ట్యాంకుపై రాజ్‌కుమార్‌కు నచ్చజెబుతున్న అశోక్, (ఇన్‌సెట్‌లో) రాజ్‌కుమార్ రుణం ఇప్పించాలని ట్యాంక్ ఎక్కిన యువకుడు
కమలాపూర్(హుజూరాబాద్): సబ్సిడీ రుణం ఇప్పించాలని డిమాండ్ చేస్తూ ఓ గల్ఫ్ కార్మికుడు శుక్రవారం వాటర్ ట్యాంకు ఎక్కి గంటకు పైగా ఆందోళనకు దిగాడు. బాధితుడు, గ్రామస్తుల కథనం ప్రకారం... వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్‌కు చెందిన గందసిరి రాజ్‌కుమార్ కొన్నేళ్ల క్రితం జీవనోపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లాడు. అక్కడ సరైన ఉపాధి లేక తిరిగి వచ్చాడు. ఇక్కడ హమాలీగా పనిచేస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ బాధితులకు స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు నిధులు మంజూరు చేసింది.
దీంతో కమలాపూర్ మండలం నుంచి పలువురు దరఖాస్తు చేసుకోగా మొదటి విడతగా కొందరికి మంజూరయ్యాయి. కమలాపూర్ నుంచి సుమారు 50 మంది ఒక్కొక్కరు రూ.60 వేల చొప్పున బ్యాంకులో డిపాజిట్ చేశారు. నెల గడుస్తున్నా రుణం రాకపోవడంతో రాజ్‌కుమార్ కమలాపూర్‌లోని వాటర్ ట్యాంకు ఎక్కి ఆందోళన చేపట్టాడు. పోలీసులు చేరుకుని ఎంత నచ్చజెప్పినా విన లేదు. టీఆర్‌ఎస్ నాయకుడు మౌటం అశోక్ కొన్ని డబ్బులు పట్టుకుని ట్యాంకు ఎక్కి ఇచ్చినప్పటికీ తనకు రూ.2లక్షలు ఇస్తే తప్పా కిందికి దిగనని భీష్మించాడు. చివరకు మాజీ సర్పంచ్ గందసిరి రవికుమార్ గంట సేపట్లో రూ.2లక్షలు తాను ఇస్తానని హామీ ఇవ్వగా అతడు కిందకు దిగాడు.
Comments
Please login to add a commentAdd a comment