చిలుకూరు: ముక్కోటి ఏకాదశ పర్వదినాన్ని పురస్కరించుకుని చిలుకూరు బాలాజీ దేవాలయం కిటకిటలాడుతోంది. వెంకన్న దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావడంతో చిలుకూరు భక్తుల కోలాహలంతో సందడిగా మారింది. స్వామి వారి దర్శనానికి ఎనిమిది గంటలకు పైగా సమయం పడుతోంది. భక్తులు మూడు కి.మీ మేర బారలు తీరి స్వామి దర్శనానికి క్యూలైన్లలో వేచి ఉన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆలయ ప్రధాన అర్చకులు సౌందర రాజన్.. చిలుకూరు తెలంగాణ తిరుపతిగా పేర్కొన్నారు. ఈ రోజు స్వామివారిని దర్శించుకోవడం చాలా పవిత్రమైనదని ఆయన అన్నారు.