టంగా ఉండటం రవాణా వ్యవస్థ బాగా విస్తరించడం ఇన్చార్జి కలెక్టర్ హర్షం టీఎస్–ఐపాస్ అవార్డు లభించడంపై ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ హరీష్ సంతోషం వ్యక్తం చేశారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయడంతోనే ఉత్తమ ప్రతిభ చూపేందుకు సాధ్యమైందని పేర్కొన్నారు. అవార్డు మరింత బాధ్యతలను పెంచిందని చెప్పారు. పరిశ్రమల స్థాపనకు జిల్లా అన్ని విధాల అనుకూలమని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జె.రాజేశ్వర్ రెడ్డి చెప్పారు. టీఎస్–ఐపాస్ ద్వారా జిల్లాలో ఇప్పటివరకు రూ.13 వేల కోట్లకుపైగా పెట్టుబడులు జిల్లాకు వచ్చాయని తెలిపారు. -
హైదరాబాద్ టు వరంగల్.. ఇండస్ట్రియల్ కారిడార్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రం మీదుగా వెళ్తున్న ముఖ్యమైన జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట అందుబాటులో ఉన్న వనరులు, అవకాశాలను జోడించి పారిశ్రామిక అభివృద్ధి సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2014 నూతన పారిశ్రామిక విధానంలో ఆరు ఇండస్ట్రియల్ కారిడార్ల అభివృద్ధిని పరిశ్రమల శాఖ ప్రతిపాదించింది. వీటిలో ఇండస్ట్రియల్ క్లస్టర్లు (పారిశ్రామిక వాడలు) ఏర్పాటు చేయడం ద్వారా పెట్టుబడులు ఆకర్షించి, జిల్లాల్లోనూ ఉపాధి అవకాశాలు పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రతిపాదనలో భాగంగా హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్–నాగ్‌పూర్, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–మంచిర్యాల, హైదరాబాద్–నల్లగొండ, హైదరాబాద్–ఖమ్మం ఇండస్ట్రియల్ కారిడార్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ పారిశ్రామిక కారిడార్ల ద్వారా ఆయా జిల్లాల్లో లభ్యమయ్యే సహజన వనరుల ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు. అయితే తొలి దశలో వరంగల్, నాగ్‌పూర్, బెంగళూరు కారిడార్ల అభివృద్ది చేయాలని, మరో మూడు కారిడార్లను రెండో దశలో అభివృద్ధి చేయాలని నూతన పారిశ్రామిక విధానం (టీఎస్ఐపాస్)లో పేర్కొన్నారు. అయితే హైదరాబాద్–వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్‌కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి శరవేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఓ వైపు కారిడార్ అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ రూపకల్పనపై కసరత్తు చేస్తోంది. వరంగల్ కారిడార్‌కు అధిక ప్రాధాన్యత ప్రస్తుతం 163వ నంబరు జాతీయ రహదారిని రూ.1,905 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు లేన్ల రహదారిగా విస్తరిస్తున్నారు. మరోవైపు ఎన్ఐటీతో సహా పలు సాంకేతిక, వృత్తి విద్యా సంస్థలకు వరంగల్ నగరం కేంద్రంగా ఉండటంతో ఐటీ రంగం అభివృద్ధికి అనువైన వాతావరణం ఉందని ఐటీ సంస్థలు భావిస్తున్నాయి. భవిష్యత్తులో ఇక్కడ రూ.11,586 కోట్లతో ఏర్పాటయ్యే మెగా టెక్స్టైల్ పార్కు ద్వారా 1.13 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు బెంగళూరుకు మైసూరు శాటిలైట్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను అభివృద్ధి చేసిన తరహాలో హైదరాబాద్–వరంగల్ కారిడార్‌ను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం హైదరాబాద్ ఫార్మాసిటీ (హెచ్పీసీ)కి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్టు (ఎన్ఐసీడీఐటీ) ద్వారా మౌలిక సదుపాయాల కోసం రూ.3,418 కోట్లు గ్రాంటుగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ మేరకు ఈ ఏడాది అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఐటీ క్లస్టర్ల మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేసిన తర్వాత కారిడార్ అభివృద్ధి పనులు మరింత వేగం పుంజుకుంటాయని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. ఈ కారిడార్ ద్వారా ఫార్మా, ఐటీ, రవాణా, వ్యవసాయాధారిత పరిశ్రమలకు ఊతం లభించనుంది. -
పర్యావరణాన్ని పరిరక్షిస్తూ.. పారిశ్రామిక కారిడార్
అవినీతి అక్రమాలకు తావు లేకుండా.. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ నూతన పారిశ్రామిక కారిడార్‌కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా భూసేకరణకు ప్రయత్నాలు ప్రారంభించింది. గత ప్రభుత్వ హయాంలో భూ సేకరణలో పెద్దఎత్తున అవినీతి అక్రమాలు చోటుచేసుకోవడంతో పాత విధానానికి స్వస్తిపలికి.. నూతన పారిశ్రామిక విధానానికి కసరత్తు ప్రారంభించింది. