ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరపి లేకుండా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దాంతో అసిఫాబాద్ నియోజకవర్గంలోని వాంకిడి, కెరామేరీ, ఎద్దెన, సిరియాని గ్రామాలు తడిసి ముద్దయ్యాయి. అలాగే వాంకిడి మండలంలోని చిక్కిలి వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. దాంతో 15 గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
అయితే భారీ వర్షం కారణంగా శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లోకి భారీగా నీరు వచ్చి చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది.