Railway wagon workshop
-
ఊరిస్తున్న ఉపాధి!
నిర్లక్ష్యం వీడని అధికార యంత్రాంగం పట్టించుకోని {పభుత్వం.. సమీక్షించని ఎంపీలు {పాజెక్టు మంజూరై ఐదేళ్లు.. పూర్తికాని రైల్వే వ్యాగన్ వర్కషాప్ భూ సేకరణ వరంగల్ : కాజీపేట రైల్వే వ్యాగన్ వర్క్‌షాప్‌తో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు నిరాశే మిగులుతోంది. ఐదేళ్ల క్రితమే ప్రాజెక్టు మంజూరైనా.. అధికారుల నిర్లక్ష్యంతో ఈ ప్రక్రియ ఎంతకూ ముందుకు కదలడం లేదు. ఇందుకు అవసరమైన భూములను సేకరించడంలో అధికారుల నిర్లక్ష్యం ప్రాజెక్టు ఏర్పాటుపై సందేహం కలిగిస్తోంది. 2010-11 రైల్వే బడ్జెట్లో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం పద్ధతి(పీపీపీ)లో కాజీపేటలో వ్యాగన్ వర్క్‌షాప్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని నిర్మాణానికి కాజీపేట సమీపంలోని అయోధ్యపురంలో ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానానికి చెందిన 54.28 ఎకరాల భూమి అనువైనదిగా గుర్తించారు. ఈ భూమిని దేవాదాయ శాఖ నుంచి రాష్ట్ర రవాణా శాఖకు బదలాయించేందుకు కోర్టు అనుమతి అవసరం కాగా, ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు రెండేళ్లకు పైగా సమయం పట్టింది. ఆ తర్వాత భూసేకరణ చేపట్టేందుకు రూ.18 కోట్లు కేటాయిస్తూ 2013 నవంబర్ 7న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అరుుతే నిధులు మాత్రం విడుదల కాకపోవడంతో భూసేకరణ నిలిచి, వర్క్‌షాప్ ఏర్పాటు అంశం అగిపోయింది. భూసేకరణ చేపట్టకపోవడంతో వర్క్‌షాప్ ఏర్పాటును ఇతర ప్రాంతాలకు తరలించాలని రైల్వే శాఖ యోచించింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. రైల్వే వ్యాగన్ వర్క్‌షాప్ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ కోసం రూ.18 కోట్లు విడుదల చేస్తూ ఈ ఏడాది జనవరి 28న ఉత్తర్వులు జారీ చేసింది. భూసేకరణ బాధ్యతను రోడ్లు, భవనాల శాఖకు అప్పగించింది. అరుుతే సంబంధిత అధికారులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు ఎంత భూమి సేకరించారు.. ఇంకెంత సేకరించాల్సి ఉంది అనే విషయంలోనూ స్పష్టత రావడం లేదు. కీలకమైన ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన భూముల సేకరణపై రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవడంలేదు. జిల్లాకు చెందిన పార్లమెంటు సభ్యులూ దీనిపై స్పందించడం లేదు. ఇలా ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యంతో వ్యాగన్ వర్క్‌షాప్ ఏర్పాటు కొలిక్కి రావడంలేదు. ఉపాధి అవకాశాలు వస్తాయని భావిస్తున్న యువతకు భూసేకరణ, ప్రాజెక్టు ఏర్పాటులో జాప్యం ఆందోళన కలిగిస్తోంది. -
ఓరుగల్లుకు వెలుగులు
చారిత్రక నగరంపై సర్కారు దృష్టి {Vేటర్ వరంగల్‌గా నిర్ణయించిన ప్రభుత్వం పోలీస్ కమిషనరేట్‌గా ఉత్తర్వులు టెక్స్టైల్ పార్కు ఏర్పాటు ప్రక్రియ వేగం ‘రైల్వే వ్యాగన్ వర్క్‌షాప్’పై కదలిక వరంగల్ : తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు కేంద్రంగా మారుతోంది. హైదరాబాద్-వరంగల్-భూపాలపల్లిని పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేస్తామనే ప్రభుత్వ ప్రకటనలకు తోడు పలు కేంద్ర పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన పలు సంస్థల ఏర్పాటు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ మొదలుపెట్టింది. దీంట్లో భాగంగా భూపాలపల్లిలో ప్రస్తతం 500 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఉత్పత్తి కేంద్రం ఉంది. 