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు, రహదారి సౌకర్యం, రైల్వే మార్గం, నీటి సౌకర్యం, ఆకాశ మార్గంలో రాకపోకలకు అనుకూలంగా రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్ర యం, జిల్లాకు అతి సమీపంలో సముద్రతీర ప్రాంతం ఉండటంతో పారిశ్రామిక వేత్తలు పెద్ద ఎత్తున పెట్టుబడులతో రావడానికి ఆసక్తిచూపుతున్నారు. సాక్షి, తిరుపతి: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు, నీటి సరఫరాకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, బుచ్చినాయు డు కండ్రిగ మండలాల పరిధిలోని మొ త్తం 34 గ్రామాల్లో విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతంగా గుర్తించినట్లు తెలిసింది. అందుకు అవసరమైన భూముల సేకరణకు జిల్లా అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. కలెక్టర్ నారాయణ భరత్‌గుప్త ఆదేశాల మేరకు తిరుపతి ఆర్డీఓ కనకనరసారెడ్డి ఆధ్వర్యంలో 40 మందితో కూడిన బృందం క్షేత్రస్థాయిలో పర్యటిస్తోంది. ఈ బృందాన్ని ఉత్తర, దక్షిణ విభాగాలుగా విభజించారు. ఉత్తరంలో 11వేల ఎకరాలు, దక్షిణంలో 13వేల ఎకరాలను సేకరించనున్నారు. పర్యావరణానికి ముప్పు లేకుండా జాగ్రత్తలు పర్యావరణానికి ముప్పు వాటిల్ల్ల కుండా ఎక్కడా చెరువుల జోలికి వెళ్లకుండా జనావాసానికి ఎటువంటి ఆటం కాలూ లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. అదేవిధంగా రెండు పంటలు పండే భూములను కూడా తీసుకోవద్దని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు. రెండు పంటలు పండే భూములకు కండలేరు జలాశయం నుంచి 6 టీఎంసీల నీటిని సరఫరా చేసేం దుకు ప్రభుత్వ యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. భూములు ఇచ్చే రైతులకు పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం రూ.1,507 కోట్లు కేటాయించినట్లు ఆర్డీఓ కనకనరసారెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో పరిహారం పంపిణీలో జరిగిన అవకతవకల నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగం నేరుగా రైతులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించనుంది. భూములకు సంబంధించిన పత్రాలు పరిశీలించి, క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించిన తర్వాతే పరిహారం పంపిణీ చెయ్యనుంది. దీంతో పరిహారం పంపిణీలో అవకతవకలు జరిగే అవకాశాలు ఉం డవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు పూర్తయితే శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు దొరికే పరిస్థితులు ఉన్నాయి. సీఎం సాహసోపేత నిర్ణయం స్థానికులకు 75 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చట్టం చెయ్యడం సాహసోపేత నిర్ణయం. సీఎం తీసుకున్న నిర్ణయంతో నియోజకవర్గంలో అనేకమంది నిరుద్యోగ యువతకు ఎంతో మేలు చేకూరనుంది. ముఖ్యంగా వారి కుటుం బాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. – బియ్యపు మధుసూదన్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే -
తమిళనాట పారిశ్రామిక కారిడార్
తిరుచిరాపల్లి: రక్షణ సంబంధ పరికరాలు దేశీయంగానే ఉత్పత్తి చేసే దిశగా కేంద్రం అడుగులు వేసింది. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం తమిళనాడు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను ప్రారంభించారు. ఈ కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా రూ. 3,038 కోట్ల పైచిలుకు పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ముందుకొచ్చాయి. ఇందులో అత్యధిక భాగం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టనున్నాయి. ఇక ప్రైవేటు కంపెనీలైన టీవీఎస్, డేటా ప్యాట్రన్స్, అల్ఫా డిజైన్స్ తదితర సంస్థలు పెట్టనున్నాయి. ఇందులో తాము కూడా పెట్టుబడులు పెడతామంటూ అంతర్జాతీయ భారీ భద్రతా సంస్థల్లో ఒకటైన లాక్‌హీడ్ మార్టిన్ ప్రకటించింది. తమిళనాడు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను తమిళనాడు డిఫెన్స్ ప్రొడక్షన్ క్వాడ్ అని కూడా పిలవనున్నారు. ఈ కారిడార్ జాబితాలో తిరుచిరాపల్లితోపాటు రాజధాని నగరం చెన్నై, హోసూర్, సేలం, కోయంబతూర్ కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా రక్షణ మంత్రి సీతారామన్ మాట్లాడుతూ ‘డిఫెన్స్ కారిడార్‌కి స్థానిక పరిశ్రమల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. పాలక్కాడ్ వరకూ పొడిగించాలంటూ అనేకమంది కోరుతున్నారు. అయితే దీనిని ప్రస్తుతానికి ఈ ఐదు నగరాలకే పరిమితం చేస్తున్నాం’ అని అన్నారు. ఈ కారిడార్ వల్ల రక్షణ ఉత్పత్తులు పెరగడమే కాకుండా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. అంతేకాకుండా వివిధ రక్షణ కారిడార్ల మధ్య కనెక్టివిటీ బాగా పెరుగుతుందన్నారు. ఈ ఐదు నగరాల్లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డులు ఉన్నాయని, రక్షణ ఉత్పత్తుల విక్రేతలు ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు ఇతర అనుబంధ సంస్థలతో చేయి చేయి కలిపి ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి’అని అన్నారు. పారిశ్రామిక కారిడార్ ప్రారంభ కార్యక్రమానికి ఐదు వందలమందికిపైగా వివిధ సంస్థల ప్రతినిధులతోపాటు ఉన్నతాధికారులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. గతేడాదే ప్రకటన దేశంలో రెండు రణ ఉత్పత్తుల పారిశ్రామిక కారిడార్లను ప్రారంభిస్తామంటూ గతేడాది ఫిబ్రవరి, రెండో తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించడం తెలిసిందే. అందులోభాగంగా ఒకటి ఉత్తరప్రదేశ్‌లో, మరొకటి తమిళనాడులో మొదలయ్యాయి. తొలుత ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో గతేడాది ఆగస్టు, 11వ తేదీన ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రారంభించడం తెలిసిందే. -
ఘనంగా హరీశ్ జన్మదిన వేడుకలు
సాక్షి, హైదరాబాద్: మంత్రి హరీశ్‌రావు జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద ఎత్తున నేతలు, అభిమానులు పోటెత్తడంతో మంత్రుల నివాస సముదాయం జనసందోహంగా మారింది.ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్, చందూలాల్, ఎంపీలు, తదితరులు ఎమ్మెల్యేలు తీగల, గాంధీ, మంత్రిని కలసి శుభాకాంక్షలు తెలిపారు. హరీశ్ తన తల్లి లక్ష్మి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. కాగా, అత్యంత క్రియాశీలకంగా పనిచేసే మన మంత్రుల్లో హరీశ్ ఒకరంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేటలో ఇండస్ట్రియల్ కారిడార్ సిద్దిపేట జోన్: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతోనే సిద్దిపేటలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు అన్నారు. మలేసియాకు చెందిన ప్రముఖ సంస్థ డీఎక్స్ఎన్ సిద్దిపేటలో మొదటి పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఆదివారం సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో మంత్రి హరీశ్‌తో మలేసియా ప్రతినిధి డాక్టర్ లిమ్సీయోజిన్ భేటీ అయ్యారు. -
అవసరం కొండంత..ఇచ్చింది గోరంత
► జిల్లాపై బాబు శీతకన్ను ► బడ్జెట్లో వెలిగొండకు కేటాయించింది రూ.200 కోట్లే ► ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ.2,800 కోట్లు అవసరం ► కొరిశపాడు లిఫ్ట్‌కు ఇచ్చింది రూ.7.45 కోట్లు ► పాలేరు రిజర్వాయర్‌కు రూ.3.98 కోట్లు ► రాళ్లపాడుకు రూ.1.28 కోట్లు ► ఊసే లేని రామాయపట్నం పోర్టు, విమానాశ్రయం ఎన్నికల సమయంలో నోటికొచ్చిన హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కారు ఒక్కో హామీని గాలికొదిలేసింది. ఆది నుంచి జిల్లా అభివృద్ధిపై చిన్నచూపు చూస్తోంది. తాజా బడ్జెట్లోనూ మొండిచేయి చూపింది. పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలకు అరకొర కేటాయింపులతో సరిపెట్టగా..జిల్లా అభివృద్ధికి కీలకమైన పోర్టు, విమానాశ్రయం, పారిశ్రామికవాడల ఊసే ఎత్తలేదు. సంక్షేమ పథకాల అమలుకూ మొక్కుబడిగా నిధులిచ్చి చేతులు దులుపుకున్నారు. బడ్జెట్లో జిల్లాను చిన్నచూపు చూడటంపై జనం మండిపడుతున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లాకు 2017–18 బడ్జెట్లో బాబు సర్కారు మొండిచేయి చూపింది. జిల్లాకు ప్రాణాధారమైన వెలిగొండ ప్రాజెక్టుకు మొదటి ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామంటూనే సర్కారు వంచనకు పాల్పడింది. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో రూ.2,800 కోట్లు అవసరం కాగా, బుధవారం శాసనసభలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ.200 కోట్ల నిధులను మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుంది. ఈ లెక్కన ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి దశాబ్దాలు పట్టే పరిస్థితి నెలకొంది. రూ.1,56,980 కోట్ల బడ్జెట్ అంటూ ఘనంగా చెప్పుకున్న బాబు సర్కారు ప్రకాశం జిల్లాను చిన్నచూపు చూసింది. ఇరిగేషన్ ప్రాజెక్టులకు అరకొర నిధులు విదల్చగా ఇక జిల్లాకు ఇచ్చిన ప్రధాన హామీలు రామాయపట్నం పోర్టు, విమానాశ్రయం, మైనింగ్ యూనివర్సిటీ, కనిగిరి నిమ్జ్, దొనకొండ పారిశ్రామికవాడ మొదలుకొని ఏ ఒక్క హామీని బడ్జెట్లో ప్రస్తావించకపోవడం గమనార్హం. వెలిగొండకు చిల్లర విదిలింపు: తాజా అంచనాల ప్రకారం వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ.2,800 కోట్లు అవసరం. కనీసం ఫేజ్–1 పరిధిలోని టన్నెల్–1, హెడ్‌రెగ్యులేటర్ కాలువ పెండింగ్ పనులను పూర్తి చేసేందుకే వెయ్యి కోట్లు అవసరం. కానీ ప్రభుత్వం తాజా బడ్జెట్లో రూ.200 కోట్లు మాత్రమే కేటాయించింది. వెలిగొండ ప్రాజెక్టు మొదటి ప్రాధాన్యతా క్రమంలో పెట్టినట్లు ప్రభుత్వం ప్రకటించినా... బడ్జెట్ కేటాయింపులకు వచ్చేసరికి మొక్కుబడి నిధులతో సరిపెట్టారు. ఇప్పటికే పాత బకాయిలు రూ.50 కోట్లు ఉన్నాయి. వాటికి పోను కేటాయింపులు చూస్తే కేవలం రూ.150 కోట్లు ఇచ్చినట్లు. జిల్లాలోని కరువును పారదోలటంతో పాటు ఫ్లోరైడ్ నుంచి గట్టెక్కాలంటే వెలిగొండ నీరే శరణ్యం. జిల్లా వాసులకు తాగు, సాగునీరుకు ఈ ప్రాజెక్టే ఏకైక ఆధారం. ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, కడప జిల్లాల పరిధిలో 4.40 లక్షల ఎకరాలకు, వందలాది గ్రామాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీరందించాల్సి ఉంది. 