
తుమకూరుకు త్వరలో మోడీ రాక?
ఈనెల 22న లేదా ఆగస్టు 9న వచ్చే అవకాశం
సాక్షి, బెంగళూరు: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తుమకూరుకు వస్తున్నట్లు సమాచారం. కేంద్ర బడ్జెట్‌లో తుమకూరుకు పారిశ్రామిక కారిడార్‌ను ప్రకటించిన నేపథ్యంలో తుమకూరు శివార్లలోని వసంత నరసాపురలో 100 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఫుడ్‌పార్క్‌కు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్రానికి వస్తున్నట్లు తెల్సింది. ఈనెల 22న లేదా ఆగస్టు 9న ప్రధాని నరేంద్రమోడీ మొదట బెంగళూరు నగరానికి అక్కడి నుంచి తుమకూరుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాని పదవిని చేపట్టిన తరువాత మొట్టమొదటి సారిగా నరేంద్రమోడీ రాష్ట్రానికి వస్తుండడంతో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు రాష్ట్ర బీజేపీ వర్గాలు కసరత్తులు చేస్తున్నాయి.