1400 అడుగులు వేసినా.. పైకి రాని గంగమ్మ!
బీబీనగర్: నల్లగొండ జిల్లాలో కరువుతో భూగర్భజలాలు అడుగంటిపోయూయనడానికి నిదర్శనం ఈ ఫొటో.. వందకాదు, 200 కాదు ఏకంగా 1400 ఫీట్లు బోరువేసినా గంగమ్మ తల్లి పైకి రానంటోంది. ఉప్పల్‌కు చెందిన శ్రీనివాసచారి బీబీనగర్‌లోని గోకుల్‌నగర్ కాలనీలో ఇల్లు కట్టుకోవాలనుకున్నారు. ఇందుకోసం బుధవారం రాత్రి బోరు వేశారు. 1400 ఫీట్లు వేసినా చుక్కనీరు రాలేదు. అలాగే టీచర్స్ కాలనీలో నివాసముంటున్న జంగారెడ్డి కూడా తన ఇంటి ఆవరణంలో గురువారం రాత్రి 1100 ఫీట్లకు పైగా బోరు వేసినా.. నీళ్లు పడలేదు.