2018 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని బాబు సర్కారు హామీ ఇచ్చింది. దాని నిధుల కేటాయింపులు చూస్తే మరో దశాబ్ద కాలానికి కూడా వెలిగొండ పూర్తయ్యే పరిస్థితి కానరావడం లేదు. సాగు నీరు సంగతి దేవుడెరుగు, తాగునీరు కూడా అందదు. మిగిలిన ప్రాజెక్టులకూ అరకొర కేటాయింపులే..: కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్‌కు రూ.125 కోట్లు అవసరం కాగా బడ్జెట్లో రూ.7.45 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇక పాలేరు రిజర్వాయర్ పరిధిలో రూ.50 కోట్లు అవసరం కాగా రూ.3.98 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారు. రాళ్లపాడు స్టేజ్–2 పనులకు రూ.1.28 కోట్లు, వీరరాఘవునికోట ప్రాజెక్టుకు రూ.1.8 కోట్లు, కంభం చెరువుకు రూ.28 లక్షలు, పాలేటి బిట్రగుంట పనులకు రూ.45 లక్షలు, ఒంగోలు నగర పరిధిలోని పోతురాజు కాలువ డ్రైనేజీ పనులకు రూ.45 లక్షల చొప్పున కేటాయించారు. ఇక గుండ్లకమ్మ ప్రాజెక్టుకు సంబంధించి తాజా బడ్జెట్లో రూ.266.73 కోట్లు కేటాయించినట్లు లెక్కల్లో చూపారు. వాస్తవానికి గుండ్లకమ్మ ప్రాజెక్టు వైఎస్ హయాంలోనే 95 శాతం పనులు పూర్తయ్యాయి. ఆయన మరణానంతరం నిధుల కేటాయింపులు లేవు. పట్టుమని రూ.20 నుంచి రూ.30 కోట్ల నిధులు కేటాయిస్తే పనులు పూర్తయ్యేవి. అయితే చంద్రబాబు సర్కారు వచ్చాక బడ్జెట్ అంచనాలను ఇబ్బడిముబ్బడిగా పెంచారు. ఈ ప్రాజెక్టుకు రూ.100 కోట్లలోపు నిధులు అయితే సరిపోతాయని అధికారులు తాజా అంచనాలు ప్రభుత్వానికి పంపారు. విచిత్రమేమిటంటే బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు రూ.266.73 కోట్లు కేటాయించటం గమనార్హం. ప్రభుత్వ పెద్దలు, కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున దోచుకునేందుకే అంచనాలను భారీగా పెంచుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక నాగార్జున సాగర్ కాలువ ఆధునికీకరణ పనులకు రూ.103.56 కోట్లు కేటాయించారు. మొత్తంగా జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు చంద్రబాబు సర్కారు నిధుల కేటాయింపుల్లో మొండిచేయి చూపిందని చెప్పాలి. పోర్టు..పారిశ్రామిక కారిడార్ల ఊసేదీ..: బడ్జెట్లో రామాయపట్నం ఊసే లేదు. దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్, కనిగిరి నిమ్జ్‌లను ఏ మాత్రం పట్టించుకున్నట్లు లేదు. విమానాశ్రయం సంగతి మరిచారు. నిరుద్యోగ భృతికి కేవలం రూ.500 కోట్లను కేటాయించటం చూస్తే బాబు సర్కారు చిత్తశుద్ధి ఇట్టే తెలిసిపోతుంది. ఇక ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్యసేవగా మార్చినా మొత్తం బడ్జెట్లో వెయ్యి కోట్లు మాత్రమే కేటాయించారు. ఇప్పటికీ ఈ పథకానికి సంబంధించిన పాత బకాయిలే జిల్లా స్థాయిలో రూ.30 కోట్ల వరకు ఉన్నాయి. వాటిని చెల్లించే పరిస్థితి లేదు. ఇక డ్వాక్రా మహిళల పెట్టుబడి నిధి, రైతు రుణమాఫీలకు నామమాత్రంగా నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నారు. రైతుల కోసం రూ.5 వేల కోట్లకుపైగా స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ఆదుకుంటామని బాబు సర్కారు గతంలో పలుమార్లు చెప్పినా బడ్జెట్లో మొక్కుబడి కేటాయింపులతో సరిపెట్టారు. ఇక పేదలకు అడిగినన్ని గృహాలు కట్టిస్తామని ఎన్నికల ముందు హామీలిచ్చినా అవేమీ నెరవేరలేదు. తాజాగా లక్షల గృహాలు నిర్మిస్తామంటూ బాబు సర్కారు ప్రకటించిన ఆ స్థాయిలో నిధుల కేటాయింపుల్లేకపోవడం గమనార్హం. మొత్తంగా 2017–18 బాబు బడ్జెట్లో జిల్లాకు మొండిచేయి మిగిలింది. అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
భూములు తీసుకుంటే.. కాపురాలు కూలుతాయి!
⇒ భూ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ ⇒ భూ దందాపై మూకుమ్మడిగా రైతుల అభ్యంతరాలు మచిలీపట్నం(కృష్ణా జిల్లా): ప్రభుత్వంపై రైతులు తిరుగుబావుటా ఎగురవేశారు. మచిలీపట్నంలో పారిశ్రామిక కారిడార్, పోర్టు నిర్మాణం పేరుతో 33,601 ఎకరాలను సమీకరించేందుకు ప్రభుత్వం ఇటీవల భూసమీకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపధ్యంలో మంగళవారం కోన, పోలాటితిప్ప, అరిసేపల్లి, మేకవానిపాలెం, బుద్దాలపాలెం గ్రామాల్లో రైతుల నుంచి అంగీకారపత్రాలు, అభ్యంతరాలు తీసుకునేందుకు అవగాహన సదస్సులను మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (ఎంఏడీఏ) అధికారులు ఏర్పాటు చేశారు. మాకు ఉన్న ఎకరం, రెండు ఎకరాల భూమిని కూతుళ్ల పెళ్లి చేసే సమయంలో కట్నంగా ఇచ్చామని, భూ సమీకరణ పేరుతో ఆ భూములు తీసుకుంటే వందలాది కాపురాలు కూలిపోయే ప్రమాదం ఏర్పడుతోందని పలువురు మహిళలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఐదు గ్రామాలకు చెందిన రైతులు పార్టీలకు అతీతంగా భూసమీకరణకు భూములు ఇచ్చేది లేదని ఏకగ్రీవంగా తీర్మానించి సంతకాలు చేసి ఎంఏడీఏ అధికారులకు అందజేశారు. అసైన్డ్ భూములు సమీకరణ నోటిఫికేషన్లో ఒకరి పేరున ఉండగా వేరే రైతులు ఆ భూమికి హక్కుదారులుగా ఉన్నారని ఈ తరహా రైతులను ఏం