మంథని (కరీంనగర్) : ఓ వైపు రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడుతుంటే మరోవైపు అకాల వర్షాలు రైతులకు కన్నీటిని మిగులుస్తున్నాయి. కరీంనగర్ జిల్లా మంథని డివిజన్లోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం భారీ వర్షాలు కురిశాయి. వర్షాలకు వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో రైతన్నలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.