600 మెగావాట్ల ఉత్పత్తి కేంద్రం నిర్మాణం కొనసాగుతోంది. దీన్ని సత్వరం పూర్తి చేయడంతోపాటు వీటికితోడు 660 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన రెండు కేంద్రాలను వచ్చే ఏడాది ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వరంగల్ నగరాన్ని భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. వరంగల్ నగ రం హోదాను పెంచుతూ గ్రేటర్ వరంగల్‌గా మా ర్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ నగరంలోని రహదారులు, తాగునీరు ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధమవుతోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం వరంగల్ నగరాన్ని హృ దయ్ పథకంలో చేర్చింది. చారిత్రక నేపథ్యం ఉన్న నగరాలను మౌలిక వసతుల పరంగా, పర్యాటక కేం ద్రాలుగా తీర్చిదిద్దేందుకు మొదటి దశలో రూ. 40.54 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. పోలీస్ శాఖ పరంగా వరంగల్ అర్బన్ జిల్లాగా ఉన్న ప్రాంతాన్ని కమిషరేట్‌గా మార్చుతు రాష్ట్ర ప్రభుత్వం జనవరి 25న ఉత్తర్వులు జారీ చేసింది. కొద్ది రోజుల్లోనే వరంగల్ కమిషరేట్ విధులు మొదలుకానున్నాయి. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు అనుగుణంగా శాంతిభద్రతల పరిరక్షణకు కమిరేట్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. వరంగల్‌లో ఉపాధి అవకాశాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోంది. దేశంలోనే పత్తి ఉత్పత్తి కేంద్రంగా ఉన్న వరంగల్ జిల్లా టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు అనువుగా ఉంటుందని నిర్ణయించింది. టెక్స్టైల్ పార్కు ఏర్పాటు అవసరమైన 2 వేల ఎకరాల భూములను జిల్లా యంత్రాంగం గుర్తిస్తోంది. టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు అవసరమైన ప్రణాళిక రూపకల్పన కోసం వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి నేతృత్వంలోని ప్రజాప్రతినిధులు, అధికారుల బృందం ఇప్పటికే సూరత్, భీమండి, తిర్పూరులకు వెళ్లి వచ్చింది. షోలాపూర్‌లోనూ పర్యటించిన తర్వాత నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. రైల్వే వ్యాగన్ వర్క్‌షాప్ ఏర్పాటుకు అంశంలో కదలిక వచ్చింది. ఐదేళ్ల క్రితం మంజూరైన ఈ ప్రాజెక్టు భూముల లభ్యత లేక ముందుకుసాగలేదు. వ్యాగన్ వర్క్‌షాపు ఏర్పాటుకు అవసరమైన 50 ఎకరాల భూముల సేకరణ కోసం రాష్ర్ట ప్రభుత్వం రెండు రోజుల క్రితం రూ.18 కోట్లను కేటాయించింది. దీంతో వ్యాగన్ వర్క్‌షాపు ఏర్పాటు ప్రక్రియ మొదలవుతోంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రకారం తెలంగాణలో ఏర్పాటు చేయనున్న ఇండియ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సంస్థను వరంగల్‌లో ఏర్పాటు చేయాలని జిల్లాకు చెందిన లోక్‌సభ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉత్తర, దక్షిణ భారతదేశాలను అనుసంధానించే వరంగల్ ఐఐఎం ఏర్పాటుకు అనువుగా ఉంటుందని వివరించారు. -
కాజీపేట్‌లో వ్యాగన్ వర్క్‌షాప్‌కు సిద్ధం
రైల్వే మంత్రి సదానంద వెల్లడి హైదరాబాద్: తెలంగాణలోని కాజీపేట్‌లో రైల్వే వ్యాగన్ వర్క్‌షాపు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని రైల్వే మంత్రి డి.వి.సదానంద గౌడ తెలిపారు. దీనికి సంబంధించిన భూ సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. శుక్రవారమిక్కడి రైల్ నిలయంలో దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారులతో వివిధ అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో మిడ్‌లైఫ్ కోచ్ హ్యాబిలిటేషన్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అక్కడి ప్రభుత్వం కూడా స్థల సేకరణ చేయాల్సి ఉందన్నారు. ఏపీలో కొత్త రైల్వేజోన్ ఏర్పాటుపై కమిటీ వేశామని, అక్టోబర్ 14న కమిటీ సమర్పించే నివేదిక ను పరిశీలించాక తదుపరి చర్యలను ప్రకటిస్తామని వెల్లడించారు. రైల్వేలో భ ద్రత, రక్షణ, సేవలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి చెప్పారు. రైల్వే రక్షక దళంలో 17 వేల పోస్టులను భర్తీ చేయనున్నామని, వీటిలో 4 వేల పోస్టుల్లో మహిళలను నియమిస్తామని వివరించారు. భారతీయ రైల్వేలో కొత్త శకం ఆరంభమైందని, నిధుల లోటును అధిగమించేందుకే ఎఫ్‌డీఐలను అనుమతిస్తున్నామని రైల్వే మంత్రి వెల్లడించారు. దక్షిణమధ్య రైల్వే పరిధిలో వివిధ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి బడ్జెట్లో రూ.2,016 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. లైన్ల డబ్లింగ్, లెవల్ క్రాసింగ్ గేట్లు, ఆర్వోబీ, ఆర్యూబీల నిర్మాణం, ప్రయాణికులకు మౌలిక వసతులు, సిగ్నలింగ్ వ్యవస్థల కోసం ఎక్కువ నిధులను వినియోగిస్తామని వెల్లడించారు. అక్టోబర్ 2 నుంచి దేశవ్యాప్తంగా నిర్వహించే ‘స్వచ్ఛత్-అభియాన్’ కార్యక్రమంలో ఉద్యోగులంతా శ్రమదాన కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు. రైల్వేస్టేషన్లలో సోలార్ విద్యుత్తు వినియోగంపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. మహిళా ప్రయాణికులకు పటిష్ట భద్రత రైళ్లలో మహిళా ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని రైల్వే మంత్రి డి.వి.సదానందగౌడ తెలిపారు. ప్రధాన రైల్వేస్టేషన్లలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సర్వేలెన్స్ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రైల్వే రక్షక దళం 53వ బ్యాచ్ సబ్ఇన్స్పెక్టర్ల శిక్షణ ముగింపు సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని మౌలాలీ ఆర్పీఎఫ్ శిక్షణా కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘దీక్షంత్’(పాసింగ్ ఔట్ పరేడ్) కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై గౌరవవందనం స్వీకరించారు. రెల్వే మజ్దూర్ యూనియన్ నిరసన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను నిరసిస్తూ దక్షిణమధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ శుక్రవారం సికింద్రాబాద్ రైల్‌నిలయం వద్ద ధర్నా నిర్వహించింది. మరో ప్రధాన కార్మిక సంఘం దక్షిణమధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ప్రతినిధి బృందం మంత్రిని కలసి జాతీయ పెన్షన్ వ్యవస్థ నుంచి రైల్వేలకు మినహాయింపు ఇవ్వాలని, క్వార్టర్లను మెరుగుపర్చాలని విన్నవించింది. ప్రాజెక్టులు పూర్తి చేయండి: దత్తాత్రేయ తెలంగాణలో పెండింగ్‌లోని అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని ఎంపీ బండారు దత్తాత్రేయ మంత్రి సదానందగౌడను కలసి విజ్ఞప్తి చేశారు.