చేస్తారని రైతులు అధికారులను ప్రశ్నించారు. గ్రామాలకు గ్రామాలను సైతం ఖాళీ చేయించే పనిలో భాగంగా భూసమీకరణ అంశాన్ని టీడీపీ ప్రభుత్వం తెరపైకి తెచ్చిందని, ప్రాణాలు పోయినా భూములను ఇచ్చేది లేదని రైతులు తెగేసి చెప్పారు. భూసమీకరణ అవగాహన సదస్సు నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. పోలీసులను అడ్డు పెట్టుకుని భూములు గుంజుకోలేరని రైతులు ఈ సందర్భంగా స్పష్టంచేశారు. భూసమీకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని, ప్రభుత్వ భూ దందాను ఇప్పటికైనా ఆపాలని అన్ని గ్రామాల్లోని రైతులు నినాదాలు చేశారు. అధికారులు, రైతుల మధ్య వాగ్వాదం జరగటంతో పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు జోక్యం చేసుకున్నారు. -
విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ కు ఏడీబీ నిధులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఫండింగ్ ఏజెన్సీ ‘ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్’ (ఏడీబీ) తాజాగా భారత్ తొలి తీరప్రాంత పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు రుణ సాయం అందించేందుకు ఆమోదం తెలిపింది. ఈ పారిశ్రామిక కారిడార్ విశాఖపట్నం-చెన్నై మధ్యలో నిర్మాణం కానుంది. దీనికోసం ఏడీబీ 631 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 4,200 కోట్లు) మేర నిధులను అందించడానికి ముందుకొచ్చింది. ఈ నిధులతో తొలిగా మొత్తం 2,500 కిలోమీటర్ల కారిడార్ ఏర్పాటులో ప్రధానమైన 800 కిలోమీటర్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేయవచ్చని, దీంతో దక్షిణ తూర్పు ఆసియా దేశాలతో భారత్ వాణిజ్య కార్యకలాపాలు మరింత బలోపేతమవుతాయని ఏడీబీ పట్టణాభివృద్ధి విభాగపు ప్రధాన విశ్లేషకుడు మనోజ్ శర్మ అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు వల్ల విశాఖ-చెన్నై తీరం పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా అవతరిస్తుందని చెప్పారు. కాగా మొత్తం ప్రాజెక్ట్ వ్యయం 846 మిలియన్ డాలర్లు. మిగతా 215 మి. డాలర్లను ఆంధ్రప్రదేశ్ సర్కారు సమకూర్చాల్సి ఉంటుంది. -
పారిశ్రామిక కారిడార్‌గా తీరప్రాంతం
హంసలదీవి పర్యటనలో సీఎం చంద్రబాబు కోడూరు : పరిశ్రమలు స్థాపించేందుకు అనువుగా ఉన్న సముద్రతీర ప్రాంతం వెంబడి పారిశ్రామిక(ఇండస్ట్రియల్) కారిడార్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సీఎం ఎన్.చంద్రబాబు తెలిపారు. హంసలదీవి పవిత్ర కృష్ణా సాగరసంగమ ప్రాంతంలో సీఎం గురువారం పర్యటించి.. పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. ఇచ్ఛాపురం దగ్గర నుంచి తడ వరకు సముద్రతీరం వెంబడి రోడ్లు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సీఎం చెప్పారు. బందరు పోర్టు పనులను త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక హెలీకాప్టర్ ద్వారా సాగరసంగమ ప్రాంతానికి చేరుకున్న సీఎం కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణమ్మ-సాగరుడు కలిసే ప్రాంతంలో నదీమతల్లికి హారతులిచ్చారు. ఎన్టీఆర్ వైద్యసేవలో మరో 106 వ్యాధులను చేర్చామని తెలిపారు. ఇప్పటికే వైద్యశాలల్లో వ్యాధిగ్రస్తుల డేటా ఉందని, ఈ డేటాను వైద్యులు తీసుకుని వారివద్దకే వెళ్లి వైద్యం చేస్తారని చెప్పారు. 26,27న గుంటూరులో జాబ్‌మేళా: దళిత, గిరిజన యువతకు జాబ్‌మేళాలు నిర్వహించాలని సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబును సీఎం చంద్రబాబు ఆదేశించారు. గురువారం ఉదయం తన నివాసంలో మంత్రి రావెలతో కలసి ఈనెల 26, 27న గుంటూరులోని చౌడవరంలో నిర్వహించే జాబ్‌మేళా వాల్‌పోస్టర్‌ను సీఎం విడుదల చేశారు. రావెల ట్రస్ట్, వికాస సంస్థ ఆధ్వర్యంలో ఆర్వీఆర్-జేసీ కళాశాల ప్రాంగణంలో మేళా జరగనుంది. టెన్త్ నుంచి ఇంజనీరింగ్ వరకు చదువుకున్న వారెవరైనా ఈ మేళాకు రావచ్చన్నారు. ఆసక్తి గలవారు www.ravelatrust. org వెబ్సైట్ ద్వారా ఈనెల 23లోగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. -
చంద్రబాబుకు భూదాహం
ఏపీ రైతు సంఘం విజయవాడ (భవానీపురం) : మచిలీపట్నం పోర్టు, ఇండస్ట్రియల్ కారిడార్ కోసం లక్ష ఎకరాల భూమిని సమీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించడం ముఖ్యమంత్రి చంద్రబాబు భూ దాహానికి నిదర్శనమని ఏపీ రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు బి.బలరాం, వంగల సుబ్బారావు సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. బందరు, పెడన మండల పరిధిలో 30 గ్రామాల్లో భూ సమీకరణకు రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించటం, అందుకు ప్రభుత్వం పూనుకోవడం దారుణమని పేర్కొన్నారు. 