
ఓరుగల్లుకు వెలుగులు
చారిత్రక నగరంపై సర్కారు దృష్టి
{Vేటర్ వరంగల్‌గా నిర్ణయించిన ప్రభుత్వం
పోలీస్ కమిషనరేట్‌గా ఉత్తర్వులు
టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు ప్రక్రియ వేగం
‘రైల్వే వ్యాగన్ వర్క్‌షాప్’పై కదలిక
వరంగల్ : తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు కేంద్రంగా మారుతోంది. హైదరాబాద్-వరంగల్-భూపాలపల్లిని పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేస్తామనే ప్రభుత్వ ప్రకటనలకు తోడు పలు కేంద్ర పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన పలు సంస్థల ఏర్పాటు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ మొదలుపెట్టింది. దీంట్లో భాగంగా భూపాలపల్లిలో ప్రస్తతం 500 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఉత్పత్తి కేంద్రం ఉంది. 600 మెగావాట్ల ఉత్పత్తి కేంద్రం నిర్మాణం కొనసాగుతోంది. దీన్ని సత్వరం పూర్తి చేయడంతోపాటు వీటికితోడు 660 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన రెండు కేంద్రాలను వచ్చే ఏడాది ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వరంగల్ నగరాన్ని భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. వరంగల్ నగ రం హోదాను పెంచుతూ గ్రేటర్ వరంగల్‌గా మా ర్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ నగరంలోని రహదారులు, తాగునీరు ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధమవుతోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం వరంగల్ నగరాన్ని హృ దయ్ పథకంలో చేర్చింది. చారిత్రక నేపథ్యం ఉన్న నగరాలను మౌలిక వసతుల పరంగా, పర్యాటక కేం ద్రాలుగా తీర్చిదిద్దేందుకు మొదటి దశలో రూ. 40.54 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.
పోలీస్ శాఖ పరంగా వరంగల్ అర్బన్ జిల్లాగా ఉన్న ప్రాంతాన్ని కమిషరేట్‌గా మార్చుతు రాష్ట్ర ప్రభుత్వం జనవరి 25న ఉత్తర్వులు జారీ చేసింది. కొద్ది రోజుల్లోనే వరంగల్ కమిషరేట్ విధులు మొదలుకానున్నాయి. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు అనుగుణంగా శాంతిభద్రతల పరిరక్షణకు కమిరేట్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చెబుతున్నారు.
వరంగల్‌లో ఉపాధి అవకాశాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోంది. దేశంలోనే పత్తి ఉత్పత్తి కేంద్రంగా ఉన్న వరంగల్ జిల్లా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకు అనువుగా ఉంటుందని నిర్ణయించింది. టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు అవసరమైన 2 వేల ఎకరాల భూములను జిల్లా యంత్రాంగం గుర్తిస్తోంది. టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకు అవసరమైన ప్రణాళిక రూపకల్పన కోసం వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి నేతృత్వంలోని ప్రజాప్రతినిధులు, అధికారుల బృందం ఇప్పటికే సూరత్, భీమండి, తిర్పూరులకు వెళ్లి వచ్చింది. షోలాపూర్‌లోనూ పర్యటించిన తర్వాత నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది.
రైల్వే వ్యాగన్ వర్క్‌షాప్ ఏర్పాటుకు అంశంలో కదలిక వచ్చింది. ఐదేళ్ల క్రితం మంజూరైన ఈ ప్రాజెక్టు భూముల లభ్యత లేక ముందుకుసాగలేదు. వ్యాగన్ వర్క్‌షాపు ఏర్పాటుకు అవసరమైన 50 ఎకరాల భూముల సేకరణ కోసం రాష్ర్ట ప్రభుత్వం రెండు రోజుల క్రితం రూ.18 కోట్లను కేటాయించింది. దీంతో వ్యాగన్ వర్క్‌షాపు ఏర్పాటు ప్రక్రియ మొదలవుతోంది.
ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు ప్రకారం తెలంగాణలో ఏర్పాటు చేయనున్న ఇండియ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సంస్థను వరంగల్‌లో ఏర్పాటు చేయాలని జిల్లాకు చెందిన లోక్‌సభ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉత్తర, దక్షిణ భారతదేశాలను అనుసంధానించే వరంగల్ ఐఐఎం ఏర్పాటుకు అనువుగా ఉంటుందని వివరించారు.