30 గ్రామాల్లో ఈ భూమినంతటినీ మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ద్వారా సంవత్సరంలోపు తీసుకోనుందని ఆరోపించారు. కేవలం రెండు వేల ఎకరాలు సరిపోయే పోర్టుకు లక్ష ఎకరాలు సేకరించడం క్విడ్ ప్రోకో కోసమేనని విమర్శించారు. గతంలో భూ సేకరణకు గ్రామాల్లో సభలు నిర్వహించేందుకు ఎంపీ కొనకళ్ల నారాయణ, మంత్రి కొల్లు రవీంద్ర వెళ్తే ప్రజలు తిరుగుబాటు చేశారని గుర్తు చేశారు. మచిలీపట్నం కోన గ్రామంలో ఇద్దరు నేతలను తరిమి కొట్టారని పేర్కొన్నారు. పొట్లపాలెంలో ఏర్పాటు చేసిన సభను బహిష్కరించారని వివరించారు. భూ సమీకరణ పేరుతో ఏకంగా 426 చదరపు కిలోమీటర్ల పరిధిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుందని, దీంతో బందరు మండలంతోపాటు 29 గ్రామాల, పెడన మండలంలోని కాకర్లమూడితో కలిసి 30 గ్రామాలు కనుమరుగుకానున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ గ్రామాల్లో సుమారు 2.25 లక్షల మంది వ్యవసాయంపైనే జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఇప్పుడుకూడా ప్రభుత్వం భూ సమీకరణ ఆపకపోతే రైతులు తీవ్రంగా ప్రతిఘటిస్తారని హెచ్చరించారు. -
'ఇండస్ట్రియల్ కారిడార్‌కు ఆమోదం తెలపాలి'
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ కారిడార్‌కు ఆమోదం తెలపాలని తెలంగాణ ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ కు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఢిల్లీ వెళ్లిన ఆయన ఉదయం 11 గంటలకు కేంద్రమంత్రి నిర్మల సీతారామన్‌తో భేటీ అయ్యారు. అనంతరం మద్యాహ్నం 3 గంటలకు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో కేటీఆర్ భేటీ కానున్నట్టు సమాచారం. -
పారిశ్రామిక వాడగా శ్రీసిటీ
హార్టికల్చర్ హబ్‌గా రాయలసీమ శ్రీసిటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు సాక్షి ప్రతినిధి, తిరుపతి: పారిశ్రామిక వాడగా శ్రీసిటీ.. ప్రజారాజధానిగా అమరావతి అంతర్జాతీయ స్థాయిలో శాశ్వతంగా నిలిచిపోతాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. సోమవారం శ్రీసిటీలో ఏర్పాటుచేసిన మాండలెజ్ (క్యాడ్బరీ) పరిశ్రమ తొలిదశ ఉత్పత్తులను ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ శ్రీసిటీ పరిశ్రమలకు అత్యంత అనువైందనీ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు వుండేలా రూపుదిద్దుకుంటోందన్నారు. అందుకే ప్రపంచస్థాయి సంస్థలు ఇక్కడకు వస్తున్నాయని అన్నారు. శ్రీసిటీని మూడు నగరాలను కలిపే ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రాన్ని కలుపుతూ నెల్లూరు, చెన్నై ఎక్స్‌ప్రెస్ హైవే రూపుదిద్దుకోబోతోందని తెలిపారు. ఈ ప్రాంతంలో సోమశిల, కండలేరు నీరు ఉండడం వల్ల నీటి సమస్య లేదన్నారు. కృష్ణపట్నం పవర్ ప్లాంటు ఉన్నందున విద్యుత్ సమస్య తలెత్తదన్నారు. శ్రీసిటీలో 25 వేల కోట్ల పెట్టుబడులు ఇప్పటికే శ్రీసిటీలో 80 కంపెనీలు ఉత్పత్తులు ప్రారంభించాయని మరో 40 కంపెనీలు నిర్మాణ దశలో వున్నాయని సీఎం అన్నారు. 35 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించాయనీ, రూ.25వేల కోట్ల మేరకు పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. దేశస్థాయిలో ఇండస్ట్రియల్ టౌన్షిప్ అంటే శ్రీసిటీ ఒక్కటేనని గుర్తించేలా తీర్చిదిద్దుతామని తెలి పారు. ఇక్కడ పనిచేస్తున్న కార్మికులకు అందుబాటులో వుండే విధంగా ఆరు నెలల్లో 5 వేల గృహాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని సూచించారు. రవాణా వ్యవస్థలో శ్రీసిటీకి రైలు, రోడ్డు, జల మార్గాలు, విమానమార్గాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. శ్రీసిటీలో 1600 మంది గ్రామీణ యువతకు శిక్షణ కల్పించి ఉద్యోగావకాశాలు కల్పించడం అభినందనీయమన్నారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దనున్నామని అన్నారు. ప్రస్తుతం 23 హెక్టార్లలో కోకో పండిస్తున్నామని మరో పదేళ్లలో 75వేల హెక్టార్లకు విస్తరించే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పాల ఉత్పత్తిలో ఏపీ ప్రథమ స్థానంలో వుందనీ, చాక్లెట్ ఉత్పత్తులకు అవసరమయ్యే పాల పౌడర్‌కు కొరతలేదని తెలిపారు. శ్రీసిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన టూరిజం స్పాట్‌ను ఏర్పాటుచేయాలని సూచించారు. దీనిపై మాండలెజ్ సంస్థ ప్రతినిధులతో చర్చించామని తెలిపారు. కార్యక్రమంలో క్యాడ్బరీ సంస్థ ప్రతినిధులు డేనియల్ మెర్స్, ఆస్కార్రంగెల్, చంద్రమౌళి, వెంకటేశన్, రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు తలారి ఆదిత్య, సత్యప్రభ, సుగుణమ్మ, శ్రీసిటీ అధినేతలు రవీంద్రసన్నారెడ్డి, శ్రీనిరాజు, జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్, జేసీ భరత్‌గుప్తా, తిరుపతి సబ్‌కలెక్టర్ ిహ మాంశు శుక్లా, చిత్తూరు ఎస్పీ జి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఇండస్ట్రియల్ కారిడార్‌కు రైతులు సహకరించాలి
ఆర్డీవో సూర్యారావు నక్కపల్లి: ఇండస్ట్రియల్ కారిడార్‌కు రైతులు సహకరిస్తే పనులు వేగవంతం చేస్తామని నర్సీపట్నం ఆర్డీవో కె.సూర్యారావు కోరారు. బుధవారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో నలుగురు డిప్యూటీ కలెక్టర్లతో కలిసి సమావేశం అయ్యారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. నక్కపల్లి మండలంలో వేంపాడు, రాజయ్యపేట, అమలాపురం, డీఎల్‌పురం, బుచ్చిరాజుపేట, చందనాడ ప్రాంతాల్లో రెండు విడతలుగా సుమారు 6 వేల ఎకరాలు భూసేకరణ జరుగుతుందన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని చెప్పారు. కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చినందున భూముల సర్వేకు ఐదు బృందాలు నియమించామని చెప్పారు. గ్రామాల్లో బుధవారం నుంచి సర్వే ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రభుత్వ, జిరాయితీ భూముల సర్వేకు రైతులు సహకరించాలని కోరారు. సర్వే పూర్తయితే నష్టపరిహారం త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతులు సమగ్ర వివరాలు సర్వే బృందాలకు అందజేయాలని కోరారు. డిప్యూటీ కలెక్టర్లు గోవిందరాజులు, వి.రమణ,సత్తిబాబు, సుబ్రమణ్యం,సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. -
తిరుధామం.. పారిశ్రామిక తోరణం
ఐటీ, ఎలక్ట్రానిక్ పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి శ్రీకాళహస్తి-ఏర్పేడు ఇండస్ట్రియల్ కారిడార్‌లో భూముల సేకరణ స్థలం కావాలని ఏపీఐఐసీకి వినతులు తిరుపతి చుట్టుపక్కల 500 ఎకరాల భూమి సేకరించేందుకు కసరత్తు తిరుపతి: తిరునగరిలో పరిశ్రమల ఏర్పాటుకు పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. రాష్ట్రం వీడిపోయాక తిరుపతి పరిశ్రమల కేంద్రంగా మారుతోంది. ఇప్పటికే శ్రీసిటీ సెజ్‌లో వందలాది పరిశ్రమలు నెలకొల్పారు. తిరుపతి సమీపంలోని విమానాశ్రయం వద్ద రూ.1,070కోట్ల పెట్టుబడితో శ్రీవెంకటేశ్వర ఎలక్ట్రానిక్ మొబైల్ తయారీ హబ్ ఏర్పడింది. విద్యా సంస్థలు ఐఐటీ, ఐజర్‌కు శంకుస్థాన చేశారు. చెన్నె, బెంగళూరు నగరాలకు తిరుపతి అందుబాటులో ఉండటం, అంతర్జాతీయ విమానాశ్రయం కలిగి ఉండటం కలిసొచ్చే అంశం. 1,720 ఎకరాలు సిద్ధం ఏపీఐఐసీ ఆధ్వర్యంలో జిల్లాలో 1,720 ఎకరాలు సిద్ధంగా ఉన్నాయి. పీలేరు సమీపంలో 600 ఎకరాలు, కలికిరి సమీపంలోని తాటిగుంటపల్లెలో 1000, గంగవరం మండలం గండ్రరాజులపల్లెలో 120 ఎకరాలు ఉన్నాయి. ఎక్కువమంది పారిశ్రామికవేత్తలు తిరుపతి సమీపంలోనే భూములు కావాలని దరఖాస్తు చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తిరుపతి చుట్టుపక్కల 500 ఎకరాల భూమిని సేకరించడానికి ఏపీఐఐసీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు జిల్లాలో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో 2వేల ఎకరాల భూమిని పరిశ్రమల కోసం కేటాయించారు. శ్రీకాళహస్తి-ఏర్పేడు ప్రాంతంలో.. తిరుపతి చుట్టుపక్కల భూములు లేకపోవడంతో శ్రీకాళహస్తి-ఏర్పేడు ప్రాంతాల వైపు పారిశ్రామికవేత్తలు దృష్టి సారించినట్లు సమచారం. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయర్ల నుంచి నీటిని తరలించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఇక్కడ ఇబ్బంది తలెత్తితే కాళంగి రిజర్వార్ నుంచి నీటిని వినియోగించుకునేందుకు వీలుగా ప్రయివేటు ఏజెన్సీ ద్వారా డీపీఆర్ సిద్ధం చేశారు. ఇటీవలే సర్వే కూడా పూర్తి అయినట్లు సమాచారం. ఐటీ కంపెనీలు.. ప్రపంచ అగ్రశ్రేణి ఐటీ సంస్థలు తిరుపతిలో ఏర్పాటుచేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగా తిరుపతి సమీపంలోని విమానాశ్రయ సమీపంలో, ఏర్పేడు ప్రాంతాల్లో కంపెనీ ప్రతినిధులు భూములను పరిశీలించినట్లు తెలుస్తోంది. టీసీఎస్, హెచ్‌సీఎల్ సంస్థల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెరికాకు చెందిన కాగ్నిజెంట్ టెక్నాలజీస్ సంస్థ రూ.1,500 కోట్లతో తిరుపతిలో క్యాంపస్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు, ఇందులో భాగంగానే కంపెనీ ప్రతినిధులు అనువైన ప్రదేశాలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద తిరుపతి నగరంలో పరిశ్రమలు స్థాపించేందుకు కంపెనీ యజమానులు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుతం ఈ అవకాశాన్ని ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటుందో వేచి చూడాలి. -
ఇండస్ట్రియల్ కారిడార్‌గా తిరుపతి
రేణిగుంటలో సెల్కాన్ తయారీ యూనిట్‌కు సీఎం భూమిపూజ సాక్షి ప్రతినిధి, తిరుపతి: పరిశ్రమల ఏర్పాటుకు తిరుపతి అనుకూల ప్రాంతమని,జాతీయ రహదారుల సౌకర్యం ఉన్నందున తిరుపతి-చెన్నై -నెల్లూరు మధ్య తిరుపతి కేంద్రంగా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయనున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తిరుపతి-ఏర్పేడు ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ కారిడార్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని ఐటీ పార్కులో రూ.150 కోట్లతో ఏర్పాటు చేస్తున్న సెల్కాన్ మొబైల్ తయారీ కంపెనీకి ముఖ్మమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం భూమి పూజ చేశారు. కంపెనీ ఆవరణలో మొక్కలు నాటి, నీరు పోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెంకటేశ్వర మొబైల్ యూనిట్లో మొదటి కంపెనీ సెల్కాన్ నిర్మాణ పనులు ప్రారంభం కావడం హర్షణీయమన్నారు. ఇండియాలోని బెస్ట్ కంపెనీల్లోఒకటైన సెల్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తిరుపతికి రావడం సంతోషమన్నారు. దీని ద్వారా మొదటి దశలో ప్రత్యక్షంగా 20వేల మందికి, పరోక్షంగా 40 వేల మందికి ఉపాధి కలుగుతుందని పేర్కొన్నారు. సెల్కాన్ సీఎండీ వై.గురు కంపెనీ ప్రగతిని వివరించారు. సీఎండీ గురు, డెరైక్టర్లు పవన్, రాధాకృష్ణలను ముఖ్యమంత్రి సన్మానించారు. -
రాచకొండకు రాజయోగం
చౌటుప్పల్: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని రాచకొండకు మళ్లీ రాజయోగం పట్టనుంది. ఇన్నాళ్లూ ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన రాచకొండకు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టీఎస్ ఐపాస్ పేరుతో తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానంతో మహర్దశ పట్టనుంది. ఈ పారిశ్రామిక విధానానికి ఆకర్షితులవుతున్న పారిశ్రామికవేత్తలు, ఇప్పుడిప్పుడే హైదరాబాద్‌కు చేరువలోని రాచకొండపై ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇది పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో అనువైన ప్రాంతమని భావిస్తున్నారు. నల్లగొండ-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల సరిహద్దులో రాచకొండ అటవీ ప్రాంతం ప్రభుత్వ, అటవీ, అసైన్డ్, సీలింగ్ భూములతో కలుపుకొని 42 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇది హైదరాబాద్ నగరానికి చేరువలో, శంషాబాద్ విమానాశ్రయానికి 25 కిలోమీటర్ల లోపు దూరంలో, ఔటర్ రింగ్‌రోడ్డుకు అతి సమీపంలో ఉంది. దీంతో ప్రభుత్వం మూడు జిల్లాల సరిహద్దులోని ప్రాంతమంతటినీ పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే రెండుమార్లు ఈ ప్రాంతంలో ఏరియల్ సర్వే చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు అనువైన ప్రాంతంగా గుర్తించారు. పారిశ్రామిక వేత్తలు కూడా పరిశీలించి బాగుందని చెప్పడంతో, మహబూబ్‌నగర్ జిల్లా ముశ్చర్లలో ఫార్మాసిటీకి 11 వేల ఎకరాల భూమిని కేటాయించారు. రాచకొండలో 2 వేల ఎకరాల్లో ఆత్యాధునిక హంగులతో కూడిన సినిమా సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైలు బోగీల పరిశ్రమ రాచకొండలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన స్థలం కోసం ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం సర్వే చేసింది. 14 వేల ఎకరాల భూమి పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉన్నట్టు తేల్చింది. ఈ భూమిని క్లస్టర్లుగా విభజించనున్నారు. ఒక్కో క్లస్టర్‌ను ఒక్కో దానికి కేటాయించే ఆలోచన చేస్తున్నారు. ఓ క్లస్టర్లో 2 వేల ఎకరాలు ఫిలింసిటీకి, మరో 2 వేల ఎకరాలు స్మార్ట్ సిటీకి కేటాయించే ఆలోచన చేస్తున్నారు. హైదరాబాద్ పరిసరాల్లో రైలు బోగీల పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చిన రుయా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ పవన్‌కుమార్ రుయా, అంతర్జాతీయ గుర్తింపు ఉన్న కంపెనీల ప్రతినిధులతో కలసి వారంరోజుల క్రితం రాచకొండ ప్రాంతాన్ని పరిశీలించారు. శంషాబాద్ విమానాశ్రయం, ఔటర్ రింగ్‌రోడ్డు, ఎన్‌హెచ్-65లకు రాచకొండ ఎంతదూరంలో ఉందనే విషయంపై ఆరా తీశారు. అనంతరం రాచకొండ పరిశ్రమల ఏర్పాటుకు బాగుందని కితాబునిచ్చారు. ఏడు దేశాల కంపెనీల సహకారంతో 2 వేల ఎకరాల్లో రూ.20 వేల కోట్ల పెట్టుబడులతో స్మార్ట్సిటీతోపాటు, పలు పరిశ్రమల ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నట్టు తెలిపారు. ఇప్పటికే ప్రభు త్వ పరిశీలనలో ఫిల్మ్‌సిటీ, స్పోర్ట్స్‌సిటీ, ఎడ్యుకేషన్ హబ్ లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ప్రతిపాదనల్లో ఉన్నాయి. కాగా ఇప్పటికే, రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోనే పలు పరిశ్రమలకు ఏపీఐఐసీ భూములను కేటాయించింది. రాచకొండకు నాలుగులేన్ల రోడ్లు రాచకొండకు హైదరాబాద్ నుంచి, శంషాబాద్ నుంచి, 65వ నెంబరు జాతీయ రహదారి నుంచి నాలుగులేన్ల రోడ్లను అభివృద్ది చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనికి తోడు ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్‌రోడ్డుకు అనుసంధానంగా, మెదక్, వరంగల్, కరీంనగర్, శ్రీశైలం, విజయవాడ జాతీయ రహదారులను కలుపుతూ, మరో రింగ్ రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇదే విషయమై ఇప్పటికే హైదరాబాద్ నుంచి 60 నుంచి 100 కి.మీ. దూరంతో రింగ్ రోడ్డు ఉంటుందని ప్రకటన కూడా చేసింది. హైవేలను కలపడం ద్వారా, రాజధానికి వాహనాల రద్దీని తగ్గించాలనేది ఈ రింగ్‌రోడ్డు ఉద్దేశం. ఈ రోడ్డుతో రాచకొండ ప్రాంతం రింగురోడ్డు లోపలకు వస్తుంది. ైెహ దరాబాద్‌కు రవాణా సౌకర్యం మరింత మెరుగవుతుంది.